నిరంజన్ రెడ్డి
సిర్గాపుర్ నిరంజన్‌రెడ్డి | |||
| |||
రాజ్యసభ సభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2022 జూన్ 21 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1970 జులై 23 సిర్గాపూర్, దిలావర్‌పూర్ మండలం, నిర్మల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | విద్యాసాగర్ రెడ్డి, విజయ లక్ష్మి | ||
సంతానం | 2 | ||
నివాసం | హైదరాబాద్ | ||
పూర్వ విద్యార్థి | సింబయాసిస్ లా కాలేజీ, పూణే | ||
వృత్తి | న్యాయవాది, సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు |
సిర్గాపుర్ నిరంజన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయవాది, సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు. ఆయనను 2022 మే 17న వైఎస్సార్‌సీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]నిరంజన్‌రెడ్డి 1970 జూలై 23న తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, దిలావర్‌పూర్ మండలం, సిర్గాపూర్ గ్రామంలో విద్యాసాగర్ రెడ్డి, విజయ లక్ష్మి దంపతులు జన్మించాడు. ఆయన హైదరాబాద్‌లో ఉన్నత విద్యంతా పూర్తి చేసి పుణెలోని సింబయాసిస్ లా కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశాడు.[2]
వృత్తి జీవితం
[మార్చు]నిరంజన్‌రెడ్డి సింబయాసిస్ లా కాలేజీలో ఐదేళ్ల లా కోర్సు పూర్తి చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదులు ఒ.మనోహర్‌రెడ్డి, కె.ప్రతాప్ రెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేసి రాజ్యాంగపరమైన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలపై 1992 నుంచి హైకోర్టులో, 1994 నుండి సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. 2016లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయనకు సీనియర్ న్యాయవాది హోదాను కల్పించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తరఫున పలు కేసుల్లో స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా సేపని చేసి, రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా నియమితుడయ్యాడు.[3]
రాజకీయ జీవితం
[మార్చు]నిరంజన్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా 2022 మే 17న ప్రకటించింది.[4]
నిర్మించిన సినిమాలు
[మార్చు]ఆయన 2002లో హైదరాబాదులో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు సినీ నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఆయన మొదట దిల్ రాజు సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కు అనుబంధ సంస్థగా ఈ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రారంభించాడు. ఈ సంస్థ 2010లో మరో చరిత్ర, 2011లో గగనం సినిమాలను నిర్మించి ఆ తరువాత, పూర్తిస్థాయి సినీ నిర్మాణ సంస్థగా ఏర్పడి, 2016లో క్షణం, 2017లో ఘాజీ వంటి అవార్డు పొందిన సినిమాలను నిర్మించింది.
క్రమసంఖ్య | సంవత్సరం | సినిమా పేరు | భాష | గమనిక |
---|---|---|---|---|
1 | 2010 | మరోచరిత్ర | తెలుగు | అనుబంధ సంస్థగా |
2 | 2011 | గగనం | తెలుగు | అనుబంధ సంస్థగా |
3 | 2016 | క్షణం | తెలుగు | |
4 | 2017 | ఘాజీ | తెలుగు, హిందీ | |
5 | 2017 | రాజు గారి గది 2 | తెలుగు | అనుబంధ సంస్థగా |
6 | 2021 | ఆచార్య | తెలుగు | |
7 | 2021 | వైల్డ్ డాగ్ | తెలుగు | |
8 | 2021 | అర్జున ఫల్గుణ | తెలుగు | [5] |
9 | 2022 | మిషన్ ఇంపాజిబుల్ | తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (18 May 2022). "ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డి". Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
- ↑ Andhra Jyothy (18 May 2022). "నిరంజన్‌రెడ్డికి లక్కీఛాన్స్!" (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
- ↑ Sakshi (17 May 2022). "నిరంజన్‌రెడ్డి: వ్యవసాయ నేపథ్యం.. చట్టాలపై పట్టున్న న్యాయ నిపుణుడు". Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
- ↑ Sakshi (18 May 2022). "వైఎస్సార్‌సీపీ నలుగురు రాజ్యసభ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
- ↑ Varma, K. V. D. (10 December 2020). "శ్రీవిష్ణు హీరోగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ కొత్త సినిమా ప్రారంభం!". www.hmtvlive.com. Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.