కేశూభాయి పటేల్
Jump to navigation
Jump to search
1930 జూలై 24 న జన్మించిన కేశూభాయి పటేల్ (Keshubhai Patel) గుజరాత్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు. మొదటి పర్యాయం 1995 మార్చి నుంచి 1995 అక్టోబరు వరకు, మళ్ళీ రెండో పర్యాయం 1998 మార్చి నుంచి 2001 అక్టోబరు వరకు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించాడు. ఇతడు రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి.
2001 లో గుజరాత్ లో, ఉప ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకు ఆశించినంత విజయం లభించకపోవుటచే, ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలగాలని ఇతనిపై ఒత్తిడి రావడంతో కేశూభాయి పదవి నుంచి తప్పుకొన్నాడు. ఆ తర్వాత నరేంద్ర మోడి పగ్గాలు స్వీకరించి నేటివరకూ కూడా పదవిలో కొనసాగుతున్నాడు.