Coordinates: 28°59′N 79°24′E / 28.98°N 79.40°E / 28.98; 79.40

ఉధంసింగ్ నగర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉధంసింగ్ నగర్ జిల్లా
ऊधम सिंह नगर ज़िला
జిల్లా
ఉధంసింగ్ నగర్ జిల్లా is located in Uttarakhand
ఉధంసింగ్ నగర్ జిల్లా
ఉధంసింగ్ నగర్ జిల్లా
ఉత్తరాఖండ్ పటంలో జిల్లా స్థానం
Coordinates: 28°59′N 79°24′E / 28.98°N 79.40°E / 28.98; 79.40
దేశం India
రాష్ట్రంఉత్తరాఖండ్
డివిజనుసబ్ డివిజను
Seatరుద్రాపూర్
Area
 • Total2,908 km2 (1,123 sq mi)
Population
 • Total12,35,614
 • Density425/km2 (1,100/sq mi)
భాషలు
 • అధికారికహిందీ, పంజాబీ
Time zoneUTC+5:30 (IST)

ఉధంసింగ్ నగర్ జిల్లా (హింది:ऊधम सिंह नगर ज़िला) ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిలాలలో ఒకటి. జిల్లాకు ప్రధానకేంద్రం రుద్రాపూర్. ఇది తెహ్రీ భూభాగంలో ఉంది. ఈ జిల్లాలో బజ్పూర్, గడర్పుర్, జాస్పుర్, కాశీపూర్, కిచ్చా, ఖతిమా, సితర్గని అని 7 తాలూకాలు (తెహ్సిల్స్) ఉన్నాయి. ఈ జిల్లా తెరియా ప్రాంతంలో కుమాన్ విభాగంలో ఉంది.జిల్లా ఉత్తరదిశలో నైనీతాల్, ఆగ్నేయదిశలో చంపావత్, తూర్పు దిశలో నేపాల్ దేశం, దక్షిణ, పడమర దిశలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నాయి. 1995లో నైనీతాల్ నుండి కొంత భుభాగం తీసూని ఈ జిల్లా స్థాపించబడింది. 2011 గణాంకాలను అనుసరించి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఇది జనసంఖ్యలో 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానాలలో హరిద్వార్, డెహ్రాడూన్ ఉన్నాయి.[1] వ్యవసాయ పరిశోధకులకు, ఇంజనీర్లకు గుర్తింపు పొందిన " గోవింద వల్లభ పంత్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నలజీ " రుద్రాపూర్‌కు 5 కి.మీ దూరంలో ఉంది.

ఉద్దం సింగ్ నగర్ జిల్లాలోని తహసిల్స్[మార్చు]

కాశీపూర్ ఉపవిభాగం[మార్చు]

  • జాస్పూర్
  • కాశీపూర్
  • బజ్పూర్

రుద్రాపూర్ ఉపవిభాగం[మార్చు]

  • గడార్పూర్
  • పంత్నగర్
  • రుద్రాపూర్
  • కిచ్చా
  • సితార్గంజ్

ఖతిమా ఉపవిభాగం[మార్చు]

  • నానక్‌మట్ట
  • ఖతిమా

గణాంకాలు[మార్చు]

2011 గణాంకాలను అనుసరించి ఉద్దం సింగ్ నగర్ జనసంఖ్య 16,48,367.[1] ఇది దాదాపు గునియా-బిస్సు దేశ జనసంఖ్యతో సమానం.[2] లేక అమెరికా నగరమైన ఇదహో జనసంఖ్యకు సమానం.[3] భారతీయ జిల్లాలు (688) లో ఉధంసింగ్ నగర్ జిల్లా 303వ స్థానంలో ఉంది.[1] జిల్లా జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 648.[1] 2001-2011 జిల్లా కుటుంబ నియంత్రణ శాతం 33.4%.[1] ఉధంసింగ్ నగర్ జిల్లా స్త్రీపురుష నిష్పత్తి 919:1000.[1] అలాగే అక్షరాస్యత శాతం 74.44%.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Guinea-Bissau 1,596,677 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Idaho 1,567,582

వెలుపలి లింకులు[మార్చు]