Jump to content

రాజు గారి గది 2

వికీపీడియా నుండి
రాజు గారి గది - 2
సినిమా పోస్టరు
దర్శకత్వంఓంకార్
రచనఅబ్బూరి రవి (సంభాషణలు)
స్క్రీన్ ప్లేఓంకార్
కథఓంకార్
రంజిత్ శంకర్ (వాస్తవ కథ)
నిర్మాతప్రసాద్ వి పొట్లూరి
తారాగణంఅక్కినేని నాగార్జున
సమంత
సీరత్‌ కపూర్
ఛాయాగ్రహణంఆర్. దివాకరన్
కూర్పుమధు
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థలు
PVP సినిమా
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్
OAK ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్
విడుదల తేదీ
13 అక్టోబరు 2017 (2017-10-13)
సినిమా నిడివి
127 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

రాజు గారి గది - 2 భయానకమైన తెలుగు హాస్య చిత్రం. దీనిని ప్రసాద్ వి పొట్లూరి పి.వి.సి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ & OAK ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థల ద్వారా నిర్మిచాడు. ఈ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, సమంత, సీరత్‌ కపూర్ ముఖ్య తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతాన్నందించాడు. [1] ఈ చిత్రం 2015లో విడుదలైన తెలుగు చలన చిత్రం రాజు గారి గది యొక్క తరువాత భాగం. మలయాళ చిత్రం "ప్రేతం (2016)" యొక్క రీమేక్ చిత్రం ఇది. [2] 2019, అక్టోబరు 18న రాజు గారి గది 3 విడుదల అయింది.

ఈ సినిమా ముగ్గురు యువకులు అశ్విన్ (ఆశ్విన్ బాబు), కిషోర్ (వెన్నల కిషోర్), ప్రవీణ్ (ప్రవీణ్) లతొ ప్రారంభమవుతుంది. వీరు ముగ్గురు కళాశాల రోజులలో మంచి స్నేహితులు. వారు రిసార్ట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడంద్వారా వారి జీవితాలను కొనసాగించాలనుకుంటారు. వారు ఇంట్లోంచి డబ్బులు తెచ్చి రాజుగారి రిసార్ట్స్ ను అద్దెకు తీసుకుని రిసార్ట్ బిజినెస్ ప్రారంభిస్తారు. అయితే ఆ రిసార్ట్ లో ఆత్మ తాలూకు ఆనవాళ్లు వారికి కనిపిస్తాయి. అక్కడకు పర్యాటకునిగా వచ్చిన సీరత్ కపూర్ ద్వారా అక్కడ ఆత్మ ఉందని తెలుసుకున్న వాళ్లు  ఆ ఊర్లోని చర్చి ఫాదర్ (నరేష్) ని పిలుస్తారు. కానీ అతను కూడా  ఆత్మను అంతం చెయ్యలేక ఓ మెంటలిస్ట్ రుద్ర (అక్కినేని నాగార్జున) ని రంగంలోకి దిగుతాడు. అలా ఆ రిసార్ట్ లోనికి వచ్చిన మెంటలిస్ట్ రుద్ర ఆ రిసార్ట్ లో ఉన్న  ఆత్మ ఎవరి మీదో పగతో ఉందో తెలుసుకుంటాడు. రుద్ర తన ప్రత్యేక శక్తులనుపయోగించి పోలీసు డిపార్టుమెంటుకు సహకరించి ఆత్మ గూర్చి తెలుసుకుంటాడు.

ఆ రిసార్టులో జరిగిన మిస్టారీని రుద్ర చేదిస్తాడు. ఆ రిసార్టులో ఉన్న ఆత్మ ఒక అమ్మాయి అమృత (సమంత) దిగా గుర్తిస్తాడు. ఆ ఆత్మ తన మరణానికి కారణం తెలుసుకోలేక పోయింది. ఆమెకు సహాయం చేయడానికి రుద్ర అంగీకరిస్తాడు. ఆమె గతాన్ని ఒకసారి బహిర్గతం చేస్తుంది.

అమృత తెలివైన, ప్రతిభావంతురాలైన అమ్మాయి. ఆమె తండ్రి ఉన్నత విలువలు కలిగిన పరంధామయ్య (రావు రమేశ్). కళాశాల విహారయాత్రకోసం వెళ్ళినపుడు ఆమె స్నానంచేసినపుడు ఎవరో రహస్యంగా చిత్రీకరిస్తారు. ఆ చిత్రాలను ఇంటర్‌నెట్ లో అప్‌లోడ్ చేస్తారు. అవమానంతో ఆమె తండ్రి మరణిస్తాడు. ఆమె తండ్రి చావును భరించలేక సమాజంలో తలెత్తుకోలేక భవనంపైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అసలైన అపరాధిని పట్టుకోవడానికి రుద్ర విచారణ ప్రారంభిస్తాడు. చివరికి ఆయన ఆ మిస్టరీని ఛేదిస్తాడు. ఆమె చదువుతున్న కళాశాల వైశ్ ఛాన్సలర్ చంద్రశేఖర్ (దేవన్) కుమార్తె కిరణ్ (అభినయ) కారణమని తెలుసుకుంటాడు. అమృతలో (నందు) ను ప్రేమిస్తున్నందుకు, తెలివైనదానిగా ప్రాముఖ్యత పొందినందుకు అసూయతో కిరణ్ ఈ విధంగా చేసినదని తెలుసుకుంటాడు. అది తెలుసుకున్న అమృత తన మరణానికి కారణమైన కిరణ్ ను అంతమొందించాలనుకుంటుంది. కానీ రుద్ర ఆమె తండ్రి తెలిపిన నీతి పద్యం చెప్పి దాని అర్థాన్ని వివరించి ఆమెను ఆపుతాడు. అపుడు ఆమె ఆత్మ శాంతిస్తుంది. చివరకు ఆ యువకులు ఆ రిసార్టును "సెల్ ఫోన్లు వాడరాదు. సెల్ఫీలు తీయరాదు" అనే నినాదంతో నడుపుతారు. రుద్ర కొత్త విచారణకు వెళ్ళిపోతాడు.

తారాగణం

[మార్చు]

సౌండ్ ట్రాక్

[మార్చు]
Untitled

ఈ చిత్రంలోని అన్ని పాటలను రచించిన వారు:రామజోగయ్య శాస్త్రి; అన్ని పాటలకు సంగీతం సమకూర్చినవారు:ఎస్. తమన్.

సం.పాటపాట నిడివి
1."బ్యూటిఫుల్ లైఫ్"2:10
మొత్తం నిడివి:2:10

నిర్మాణం

[మార్చు]

రాజు గారి గది 2, నాగార్జున అక్కినేనితో నిర్మిచతలపెట్టిన కొత్త ప్రాజెక్టును అన్నపూర్ణా స్టుడియోస్ లో 2016 నవంబరు 27 న కె. రాఘవేంద్రరావు మొదటి సీన్ ను క్లాప్రం ద్వారా ప్రారంభించారు. నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి మొదటి షాట్ ను ఓంకార్ దర్శకత్వం చేస్తున్నప్పుడు కెమేరా స్విచ్ ఆన్ చేసాడు. ప్రధాన ఫొటొగ్రహీ ఫిబ్రవరి 2017న హైదరాబాదులో ప్రారంభించడం జరిగింది.[3] 2017 ఆగస్టు 29 న నాగార్జున పుట్టిన రోజు నాటు సినిమా తయారైనది. దీని ట్రైలర్ 2017 సెప్టెంబరు 29న అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా విడుదల చేసారు. [4] ఈ సినిమాలో చూపబడిన రిసార్టు పాడిచ్ఛేరిలో గల లీపాండి.

మూలాలు

[మార్చు]
  1. "Raju Gari Gadhi 2 (Nagarjuna's Character)". The Times of India.
  2. "Raju Gari Gadhi 2". Telugu Cinema.com. Archived from the original on 2018-08-07. Retrieved 2018-03-28.
  3. "Raju Gari Gadhi 2 (Nagarjuna's New Project)". Indian Express.
  4. "Raju Gari Gadhi 2 (Trailer)". Chennai Patrika.