గగనం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గగనం
దర్శకత్వంరాధా మోహన్
నిర్మాతదిల్ రాజు, ప్రకాష్ రాజ్
కథరాధా మోహన్
నటులుఅక్కినేని నాగార్జున, ప్రకాష్ రాజ్, పూనమ్ కౌర్
సంగీతంప్రవీణ్ మణి
ఛాయాగ్రహణంకే.వి. గుహన్
కూర్పుకిషోర్ టె
నిర్మాణ సంస్థ
విడుదల
ఫిబ్రవరి  11, 2011 (2011-02-11)
నిడివి
115 ని.
భాషతెలుగు

గగనం రాధామోహన్ దర్శకత్వంలో 2011 లో విడుదలైన చిత్రం. ఇందులో నాగార్జున, ప్రకాష్ రాజ్, పూనం కౌర్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇదే సినిమా తమిళంలో పయనం అనే పేరుతో విడుదల అయ్యింది. ఈ సినిమా విమానం హైజాకింగ్ నేపథ్యంలో తీశారు.[1][2] ఈ చిత్రాన్ని దిల్ రాజు, ప్రకాష్ రాజు కలిసి నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించబడింది. ఇదే సినిమా మేరే హిందుస్థానీ కీ కసమ్ అనే పేరుతో 2012 లో హిందీలోకి అనువాదమైంది.[3]

కథ[మార్చు]

చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో ప్రయాణీకుల రూపంలో ఉన్న నలుగురు అగంతకులు టాయిలెట్లో దాచిఉన్న ఆయుధాలు బయటికి తీసి విమానాన్ని హైజాక్ చేస్తారు. పెనుగులాటలో ఒక ఇంజిన్ చెడిపోవడంతో తిరుపతిలో విమానాన్ని అత్యవసరంగా దింపుతారు. ప్రభుత్వ అధికారులు వస్తారు. హైజాకర్లు 100 కోట్ల డబ్బు, తమ నాయకుడైన యూసఫ్ ఖాను విడుదల, తాము పారిపోవడానికి మరో విమానం అడుగుతారు.

నేషనల్ సెక్యూరిటీ గార్డ్ దళంలోని రవీంద్ర తాము ఖాన్ ను పట్టుకున్నప్పుడు ఒక కమాండోను కోల్పోయామనీ, అతన్ని అప్పుడే చంపవలసి ఉండాల్సిందని బాధ పడతాడు. ప్రత్యేక కమాండో ఆపరేషన్ కు అనుమతించమని ప్రభుత్వాన్ని అడుగుతాడు కానీ వాళ్ళు ప్రయాణికుల క్షేమం గురించి ఆలోచిస్తుంటారు.

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Payanam". The Times of India. 28 January 2011. Retrieved 25 October 2011. CS1 maint: discouraged parameter (link)
  2. "Get ready for 'Payanam' – Tamil Movie News". IndiaGlitz. Retrieved 25 October 2011. CS1 maint: discouraged parameter (link)
  3. Thriller (11 February 2011). "Payanam review, trailer & stills starring Nagarjuna, Prakash Raj". Getcinemas.com. Retrieved 25 October 2011. CS1 maint: discouraged parameter (link)