నాయబ్ సింగ్ సైనీ
నాయబ్ సింగ్ సైనీ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 మార్చి 12 | |||
ముందు | మనోహర్ లాల్ ఖట్టర్ | ||
---|---|---|---|
పదవీ కాలం 2019 మే 23 – 2024 మార్చి 12 | |||
ముందు | రాజ్ కుమార్ సైనీ | ||
నియోజకవర్గం | కురుక్షేత్ర | ||
కార్మిక & ఉపాధి, మైన్స్ & జియాలజీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి
| |||
పదవీ కాలం 2015 జూలై 24 – 2019 జూన్ 3 | |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | రాంకిషన్ గుర్జార్ | ||
తరువాత | షెల్లీ | ||
నియోజకవర్గం | నారైన్‌గఢ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మీర్జాపూర్ మజ్రా, అంబాలా జిల్లా, హర్యానా | 1970 జనవరి 25||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | తెలు రామ్ | ||
సంతానం | 2 | ||
మూలం | [1] |
నాయబ్ సింగ్ సైనీ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2019 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యాడు. 2024 మార్చి 12 న ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా అనంతరం,[1] గవర్నర్ బండారు దత్తాత్రేయ నాయబ్ సింగ్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు.[2][3]
జననం, విద్యాభాస్యం
[మార్చు]నాయబ్ సింగ్ సైనీ 1970 జనవరి 25న అంబాలా జిల్లాలోని మిజాపూర్ మజ్రా గ్రామంలో జన్మించాడు. ఆయన ముజఫర్‌పూర్ లోని బి.ఆర్. అంబేద్కర్ బీహార్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుండి ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]నాయబ్ సింగ్ సైనీ 1996 లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీ హర్యానా విభాగంలో 2000 వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. ఆయన 2002 లో అంబాలా జిల్లా బిజెపి యూత్ వింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2005లో అంబాలా జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. నాయబ్ సింగ్ 2009 లో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2012 లో అంబాలా జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడై 2014 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నారైన్‌గఢ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2015లో హర్యానా ప్రభుత్వంలో కార్మిక & ఉపాధి, మైన్స్ & జియాలజీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రిగా పని చేశాడు.
నాయబ్ సింగ్ సైనీ 2019 లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కురుక్షేత్ర నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల్ సింగ్‌పై 3.83 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[4] 2023 అక్టోబరు 28న హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[5]
నాయబ్ సింగ్ సైనీ 2024 మార్చి 12న ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా అనంతరం బిజెపి శాసనసభ పార్టీ నాయకుడిగా ఎన్నికై హర్యానా ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[6][7][8]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (12 March 2024). "Who is Nayab Singh Saini, Haryana's new CM". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
- ↑ Eenadu (12 March 2024). "హరియాణాలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. 13న బలపరీక్ష". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
- ↑ Eenadu (17 October 2024). "హరియాణా నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం". Retrieved 17 October 2024.
- ↑ Hindustan Times (12 March 2024). "Who is Nayab Singh Saini, Haryana's next CM after Manohar Lal Khattar resigned?" (in ఇంగ్లీష్). Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
- ↑ The Hindu (28 October 2023). "Haryana CM Manohar Lal's close confidante Nayab Saini takes over as new BJP chief". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
- ↑ Sakshi (12 March 2024). "హర్యానా నూతన సీఎంగా నయాబ్ సింగ్ సైనీ". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
- ↑ India Today (12 March 2024). "Nayab Singh Saini to be new Haryana Chief Minister, replaces Manohar Lal Khattar" (in ఇంగ్లీష్). Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
- ↑ 10TV Telugu (12 March 2024). "హరియాణ నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ" (in Telugu). Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)