డి.వి.సదానంద గౌడ
డి.వి.సదానంద గౌడ | |||
![]()
| |||
కేంద్రమంత్రి
| |||
పదవీ కాలము 2014, మే 26 నుంచి | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | మండెకోలు, ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక | 18 మార్చి 1953||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | దత్తి | ||
సంతానము | ఒక కుమారుడు | ||
వెబ్‌సైటు | sadanandagowda.com | ||
మే 26, 2014నాటికి |
డీవీఎస్‌గా ప్రసిద్ధి చెందిన డి.వి.సదానంద గౌడ మార్చి 18, 1953న[1] కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మండెకోలులో[2] జన్మించారు. న్యాయశాస్త్ర విద్యను అభ్యసించి ప్రారంభంలో కొంతకాలం న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1983 నుంచి 1988 వరకు భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1989లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసి పరాజయం పొందినారు. 1994లో తొలిసారి పుత్తూరు నుంచి విజయం సాధించి కర్ణాటక శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో రెండో సారి కూడా అదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికై శాసనసభలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా వ్యవహరించారు. 2003లో పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ చైర్మెన్‌గా పనిచేశారు. 2004లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నుకయ్యారు. 2009లో ఉడిపి-చిక్కమగళూరు నియోజకవర్గం నుంచి రెండవసారి లోకసభకు ఎన్నికైనారు.[3] బి.ఎస్.యడ్యూరప్పను లోకాయుక్త తప్పుపట్టడంతో పార్టీలో వివాదరహితుడైన[4] సదానందగౌడకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది. ఆగష్టు 4, 2011న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2014లో 16వ లోకసభకు ఎన్నికై 2014 మే 26 నాడు నరేంద్రమోడి కేబినెట్‌లో కేంద్రమంత్రిగా నియమితులైనారు.
మూలాలు[మార్చు]
- ↑ http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=3979
- ↑ http://sadanandagowda.com/
- ↑ సాక్షి దినపత్రిక, తేది 04-08-2011
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 04-08-2011
![]() |
Wikimedia Commons has media related to D. V. Sadananda Gowda. |