కన్వర్ పాల్ గుజ్జర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కన్వర్ పాల్ గుజ్జర్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జగాద్రి శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 26 అక్టోబర్ 2014 నుండి 4 నవంబర్ 2019 వరకు హర్యానా శాసనసభ స్పీకర్‌గా పని చేసి ప్రస్తుతం నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

కన్వర్ పాల్ గుజ్జర్ 1989 సంవత్సరంలో శ్రీరామ జన్మభూమి ఉద్యమంలో పని చేసి, 1990లో భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన ఆ తరువాత రెండు సార్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, మూడు సార్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. కన్వర్ పాల్ గుజ్జర్ 1991లో చచ్చరౌలీ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత 2000లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

కన్వర్ పాల్ గుజ్జర్ 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జగాద్రి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[1], 26 అక్టోబర్ 2014 నుండి 4 నవంబర్ 2019 వరకు హర్యానా శాసనసభ స్పీకర్‌గా పని చేసి 2019లో జరిగిన ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం మనోహర్ లాల్ ఖట్టర్‌ మంత్రివర్గంలో  2019 నవంబర్ 15న విద్యా, అటవీ, పర్యాటక & సాంస్కృతిక, పార్లమెంటరీ వ్యవహారాల సఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించి ఆ తరువాత 2024 మార్చి 12న ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా అనంతరం నూతన ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన  నయాబ్ సింగ్‌ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[3]

మూలాలు[మార్చు]

  1. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. Mana Telangana (12 March 2024). "హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం". Archived from the original on 13 March 2024. Retrieved 13 March 2024.