Jump to content

హెచ్. డి. కుమారస్వామి

వికీపీడియా నుండి
(హెచ్.డి.కుమారస్వామి నుండి దారిమార్పు చెందింది)
హెచ్. డి. కుమారస్వామి
హెచ్. డి. కుమారస్వామి


పదవీ కాలం
23 మే 2018 – 26 జులై 2019
గవర్నరు వాజుభాయ్ వాలా
ముందు బి.ఎస్.యడ్యూరప్ప
నియోజకవర్గం చన్నపట్న
పదవీ కాలం
3 ఫిబ్రవరి 2006 – 9 అక్టోబరు 2007
ముందు ధరమ్‌ సింగ్
తరువాత రాష్ట్రపతి పాలన
నియోజకవర్గం రామనగర

వ్యక్తిగత వివరాలు

జననం (1959-12-16) 1959 డిసెంబరు 16 (వయసు 64)
హరదనహళ్ళి, మైసూరు రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ జనతాదళ్ (సెక్యులర్)
తల్లిదండ్రులు హెచ్.డి.దేవెగౌడ(తండ్రి)
చెన్నమ్మ (తల్లి)
జీవిత భాగస్వామి
అనిత కుమారస్వామి
(m. 1986)
& [1]
బంధువులు హెచ్‌.డి రేవణ్ణ (సోదరుడు)
ప్రజ్వల్ రేవణ్ణ
సంతానం నిఖిల్ కుమారస్వామి
షమిక కుమారస్వామి [2]
వృత్తి రాజకీయనాయకుడు, సినిమా నిర్మాత

హరదనహళ్ళి దేవెగౌడ కుమారస్వామి (జననం. 1959 డిసెంబరు 16)[3] భారతీయ రాజకీయనాయకుడు, కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. అతను భారతదేశ మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ కుమారుడు. అతను కర్ణాటక సినిమా రంగంలో నిర్మాత, పంపిణీదారుడు, ప్రదర్శకుడు.[4] కుమారస్వామి "కుమారన్న"గా సురిచితుడు.[5][6] అతను కర్ణాటక రాష్ట్రంలోని జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి అధ్యక్షుడు.[7]

హెచ్‌.డీ. కుమారస్వామి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో చెన్నపట్న శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుండి జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణే గౌడపై  284620 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచి[8][9], కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కుశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి [10], జూన్ 15న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు.[11]

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

కుమారస్వామి కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాకు చెందిన హోలెనరసిపుర తాలూకాలోని హరదనహళ్ళి గ్రామంలో హె.డి.దేవెగౌడ, చెన్నమ్మ దంపతులకు జన్మించాడు.[12]

ప్రాథమిక విద్యను హసన్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తిచేసాడు. తరువాత జయనగర లోని బెంగళూరు ఎం.ఇ.ఎస్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో మాధ్యమిక విద్యను పూర్తిచేసాడు. విజయ కళాశాలలో పి.యు.సి చదివాడు. తరువాత బి.యస్సీ డిగ్రీని బెంగళూరు లోని నేషనల్ కాలేజ్ లో పూర్తిచేసాడు. అతను 1985 మార్చి 13 న అనితను వివాహమాడాడు. వారికి ఒక కుమారుడు నిఖిల్ గౌడ్ ఉన్నాడు.[13]

కుమారస్వామి కన్నడ సినిమా నటి రాధికను 2006లో వివాహం చేసుకున్నాడు.[14] వారికి ఒక కుమార్తె షర్మిక కె.స్వామి ఉంది.[15] ఈ వివాహం భారతీయ శిక్షా కోడ్ సెక్షను 494 ప్రకారం హిందూ వ్యక్తిగత చట్టం క్రింద కోర్టులో చట్టపరమైన పరిశీలనకు వచ్చింది.[16] అయినప్పటికీ కర్ణాటక హైకోర్టు సరైన సాక్ష్యాధారాలు లేనందువల్ల కేసును కొట్టివేసింది.[17]

రాజకీయ జీవితం

[మార్చు]

కుమారస్వామి రాజకీయ ప్రవేశం 1996 సార్వత్రిక ఎన్నికలలో రామనగర జిల్లాలోని కనకపుర లోక్‌సభ నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీ చేయడం ద్వారా జరిగింది. ఆ ఎన్నికలో గెలుపొందాడు. 1998 లో జరిగిన కనకపుర నియోజకవర్గంలో మళ్లీ జరిగిన ఎన్నికలలో పోటీ చేసి ఎం.వి.చంద్రశేఖర మూర్తి చేతిలో ఓడిపోయాడు. ఇది కుమారస్వామికి అత్యంత ఘోరమైన ఓటమి, అతను తన డిపాజిట్‌ను కూడా కోల్పోయాడు.[18] అతను మరలా సాథనూర్ అసెంబ్లీ స్థానానికి 1999లో పోటీ చేసి విఫలమయ్యాడు. 2004లో రామనగర అసెంబ్లీ స్థానానికి పొటీ చేసి గెలుపొందాడు. 2004 కర్ణాటక అసెంబ్లీలో ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి తగినన్ని సీట్లు రాలేదు. అపుడు భారత జాతీయ కాంగ్రెస్, జనతా దళ్ (సెక్యులర్) పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాయి. అనుకూలమైన, స్నేహస్వభావం కలిగిన ధరమ్‌ సింగ్ సంకీర్ణ ప్రభుత్వానికి ఏకగ్రీవంగా నాయకునిగా ఎన్నుకోబడ్డాడు.[19] అతను 2004 మే 28 న ముఖ్యమంత్రి పదవినధిష్టించాడు.[20] 42 మంది శాసన సభ్యులు కల జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి అధిపతిగా ఉన్న కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించాడు. ప్రభుత్వం కూలిపోయింది. ధరమ్‌ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత 2006 జనవరి 28 న కర్ణాటక గవర్నర్ టి.ఎన్.చతుర్వేది కుమారస్వామిని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసినదిగా ఆహ్వానించాడు.

అతను 2006 ఫిబ్రవరి 4 నుండి 2007 అక్టోబరు 9 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతని పదవీ కాలంలో రాష్ట్ర జి.డి.పి రికార్డు స్థాయిలో పెరిగింది. అందువలన అతనిని "ప్రజల ముఖ్యమంత్రి"గా పిలుస్తారు.[ఆధారం చూపాలి] అతని సారథ్యంలోని జనతా దళ్ (సెక్యులర్) పార్టీ, భారతీయ జనతా పార్టీతో ముఖ్యమంత్రి పంచుకొనే ఒప్పందం ఉన్నందున అతను అక్టోబరు 3 న ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకుంటున్నట్లు 2007 సెప్టెంబరు 27 న ప్రకటించాడు. అధికార బదిలీని ఏర్పాటు చేయడంలో సమస్యల కారణంగా జెడి (ఎస్) లో కొంతమంది శాసనసభ్యులను అతనిని ముఖ్యమంత్రిగా కొనసాగాలని పిలుపునిచ్చారు.[21] అయితే 2007 అక్టోబరు 4 న అతను బి.జె.పికి ముఖ్యమంత్రి పదవిని బదిలీ చేయడానికి అంగీకరించలేదు.[22] చివరకు 2007 అక్టోబరు 8 న గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్కు రాజీనామా పత్రాన్నిసమర్పించాడు. రెండు రోజుల తరువాత కర్ణాటక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది.[23] అయినప్పటికీ, అతను తరువాత రాజీ పడి బి.జె.పికి మద్దతు యివ్వాలనుకున్నాడు. బి.జె.పి తరపున బి.ఎస్.యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా 2007 నవంబరు12 నుండి బాధ్యతలను స్వీకరించాడు.

కర్ణాటక రాష్ట్ర జె.డి (ఎస్) అధ్యక్షుడు మెరజుద్దీన్ పటేల్ ఆకశ్మిక మరణం తరువాత అతను రాష్ట్ర శాఖకు అధ్యక్షునిగా నియమితులైనారు.[24]

అయితే బెంగళూరు రూరల్ లోక్‌సభ నియోజకవర్గం, మంధ్య స్థానాలలో జరిగిన ఉప ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు.[25] అతను జనతా దళ్ (సెక్యులర్) రాష్ట్ర శాఖ్య అధ్యక్షుని పదవికి, ప్రతిపక్ష నాయకుని పదవికి రాజీనామా చేసాడు.[26] అయితే పార్టీ వర్గాలు అతనిని కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిపదవిలో కొనసాగాలని ఒప్పించగలిగాయి.[27] 2013 సెప్టెంబరు న కర్ణాటక జనతా దళ్ (సెక్యులర్) పార్టీ అధ్యక్షునిగా ఎ.క్రిష్టప్ప ఎన్నుకొబడ్డాడు.[28]

2014 నవంబరులోకుమారస్వామి కర్ణాటక జనతా దళ్ (సెక్యులర్) పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డాడు.[7][29]

2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో జె.డి. (ఎస్) మూడవ స్థానంలో ఉన్న పార్టీగా అవతరించింది. తరువాత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్తో కలసి కూటమిగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒప్పందం జరిగింది. అతను 2013 మే 23 న ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1996: 11వ లోక్‌సభ సభ్యుడు
  • 2004–08: కర్ణాటక అసెంబ్లీలో శాసన సభ్యుడు
  • ఫిబ్రవరి. 2006-అక్టోబరు.2007: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి
  • 2009: 15వ లోక్‌సభకు తిరిగి ఎన్నిక (2వసారి)
  • 2009 ఆగస్టు 31: గ్రామీణాభివృద్ధి కమిటీ సభ్యుడు
  • 2009 అక్టోబరు 15:పార్లమెంటు సముదాయంలో ఫుడ్ మేనేజిమెంటు కమిటీ సభ్యుడు;[30][31]
  • 2013 మే 31: కర్ణాటక అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు [7][29]
  • 1018 మే 23: కర్ణాటక ముఖ్యమంత్రి

సినిమా జీవితం

[మార్చు]

కుమారస్వామి కర్ణాటక రాజకీయనాయకుడు, పూర్వపు ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ కుమారుడైనప్పటికీ రాజకీయాలపై ఆసక్తి చూపేవాడు కాదు. అతనికి సినిమా నిర్మాణం, పంపిణీదారునిగా ఆసక్తి ఎక్కువగా ఉండేడి. అతను అనేక కన్నడ సినిమాలను నిర్మించాడు. వాటిలో "చంద్ర చకోరి" సినిమా మంచి విజయం సాధించింది. అది 365 రోజులపాటు థియేటర్లలో ఆడించబడింది. అతను ప్రముఖ కన్నడ సినిమా నటుడు రాజ్‌కుమార్కు అభిమాని. అతనికి చేసిన ఇంటర్వ్యూలో అతను తన కళాశాల రోజుల్లో సినిమాలలో రాజకుమార్ ధరించే వస్త్రధారణను అనుకరించేవాడినని తెలిపాడు.

మూలాలు

[మార్చు]
  1. "ANITHA KUMARASWAMY".
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-06. Retrieved 2018-05-20.
  3. Kumaraswamy,Shri H.D. Archived 7 జనవరి 2014 at the Wayback Machine on the Lok Sabha website.
  4. H. D. Kumaraswamy | HDK | Current Chief Minister of Karnataka| Personalities
  5. "JDS Releases CD of BJP MLA Trying to 'Buy' Its MLA". Outlook India. 21 October 2010. Retrieved 22 November 2017.
  6. "Karnataka: JD-S releases CD of BJP bribery attempt". Rediff.com. 21 October 2010. Retrieved 22 November 2017.
  7. 7.0 7.1 7.2 And the new Janata Dal (S) chief is HD Kumaraswamy
  8. Andhrajyothy (4 June 2024). "2.8 లక్షల ఆధిక్యంతో కుమారస్వామి గెలుపు". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
  9. Election Commision of India (4 June 2024). "2024 Mandhya Lok Sabha Results". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
  10. Eenadu (11 June 2024). "Union Ministers porfolios: కీలక శాఖలు భాజపాకే". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  11. EENADU (16 June 2024). "ఎమ్మెల్యే పదవులకు కుమార, బొమ్మై రాజీనామా". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  12. "Profile and Biography of Karnataka Chief Minister H.D.Kumaraswamy". Archived from the original on 2014-12-17. Retrieved 2018-05-20.
  13. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-12-17. Retrieved 2018-05-20.
  14. "I'm Mrs Kumaraswamy: Radhika".
  15. "Kumaraswamy in trouble for alleged second marriage with Kannada actor Radhika". Indian Today.
  16. "Kumaraswamy in trouble for alleged second marriage with Kannada actor Radhika". India Today. India Today. October 21, 2011.
  17. "HC dismisses petition on bigamy against HD Kumaraswamy". DNA.
  18. "Gowda set to contest Kanakapura byelection". The Hindu. 10 January 2002.
  19. "Dharam Singh chosen leader of CLP". The Times of India. 24 May 2004. Archived from the original on 2013-01-03. Retrieved 2018-05-20.
  20. "Dharam Singh, Siddaramaiah sworn in". The Hindu. 29 May 2004. Archived from the original on 4 జూలై 2004. Retrieved 20 మే 2018.
  21. "Kumaraswamy says he will quit on Oct. 3" Archived 2008-04-21 at the Wayback Machine, PTI (The Hindu), 27 September 2007.
  22. M, Anil Kumar (17 October 2011). "October effect haunts BS Yeddyurappa". The Times of India.
  23. "Karnataka under President Rule". Financial Express. 9 October 2007. Archived from the original on 13 April 2014.
  24. "Kumaraswamy elected JDS Legislature party leader". The Deccan Herald. 20 May 2013. Archived from the original on 13 April 2014.
  25. Satish, D. P. (24 August 2013). "Congress wins Karnataka by-polls by heavy margin". IBN Live. Archived from the original on 24 August 2013.
  26. Shankar, Vijay (24 August 2013). "Kumaraswamy resigns as assembly Oppn leader and JD(S) state prez". One India News. Archived from the original on 4 October 2013.
  27. "Kumaraswamy still Leader of Opposition in Assembly". The Hindu. 30 August 2013. Archived from the original on 31 August 2013.
  28. "A. Krishnappa elected State JD(S) president". The Hindu. 12 September 2013. Archived from the original on 13 September 2013.
  29. 29.0 29.1 "H D Deve Gowda announces son as party president of Karnataka unit - The Economic Times". Archived from the original on 2016-03-05. Retrieved 2018-05-20.
  30. "Members of Parliament (Lok Sabha): Detailed Profile: Shri H.D. Kumaraswamy". Government of India. Archived from the original on 4 మే 2012. Retrieved 20 మే 2018.
  31. "Fifteenth Lok Sabha Members: Bioprofile". Lok Sabha. Archived from the original on 2009-07-28. Retrieved 20 మే 2018.

బయటి లంకెలు

[మార్చు]
రాజకీయ కార్యాలయాలు
అంతకు ముందువారు
ధరమ్‌సింగ్
కర్నాటక ముఖ్యమంత్రి
2006 ఫిబ్రవరి 3 నుండి 2007 అక్టోబరు 9
తరువాత వారు
బి.ఎస్.యడ్యూరప్ప