అజిత్ జోగి
అజిత్ జోగి | |
---|---|
వ్యక్తిగత వివరాలు | |
జననం | [1][2] | 1946 ఏప్రిల్ 29
మరణం | 2020 మే 29 రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్, భారతదేశం | (వయసు 74)
సంతానం | అమిత్ జోగి |
నివాసం | రాయ్‌పూర్ |
అజిత్ ప్రమోద్ కుమార్ జోగి ( 1946 ఏప్రిల్ 29 – 2020 మే 29) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[3] ఆయన 2000 నుండి 2003 వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అజిత్ జోగి ఐపీఎస్, ఐఏఎస్‌కు ఎంపికై 1981 నుండి 1985 వరకు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించాడు.[4]
జననం, విద్యాభాస్యం
[మార్చు]అజిత్ జోగి 1946 ఏప్రిల్ 29న మధ్యప్రదేశ్ రాష్ట్రం, భిలాస్‌పూర్ జిల్లాలోని జోగిసర్‌లో కాశీ ప్రసాద్ జోగి, కాంతిమణి దంపతులకు జన్మించాడు. ఆయన భోపాల్ లోని మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అజిత్ జోగి 1967లో రాయ్‌పూర్ లోని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]నిర్వహించిన పదవులు
[మార్చు]- జోగి 1981-85 సమయంలో ఇండోర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు
- 1986–87 షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సభ్యుడు.
- 1986–1998 సభ్యుడు, రాజ్యసభ (రెండు పర్యాయాలు) [5]
- 1987–1989 ప్రధాన కార్యదర్శి, ప్రదేశ్-కాంగ్రెస్ కమిటీ, మధ్యప్రదేశ్ & పబ్లిక్ అండర్‌టేకింగ్‌లు, పరిశ్రమలు & రైల్వేలపై కమిటీల సభ్యుడు.
- 1989 మణిపూర్‌లోని నియోజకవర్గాల నుండి లోక్‌సభకు ఎన్నికల కోసం భారత జాతీయ కాంగ్రెస్ కేంద్ర పరిశీలకుడు.
- 1995 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కోసం భారత జాతీయ కాంగ్రెస్ కేంద్ర పరిశీలకుడు.
- 1995-96 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఫారెస్ట్‌లపై కమిటీల ఛైర్మన్
- 1996 సభ్యుడు, కోర్ గ్రూప్, ఏఐసీసీ పార్లమెంటరీ ఎన్నికలు (లోక్ సభ)
- 1996 50వ వార్షికోత్సవ వేడుకల కోసం ఐక్యరాజ్యసమితికి భారత ప్రతినిధి బృందం, న్యూయార్క్.
- 1997 పరిశీలకుడు, ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు. సభ్యుడు, ఏఐసీసీ. రవాణా, పర్యాటకం, గ్రామీణ, పట్టణాభివృద్ధి, కన్సల్టేటివ్ కమిటీ, బొగ్గు మంత్రిత్వ శాఖ, కన్సల్టేటివ్ కమిటీ, ఇంధన మంత్రిత్వ శాఖ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కన్వీనర్, పరోక్ష పన్నులపై సబ్-కమిటీ, ఉపాధ్యక్షుల ప్యానెల్ సభ్యులు, రాజ్యసభ
- 1997 కైరోలోని 98వ IPU సమావేశానికి భారత ప్రతినిధి బృందం
- 1998 ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌ఘర్ నియోజకవర్గానికి 12వ లోక్‌సభకు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు [6]
- 1998–2000 ప్రతినిధి, ఏఐసీసీ, విప్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ, వర్కింగ్ ప్రెసిడెంట్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
- 1998–99 సభ్యుడు, మానవ వనరుల అభివృద్ధిపై కమిటీ, వైద్య విద్యపై దాని సబ్-కమిటీ-II, బొగ్గుపై కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, బొగ్గు మంత్రిత్వ శాఖ
- 2000–2003 ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి [5]
- 2004–2008 ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌కు 14వ లోక్‌సభలో ఎంపీగా ఉన్నారు [7]
- 2008– ఛత్తీస్‌గఢ్ శాసనసభ సభ్యుడు, మార్వాహి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు [8]
- 2018 - జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ ప్రాంతీయ పార్టీ స్థాపన[9]
మరణం
[మార్చు]అజిత్ జోగికి మే 9న గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు రాయ్‌పూర్ లోని శ్రీనారాయణ ఆస్పత్రికి తరలించగా, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో 2020 మే 29న మరణించాడు.[10]
మూలాలు
[మార్చు]- ↑ "Ajit Jogi (born 29 April 1946 died 29 May 2020)". Archived from the original on 16 April 2015. Retrieved 10 April 2015.
- ↑ "Answers - the Most Trusted Place for Answering Life's Questions".
- ↑ Lok Sabha (2022). "Ajit Jogi". Archived from the original on 1 September 2022. Retrieved 1 September 2022.
- ↑ The New Indian Express (29 May 2020). "The IAS officer who went on to become Chhattisgarh's first chief minister". Archived from the original on 1 September 2022. Retrieved 1 September 2022.
- ↑ 5.0 5.1 "Profile/Chhattisgarh Chief Minister Ajit Jogi". Rediff.com. 1 November 2000. Retrieved 23 January 2010.
- ↑ "Jogi's true colours". Rediff.com. 31 December 2004. Retrieved 23 January 2010.
- ↑ "Ajit Jogi, Ujwala Shinde in Congress list". The Hindu. 31 March 2004. Archived from the original on 15 November 2004. Retrieved 23 January 2010.
- ↑ "Same battles, different turfs". The Indian Express. 27 March 2009. Retrieved 23 January 2010.
- ↑ Ajit Jogi announces new political party
- ↑ Sakshi (30 May 2020). "అజిత్ జోగి కన్నుమూత". Archived from the original on 1 September 2022. Retrieved 1 September 2022.