రాజు గారి గది 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజు గారి గది 3
దర్శకత్వంఓంకార్
రచనసాయిమాధవ్‌ బుర్రా
స్క్రీన్ ప్లేఓంకార్
కథఓంకార్
నిర్మాతకళ్యాణ్ చక్రవర్తి
తారాగణంఅశ్విన్ బాబు, అవికా గోర్
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంషాబీర్
నిర్మాణ
సంస్థ
ఓక్ ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
18 అక్టోబరు 2019
సినిమా నిడివి
122 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

రాజు గారి గది 3 2019, అక్టోబరు 18న భయానకమైన తెలుగు హాస్య చలనచిత్రం.[1] ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అశ్విన్ బాబు,[2][3] అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించగా, షాబీర్ సంగీతం అందించారు. 2015లో వచ్చిన రాజు గారి గది,2017లో వచ్చిన రాజు గారి గది 2 సినిమాల తరువాత సీక్వెల్ గా రాజు గారి గది 3 సినిమా వచ్చింది. ఇది తమిళ చిత్రం ధిల్లుకు దుడ్డు 2 కు రిమేక్.[4]

కథ[మార్చు]

మాయ (అవికా గోర్) హైదరాబాదులోని ఒక ఆసుపత్రిలో డాక్టరుగా పనిచేస్తుంటుంది. మాయ మీద కోరికతో ఎవరు ఆమె దగ్గరికి వెళ్లినా వాళ్లు సమస్యల్లో పడుతుంటారు. మాయ కోసం ఆశపడి దయ్యంతో ఇబ్బందులు ఎదుర్కున్న డాక్టరు శశి (బ్రహ్మాజీ), తమ కాలనీలోనే ఉన్న అశ్విన్ (అశ్విన్ బాబు)ను మాయ వెంటపడేలా చేసి అతణ్ని ఇబ్బందుల్లో పడవేస్తాడు. మాయ పట్ల ఆకర్షితుడైన అశ్విన్ ఆమెకు ఐ లవ్యూ చెప్పడంతో దయ్యం అతన్ని ఇబ్బంది పెడుతుంది. దీనికంతటికీ కారణం మాయ తండ్రి అయిన క్షుద్ర మాంత్రికుడనుకుని అతడి కోసం కేరళకు వెళ్తాడు అశ్విన్. అక్కడ అతడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.. ఇంతకీ మాయకు దయ్యానికి సంబంధమేంటి.. ఈ దయ్యం బాధ వదిలించుకుని మాయను అశ్విన్ పెళ్లాడాడా లేదా అన్నది తెరమీదే చూడాలి.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

రాజు గారి గది 3
పాటలు by
షాబీర్
Released13 అక్టోబరు 2019
Recorded2019
Genreపాటలు
Length3:30
Labelమ్యాంగో మ్యూజిక్
Producerషాబీర్
షాబీర్ chronology
నేంజముందు నేర్మైయుందు ఒడ్ రాజా
(2019)
రాజు గారి గది 3
(2019)

షాబీర్ సంగీతం అందించాడు.[6]

పాటలు
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నా గదిలోకి రా"శ్రీమణిఎం.ఎం. మనస్వి, శ్రీ వర్ధిని, తనుశ్రీ నటరాజన్, మిరియా వర్మ, ఎల్.వి. రేవంత్, షాబీర్03:30

విడుదల - స్పందన[మార్చు]

ఈ చిత్రం 2019, అక్టోబరు 18న ప్రపంచంవ్యాప్తంగా విడుదల అయింది. దయ్యంతో ఉన్న సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బలంగా నిలిచి, ప్రేక్షకుల్లో భయం కలిగించింది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ సినిమాకు తగినట్లుగా ఉన్నాయి.

  1. హాస్యప్రధాన చిత్రం (టైమ్స్ ఆఫ్ ఇండియా, రేటింగ్ - 2/5)[7]
  2. హాస్యం, జోకులు ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. (గ్రేట్ ఆంధ్ర, రేటింగ్ - 2/5)[8]
  3. కథనం అంత పటిష్టంగా లేదు, హాస్యం పడలేదు (ఇండియాగ్లిట్జ్, రేటింగ్ - 2.75/5)[9]

పురస్కారాలు[మార్చు]

సైమా అవార్డులు[మార్చు]

2019 సైమా అవార్డులు

  1. ఉత్తమ హాస్యనటుడు (అజయ్ ఘోష్)

మూలాలు[మార్చు]

  1. "Raju Gari Gadhi 3 releasing soon this October". The Hans India.
  2. "Ashwin to be seen in Raju Gari Gadhi 3". Telangana Today.
  3. "Ashwin hopes on this horror comedy". Deccan Chronicle.
  4. "Raju Gari Gadhi 3, a remake of Dhilluku Dhuddu 2". cinemaexpress.
  5. "Sneha Gupta and Radhika S Mayadev in Raju Gari Gadhi 3". Cinemaroundup.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-10-15. Retrieved 2019-10-20.
  6. "Naa Gadhiloki Raa". Youtube.
  7. "Raju Gari Gadhi 3 Movie Review". timesofindia.
  8. "Raju Gari Gadhi 3 Review: Cheap Comedy". GreatAndhra.
  9. "Raju Gari Gadhi 3 Review". indiaglitz.

ఇతర లంకెలు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాజు గారి గది 3