రమణ్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రమణ్ సింగ్
రమణ్ సింగ్


పదవీ కాలం
2003, డిసెంబరు 7 నుంచి 2018, డిసెంబరు 17
ముందు అజిత్ జోగి
తరువాత భూపేష్ బాఘేల్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-10-15) 1952 అక్టోబరు 15 (వయసు 71)
కవార్థా , చత్తీస్‌గఢ్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి వీణాసింగ్
సంతానం ఇద్దరు
మతం హిందూ
డిసెంబరు 31, 2013నాటికి

రమణ్ సింగ్ (Raman Singh) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి. 1952లో జన్మించిన రమణ్‌సింగ్ వై ద్యుడిగా ఉంటూ ఆర్.ఎస్.ఎస్.తో అనుబంధం పొంది, ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించి, 2008 డిసెంబరు 7 నుండి 2018 డిసెంబరు 16 వరకు 3 పర్యాయాలు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆయన బీజేపీ తరపున దేశంలో అత్యధిక కలం పనిచేసిన ముఖ్యమంత్రిగా గుర్తింపునందుకున్నాడు.

బాల్యం[మార్చు]

రమణ్‌సింగ్ అక్టోబరు 15, 1952లో మధ్యప్రదేశ్‌లో వీరభద్రసింగ్ ఠాకూర్, సుధాసింగ్‌ దంపతులకు జన్మించాడు.[1] ఆయన 1975లో రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల నుండి తన బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ & సర్జరీ (BAMS) పూర్తి చేశాడు.[2]

రాజకీయ ప్రస్థానం[మార్చు]

వైద్యుడిగా ఉన్నప్పుడే ఆరెస్సెస్‌తో అనుబంధం కొనసాగించిన రమణ్ సింగ్, రాజకీయాలలో ప్రవేశించి భారతీయ జనసంఘ్లో చేరి, 1976-77లో ఆ పార్టీ కవార్థా శాఖ అధ్యక్షుడిగా నియమితులైనారు. 1983లో కవార్థా పురపాలక సంఘం కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 1990, 1993లలో మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా విజయం సాధించారు. 1999లో రాజ్‌నందగాన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 13వ లోక్‌సభకు విజయం సాధించి అటల్ బిహారి వాజపేయి మంత్రివర్గంలో వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.

ఛత్తీస్‌గఢ్‌ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనారు. 2003లో పార్టీని విజయపథంలో నడిపించి ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న దిలీప్ సింగ్ జుదేవ్ అవినీతి కేసులో ఇరుక్కోవడంతో ఈయనకు అవకాశం లభించింది. 2005లో నక్సలైట్ల స్ంస్థలను నిషేధించడంతో పాటు కాంగ్రెస్ నేత మహేంద్రకర్మ ప్రారంభించిన సల్వాజుడుంకు బహిరంగ మద్దతు ప్రకటించారు.[3] 2008 శాసనసభ ఎన్నికలలోనూ, 2013 శాసనసభ ఎన్నికలలో గెలిచి వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.

మూలాలు[మార్చు]

  1. Romesh Thapar. Seminar: the monthly symposium: Issues 533-544. p. 38. Retrieved 10 November 2013.
  2. Chhibber, Devika. "Chhattisgarh: CMs in the wings". Zee News. Archived from the original on 12 ఏప్రిల్ 2013. Retrieved 10 November 2013.
  3. ఈనాడు దినపత్రిక, తేది 09-12-2013