సంజయ్ సింగ్ (హర్యానా రాజకీయ నాయకుడు)
స్వరూపం
సంజయ్ సింగ్ | |||
పదవీ కాలం 19 మార్చి 2024 – 17 అక్టోబర్ 2024 | |||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | తేజ్‌పాల్ తవార్ | ||
---|---|---|---|
తరువాత | తేజ్‌పాల్ తవార్ | ||
నియోజకవర్గం | సోహ్నా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
సంజయ్ సింగ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో సోహ్నా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నాయబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో పర్యావరణం, అటవీ, వన్యప్రాణి & క్రీడా శాఖల మంత్రిగా పని చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]సంజయ్ సింగ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 ఎన్నికలలో సోహ్నా నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జననాయక్ జనతా పార్టీ అభ్యర్థి రోహ్తాష్ సింగ్ ఖతానాపై 12,453 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2] నాయబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో 19 మార్చి 2024 నుండి 17 అక్టోబర్ 2024 వరకు పర్యావరణం, అటవీ, వన్యప్రాణి & క్రీడా శాఖల మంత్రిగా పని చేశాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ India TV (23 March 2024). "Haryana CM Nayab Singh Saini allocates portfolios, keeps key home department with himself" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ "Haryana Cabinet Expansion: CM Nayab Saini Allotts Portfolios; Check Complete List" (in ఇంగ్లీష్). 23 March 2024. Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.