క్రిషన్ లాల్ పన్వార్
క్రిషన్ లాల్ పన్వార్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 17 అక్టోబర్ 2024 | |||
గవర్నరు | బండారు దత్తాత్రేయ | ||
---|---|---|---|
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2020 – అక్టోబర్ 2024[1][2] | |||
నియోజకవర్గం | హర్యానా | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | బల్బీర్ సింగ్ | ||
నియోజకవర్గం | ఇస్రానా | ||
పదవీ కాలం 2009 – 2019 | |||
ముందు | నియోజకవర్గం సృష్టించారు | ||
తరువాత | బల్బీర్ సింగ్ | ||
నియోజకవర్గం | ఇస్రానా | ||
పదవీ కాలం 1991 – 2005 | |||
ముందు | మన్ ఫూల్ సింగ్ | ||
తరువాత | రాజ్ రాణి పూనమ్ | ||
నియోజకవర్గం | అసంధ్ | ||
జైళ్ల & రవాణా & హౌసింగ్ శాఖల మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 24 జూలై 2015 - 27 అక్టోబర్ 2019 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మద్లౌడా , పానిపట్ | 1958 జనవరి 1||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | హోషియారీ దేవి | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
క్రిషన్ లాల్ పన్వార్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఇస్రానా, అసంధ్ నియోజకవర్గల నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[3]
రాజకీయ జీవితం
[మార్చు]క్రిషన్ లాల్ పన్వార్ పానిపట్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో గ్రేడ్-వన్ బాయిలర్ ఆపరేటర్‌గా పని చేస్తూ రాజకీయాల పట్ల ఆసక్తితో 1991లో ఉద్యోగానికి రాజీనామా చేసి 1991లో అసంధ్ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1996లో సమతా పార్టీ అభ్యర్థిగా, 2000లో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2005లో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
క్రిషన్ లాల్ పన్వార్ 2009లో ఇస్రానా నియోజకవర్గం నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయనకు 2014లో ఐఎన్ఎల్‌డీ టికెట్ నిరాకరించడంతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి బీజేపీ అభ్యర్థిగా గెలిచి 24 జూలై 2015 నుండి 27 అక్టోబర్ 2019 మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రివర్గంలో రవాణా, హౌసింగ్, జైళ్ల సఖ మంత్రిగా పని చేశాడు.
క్రిషన్ లాల్ పన్వార్ 2019లో ఇస్రానా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా ఆయనకు బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది.[4][5] ఆయన 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి బల్బీర్ సింగ్ పై 13,895 ఓట్ల మెజారిటీతో గెలిచి,[6] నయాబ్ సింగ్ సైనీ రెండవ మంత్రివర్గంలో 17 అక్టోబర్ 2024న అభివృద్ధి & పంచాయతీ, మైన్స్ & జియాలజీ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "BJP's Israna MLA Panwar resigns from Rajya Sabha". 15 October 2024. Retrieved 16 October 2024.
- ↑ The New Indian Express (14 October 2024). "Haryana: Elected Panipat MLA, BJP leader Krishan Lal Panwar resigns as Rajya Sabha member" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.
- ↑ The New Indian Express (21 October 2024). "Haryana cabinet portfolios allocated: CM Saini keeps Home, Finance; Vij gets Transport" (in ఇంగ్లీష్). Retrieved 26 October 2024.
- ↑ ETV Bharat News (11 June 2022). "कृष्ण लाल पंवार: बॉयलर ऑपरेटर से कैबिनेट मंत्री और अब राज्यसभा पहुंचने तक का सफर" (in హిందీ). Retrieved 28 October 2024.
- ↑ "Rajya Sabha polls: BJP's Krishan Lal Panwar, Independent candidate Kartikeya Sharma elected from Haryana; Cong's Ajay Makan loses". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2023-01-20.
- ↑ TimelineDaily (8 October 2024). "BJP's Krishan Lal Panwar Wins Haryana's Israna Constituency" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.
- ↑ The Tribune (17 October 2024). "Haryana Cabinet: A blend of experience, loyalty, and new faces" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.