ప్రమోద్ తివారీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రమోద్ తివారి
ప్రమోద్ తివారీ


రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
14 డిసెంబర్ 2013 – 2 ఏప్రిల్ 2018

రాజస్థాన్ (2022-2028)

తరువాత జీ.వీ.ఎల్. నరసింహారావు, బీజేపీ
నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్

శాసనసభ్యుడు
పదవీ కాలం
1980 – 2013
తరువాత ఆరాధన మిశ్రా (ఉప ఎన్నిక)
నియోజకవర్గం రాంపూర్ ఖాస్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1952-07-16) 1952 జూలై 16 (వయసు 72)
ప్రతాప్‌గఢ్‌, ఉత్తర ప్రదేశ్,, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి అల్కా తివారి (మరణం 27 ఏప్రిల్ 2012)
సంతానం సోనా తివారి (విజయశ్రీ తివారి), మోనా తివారి (ఆరాధన మిశ్రా)
నివాసం సంగ్రాంగర్హ్ లాల్ గంజ్, అఝరా
వెబ్‌సైటు www.pramodtiwari.co.in

ప్రమోద్ తివారీ (జననం 1952 జూలై 16) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు . ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లోని రాంపూర్ ఖాస్ అసెంబ్లీ స్థానం నుండి తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ప్రమోద్‌ తివారీ 2013లో రషీద్ మసూద్‌పై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో ఆయన రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై  2018 ఏప్రిల్ 11 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రమోద్ తివారీ 1980లో జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో రాంపూర్ ఖాస్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన రాంపూర్ ఖాస్ నుండి వరుసగా తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 1984 నుండి 1989 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. ప్రమోద్ తివారీ అనంతరం కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతగా సుదీర్ఘకాలం పనిచేసి 2013లో రాజ్యసభ ఎంపీ రషీద్ మసూద్‌పై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసి రాజ్యసభ సభ్యునిగా తొలిసారి పార్లమెంట్ కు ఎన్నికయ్యాడు. ప్రమోద్ తివారీ జూన్ 2022లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్‌ నుండి రెండవసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

రికార్డ్

[మార్చు]

ప్రమోద్‌ తివారీ రాంపూర్ ఖాస్ అసెంబ్లీ స్థానం నుండి వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకెక్కాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (11 March 2022). "42 ఏళ్లుగా ఒకే కుటుంబం.. ఒక్కటే పార్టీ". Archived from the original on 12 March 2022. Retrieved 12 March 2022.
  2. Namasthe Telangana (10 June 2022). "రాజస్థాన్‌లో కాంగ్రెస్ హవా… రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు విజయం". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  3. Namasthe Telangana (11 June 2022). "నిర్మల సీతారామన్‌, సూర్జేవాలా, ప్రమోద్ తివారీ గెలుపు". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
  4. Zee News (25 February 2002). "Pramod's name entered in Guinees Book of Worlds Records" (in ఇంగ్లీష్). Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.