హర్యానా శాసనసభకు 90 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 21 అక్టోబర్ 2019న హర్యానాలో శాసనసభ ఎన్నికలు జరిగాయి.[1][2] ఓటింగ్ శాతం 68.20% నమోదైంది.[3] ఫలితాలు 24 అక్టోబర్ 2019న ప్రకటించబడ్డాయి.[4]
భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది, జననాయక్ జనతా పార్టీ, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ -జేజేపీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ నుండి మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రిగా, జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.[5]
అంతకుముందు 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించి రాష్ట్రంలో పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ముగించి మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు.
తుది లెక్కింపు తర్వాత ఓటింగ్ శాతం 68.20%కి పెరిగింది. ఫతేహాబాద్‌లో 73.7%, కైతాల్‌లో 73.3%, జగధారిలో 73%, మరియు హతిన్‌లో 72.5% అత్యధికంగా పోలింగ్ నమోదైంది. గురుగ్రామ్ 51.2%, బద్ఖల్ 51.3%, టిగావ్ 53.2% అత్యల్పంగా 50% కంటే ఎక్కువ పోలింగ్ నమోదయ్యాయి.[7]