పుష్కర్ సింగ్ ధామీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుష్కర్ సింగ్ ధామీ
పుష్కర్ సింగ్ ధామీ

పుష్కర్ సింగ్ ధామీ


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2021 జులై 4
గవర్నరు బేబీ రాణి మౌర్య
ముందు తీరత్ సింగ్ రావత్

ఉత్తరాఖండ్ అసెంబ్లీ సభ్యడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2012
నియోజకవర్గం ఖతిమా

వ్యక్తిగత వివరాలు

జననం (1975-09-16) 1975 సెప్టెంబరు 16 (వయస్సు 46)
Pithoragarh, ఉత్తరాఖండ్, భారతదేశం (ఒకప్పటి ఉత్తర్ ప్రదేశ్)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి గీత ధామీ
సంతానం 2 కుమారులు
నివాసం ఖతిమా, ఉద్దంసింగ్ నగర్
పూర్వ విద్యార్థి లక్నో విశ్వవిద్యాలయం
వెబ్‌సైటు www.pushkarsinghdhami.in

పుష్కర్ సింగ్ ధామీ(జననం 1975 సెప్టెంబర్ 16)భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్ర 10వ ముఖ్యమంత్రిగా పరిపాలన నిర్వహిస్తున్నాడు.ధామీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉద్దంసింగ్ నగర్ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ నుండి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యాడు.45 ఏళ్ళ వయసులో ఉత్తరాఖండ్‌లో అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి అయ్యాడు.[1]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ధామీ పూర్వీకులు ఉత్తరాఖండ్లోని పితోర్గర్హ్ జిల్లా హర్ఖోల గ్రామానికి చెందిన వారు.ఇతను ఖతిమా పట్టణంలో జన్మించాడు.ఇతని తండ్రి ఆర్మీలో సుబేదారుగా సేవలందించి పదవీవిరమణ చేసాడు.

రాజకీయ జీవితం[మార్చు]

ధామీ 1990లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్యార్థి విభాగమైన అఖిల భారత విద్యార్థి పరిషద్తో తన రాజకీయ జీవితం ప్రారంభించాడు.ఆ తరువాత 2008 వరకు భారతీయ జనతా యువ మోర్ఛాకి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసాడు.అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వివిధ శాఖలలో స్థానిక యువకులకు 70 శాతం వరకు అవకాశాలు అందేలా చూసాడు.

ఆ రాష్ట్ర బీజేపీలో అసమ్మతి సెగల కారణంగా ఇంతకు మునుపు ముఖ్యమంత్రిగా ఉన్న తీరత్ సింగ్ రావత్ తన పదవికి 2021 జులై 2న రాజీనామా చేయడంతో ఆ రాష్ట్ర నేతలు ధామీ ని ముఖ్యమంత్రి పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.[2][3]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. DelhiJuly 3, Himanshu Mishra Dehradun | New; July 3, 2021UPDATED:; Ist, 2021 23:13. "BJP MLA Pushkar Singh Dhami to take oath as 11th chief minister of Uttarakhand tomorrow". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-07-04.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. "Breaking News :Pushkar Singh Dhami elected as new Uttarakhand chief minister | ABN Telugu". andhrajyothy. Retrieved 2021-07-04.
  3. "tv9 తెలుగు న్యూస్". tv9.