2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్ణాటక శాసనసభ ఎన్నికలు, 2018
భారతదేశం
2013 ←
12 మే 2018 (222 సీట్లు)
28 మే 2018 (2 సీట్లు)

→ 2023

కర్నాటక అసెంబ్లీలో 224 సీట్లకు 222
మెజారిటీ కొరకు 113 సీట్లు అవసరం
పోలింగ్ 72.13%[1]
  మెజారిటీ పార్టీ మైనారిటీ పార్టీ ఇతర పార్టీ
 
నాయకుడు బి.ఎస్.యడ్యూరప్ప సిద్ధరామయ్య హెచ్. డి. కుమారస్వామి
పార్టీ బి.జె.పి INC JD(S)
నాయకుని నియోజకవర్గం శికారిపుర అసెంబ్లీ నియోజకవర్గం (గెలుపు) 1. బాదామి(తెలుపు)
2. చాముండేశ్వరి (ఓటమి)
1. రామనగర (గెలుపు)
2. చన్నపట్న (గెలుపు)
ప్రస్తుత సీట్లు 40 122 40
గెలిచిన సీట్లు 104 78 37
మార్పు Increase64 Decrease44 Decrease3
జనాదరణ పొందిన ఓట్లు 13,185,384 13,824,005 6,666,307
ఓట్ల శాతం 36.2% 38% 18.3%
ఊగిసలాట Increase16.3% Increase1.4% Decrease1.9%

కర్నాటక అసెంబ్లీ నియోజకవర్గాలు

ఎన్నికల ముందు
ముఖ్యమంత్రి

సిద్ధరామయ్య
కాంగ్రెస్

ఎన్నికల తరువాత
ముఖ్యమంత్రి

హెచ్. డి. కుమారస్వామి
JD(S)

కర్ణాటక రాష్ట్రంలో 2018 మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 224 స్థానాలకు జరగవలసిన ఎన్నికలలో 222 అసెంబ్లీ స్థానాలకుమాత్రెమే ఈ ఎన్నికలు జరిగినవి. మిగిలిన రెండు స్థానాలైన విజయనగర శాసనసభ నియోజకవర్గం లో ఎం.ఎల్.ఎ మరణం వల్ల, రాజరాజేశ్వరి నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికల మోసం అభియోగం వల్ల ఎన్నికలు వాయిదా వేయబడినవి. ఈ స్థానాలలో 2018 మే 28 న ఎన్నికలు జరుగుతాయి.[2] భారతీయ జనతా పార్టీ 2007 లో, 2008 నుండి 2013 వరకు ప్రభుత్వం ఏర్పాటుచేసింది. బహుజన్ సమాజ్ పార్టీ, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలు కూటమి కలసి పోటీ చేసింది. ఆమ్‌ఆదమీ పార్టీ మొదటి సారి ఈ రాష్ట్రంలో పోటీ చేసింది.[3]

ఈ ఎన్నికల ఫలితాలలో వివిధ పార్టీలకు లభించిన సీట్ల ఆధారంగా హంగ్ అసెంబ్లీకి దారితీసింది. 104 సీట్లతో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు సంపాదించింది. కానీ ప్రభుత్వానికి సరిపడే మెజారిటీ (113) ను సాధించలేకపోయింది.[4] 2013 లో ఎన్నికలు జరిగినప్పటి నుంచి రాష్ట్రాన్ని పాలించిన భారత జాతీయ కాంగ్రెస్ కు 78 సీట్లు వచ్చాయి. అది ఏ పార్టీకి సరిపడే మెజారిటీ లేనందున ఉప ఎన్నిక కావాలని కోరింది.

నేపధ్యం

[మార్చు]

కర్నాటక అసెంబ్లీ కాలం 2018 మే 28 నాటికి ముగుస్తుంది.[5]

ఎన్నికల షెడ్యూల్

[మార్చు]

భారత ఎన్నికల కమిషన్ చే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ 2018 మార్చి 27 న ప్రకటించబడింది. ఒకే దశలో ఎన్నికల పోలింగును మే 12 న జరిపి, మే 15నాటికి ఫలితాలు ప్రకంటించాలని అందులో ఉంది.[6] ఈ ప్రకటన వెలువడిన నాటి నుండి ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోనికి వచ్చింది.[7][8]

విషయం తేదీ వారం
నామినేషన్ల తేదీ 17 ఏప్రిల్ 2018 మంగళవారం
నామినేషన్ల చివరితేదీ 24 ఏప్రిల్ 2018 మంగళవారం
నామినేషన్ల పరిశీలన 25 ఏప్రిల్ 2018 బుధవారం
నామినేషన్ల ఉపసంహరణ 27 ఏప్రిల్ 2018 శుక్రవారం
ఎన్నికల తేదీ 12 మే 2018 శనివారం
ఎన్నికల కౌంటింగ్ 15 మే 2018 మంగళవారం
ఎన్నికల ప్రక్రియ పూర్తవడానికి తేదీ 31 మే 2018 గురువారం

ఎన్నికల ప్రచారం

[మార్చు]

భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని 2017, నవంబరు 2 న ప్రారంభించింది.[9] ఈ పార్టీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో 85 రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహించి 2018 ఫిబ్రవరి 4 తో ముగించింది. ఈ ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా పాల్గొన్నాడు.[10] మార్చి మొదటి వారంలో 14 రోజుల బెంగళూరు పాదయాత్రను చేసింది.[11]

ఎన్నికల ప్రచారంలో భాగం కాకపోయినా కర్ణాటక కాంగ్రెస్ కమిటీ డిసెబరు 2017 న కర్నాటక రాష్ట్రంలో 54,261 చోట్ల బూత్ స్థాయి కమిటీలను వేసి ప్రభుత్వ కార్యకలాపాలను వివిధ కార్యక్రమాల ద్వారా అందరికీ తెలియజేయాలని నిర్ణయించింది. ఈ విస్తృతమైన కార్యక్రమంతో పాటు ఎన్నికల ప్రచారం కూడా జరిగింది.[12]

ఎగ్జిట్ పోల్స్

[మార్చు]

వివిధ సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ లో భారతీయ జనతాపార్టీ అధికారంలోనికి వస్తుందని ఒక సంస్థ జోస్యం చెప్పగా, ఐదు సంస్థలు బి.జె.పికి ఎక్కువ స్థానాలు వస్తాయని తెలిపాయి. రెండు సంస్థలు కాంగ్రెస్ అధికారంలోనికి వస్తుందని చెప్పాయి.

ఎగ్జిట్ పోల్స్
పోలింగ్ సంస్థ ప్రచురణ తేదీ ఆధిక్యం
బి.జె.పి కాంగ్రెస్ జె.డి.ఎస్ ఇతరులు
ఇండియా TV-VMR[13] 12 May 2018 94 97 28 3 3
రిపబ్లిక్ TV-జన్ కీ బాత్ [14] 12 May 2018 105 78 37 2 27
ABP న్యూస్-C ఓటర్[15] 12 May 2018 110 88 24 2 22
టైమ్స్ నౌ-VMR[16] 12 May 2018 87 97 35 3 10
టమ్స్ నౌ-టుడేస్ చాణక్య[17] 12 May 2018 120 73 26 3 47
ఇండియా టుడే - ఏక్సిస్ మై ఇండియా [18] 12 May 2018 85 111 26 0 26
న్యూస్ X-CNX[19] 12 May 2018 106 75 37 4 31
న్యూస్ నేషన్ [20] 12 May 2018 107 73 38 4 34

ఫలితాలు

[మార్చు]
కర్నాటక అసెంభ్లీ ఎన్నికలు 2018
ಪಕ್ಷ seats
బి.జె.పి
  
104
కాంగ్రెస్
  
78
జె.డి.ఎస్
  
37
ఇతరులు
  
3
మొత్తం స్థానాలు 224; ఎన్నికలు జరిగినవి 222
Parties and coalitions Popular vote Seats
Votes % ±pp Won +/−
భారతీయ జనతా పార్టీ (BJP) 1,31,85,384 36.2 104 Increase64
భారత జాతీయ కాంగ్రెస్ (INC) 1,38,24,005 38.0 78 Decrease44
జనతాదళ్ (సెక్యులర్) (JDS) 66,66,307 18.3 37 Decrease3
స్వతంత్రులు (IND) 14,37,045 3.9 1 Decrease8
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) 1,08,592 0.3 1 Increase1
కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (KPJP) 74,229 0.2 1 Increase1
ఇతర పార్టీలు, నాయకులు 6,83,632 2.2 0 Decrease13
(NOTA) 3,22,841 0.9
ఖాళీ స్థానాలు 2 Increase2
Total 100.00 224 ±0

1999 నుండి 2018 వరకు వివిధ పార్టీల సీట్లలో మార్పులు

[మార్చు]
  భారతీయ జనతా పార్టీ
  కాంగ్రెస్
  జె.డి (ఎస్)

పార్టీల ఓట్ల శాతం

[మార్చు]

2014 కర్నాటక ఎన్నికలలో పార్టీల ఓట్ల శాతం

  కాంగ్రెస్ (38%)
  బి.జె.పి (36.2%)
  జె.డి (ఎస్) (18.4%)
  స్వతంత్రులు (4.00%)
  ఇతరులు (3.4%)
 • బిజెపి కంటే కాంగ్రెస్ అత్యధిక ఓట్లను సాధించింది.
పార్టీ ఓట్లశాతం పొందిన ఓట్లు
1 భారత జాతీయకాంగ్రెస్ 38% 1,37,63,500
2 భారతీయ జనతాపార్టీ 36.2% 1,31,20,300
3 జనతాదళ్ సెక్యులర్ 18.4% 66,48700
4 స్వతంత్రులు 4.00% 14,34,951
5 బహుజన సమాజ పార్టీ 0.3% 1,08592
6 ఎ.ఐ.ఎం ఇపి 0.33% 97,572
7 బి.పి.జె.పి 0.2% 83,071
8 సి.పి.ఎం 0.2% 81,181
9 స్వరాజ్ 0.2% 94,000
10 కె.పి.జి.పి 0.2% 74,229
11 నోటా 0.9% 3,09573
12 ఇతరులు -

గవర్నర్ నిర్ణయం - వివాదాలు

[మార్చు]

కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్‌లకు 118 సీట్లతో పూర్తి మద్దతు ఉంది. బీజేపీకి కేవలం 104 సీట్లు మాత్రమే ఉన్నాయి. అయినా గవర్నర్ వాజుభాయ్ వాలా బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసినదిగా సూచించాడు. అసెంబ్లీలో బలనిరూపణకు 15 రోజుల సమయం ఇచ్చాడు. కర్నాటక 23వ ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప 2018 మే 17న ప్రమాణస్వీకారం చేశాడు. గవర్నర్ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా నిర్ణయం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్, జె.డి.ఎస్ పార్టీలు సుప్రీం కోర్టులో కేసు వేసాయి. మే 19 సాయంత్రం నాలుగు గంటలకు బల పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే బల పరీక్షకు కనీసం వారం రోజులు సమయం కావాలన్న బీజేపీ వాదనలను  కోర్టు తిరస్కరించింది. బలపరీక్షకు ఏర్పాట్లు చేయాలని కర్నాటక డీజీపీని కోర్టు ఆదేశించింది.[21] ఈ బల పరీక్షను ప్రోటెం స్పీకరు నిర్వహించాలని ఆదేశించింది. ఆ ఆదేశాలకనుగుణంగా గవర్నర్ ప్రోటెం స్పీకరుగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను నియమించాడు. బోపయ్య 2010 అక్టోబరులో అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్పపై తిరుగుబాటు చేసిన 11మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుని, ప్రభుత్వాన్ని నిలబెట్టాడు. కర్ణాటక హైకోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థించినా, సుప్రీంకోర్టు మాత్రం దీన్ని తప్పుబట్టింది. ఈ నేపథ్యం గల వ్యక్తిని స్పీకరుగా పారదర్శకంగా వ్యవహరించడని కాంగ్రెస్, జె.డి.ఎస్ పార్టీ నాయకులు మరలా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2018 మే 19 న ప్రోటెం స్పీకర్ నియామకం చెల్లదన్న కాంగ్రెస్, జేడీఎస్ వాదనలను సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. అసెంబ్లీలో నిర్వహించే విశ్వాస పరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.[22] 2018 మే 19 ఉదయం 11 గంటలకు శాసన సభ సమావేశం జరిగింది. ప్రోటెం స్పీకర్ బోపయ్య ముందుగా ఎన్నికైన శాసన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించాడు. మొదట భారతీయ జనతా పార్టీ సంఖ్యాబలం పెంచుకోవడానికి ప్రయత్నించి విఫలమైంది. రెండు రోజుల పాటు (55 గంటలు) ముఖ్యమంత్రిగా కొనసాగిన యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. అందువల్ల విశ్వాస పరీక్షకు ఆస్కారం లేకుండా పోయింది.[23]

కాంగ్రెస్- జె.డి.ఎస్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంగీకారాన్ని గవర్నరుకు తెలిపాయి. దీని ఫలితంగా కర్నాటక 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పరమేశ్వర ప్రమాణం స్వీకారం చేశారు. వారి చేత 2018 మే 23న గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రమాణం చేయించాడు. కర్నాటక విధాన సౌధ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది జేడీఎస్, కాంగ్రెస్, బీఎస్పీ, ఇతర పార్టీల కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.[24]

అవిశ్వాస తీర్మానం

[మార్చు]

కర్నాటకలో 23/జులై/2019 లో కాంగ్రస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారు కూలిపోయింది. కర్నాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో కుమార సర్కారు మెజారిటీ నిరూపించుకోవడంలో విఫలమైంది. సభలో మెజార్టీకి కావాల్సిన మేజిక్ ఫిగర్ 103 కాగా. సభకు హాజరయిన బీజేపీ ఎమ్మెల్యేలు 105 మంది ఉన్నారు. మరో వైపు రెబల్స్‌ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ సభ్యుల సంఖ్య కేవలం 101 మాత్రమే ఉంది. కాగా స్పీకర్‌, నామినేటేడ్‌ ఎమ్మెల్యేలను తీసివేస్తే అధికారపక్షం బలం 99కి పరిమితం అయ్యింది. 15 మంది రెబల్స్‌, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు అయ్యారు. డివిజన్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. హెడ్ కౌంట్ ద్వారా సభ్యులను లెక్కించారు. విశ్వాస పరీక్షలో అధికార పక్షం ఓట్లు 99 కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా 105 ఓట్లు దక్కాయి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
# నియోజకవర్గం విజేత[25][26] ద్వితియ విజేత మార్జిన్
అభ్యర్థి పార్టీ ఓట్లు ద్వితియ విజేత పార్టీ ఓట్లు
బెలగావి జిల్లా
1 నిప్పాని శశికళ జోలె బీజేపీ 87,006 కాకాసో పాండురంగ్ పాటిల్ కాంగ్రెస్ 78,500 8,506
2 చిక్కోడి-సదలగా గణేష్ హుక్కేరి కాంగ్రెస్ 91,467 అన్నాసాహెబ్ జోల్లె బీజేపీ 80,898 10,569
3 అథని మహేష్ కుమతల్లి కాంగ్రెస్ 82,094 లక్ష్మణ్ సవాడి బీజేపీ 79,763 2,331
4 కాగ్వాడ్ శ్రీమంత్ పాటిల్ కాంగ్రెస్ 83,060 రాజు కేజ్ బీజేపీ 50,118 32,942
5 కుడచి (SC) పి. రాజీవ్ బీజేపీ 67,781 అమిత్ షామా ఘటగే కాంగ్రెస్ 52,773 15,008
6 రాయబాగ్ (SC) దుర్యోధన్ ఐహోలె బీజేపీ 67,502 ప్రదీప్కుమార్ రాము మాలగే కాంగ్రెస్ 50,954 16,548
7 హుక్కేరి ఉమేష్ కత్తి బీజేపీ 83,588 అప్పయ్యగౌడ బాసగౌడ పాటిల్ కాంగ్రెస్ 68,203 15,385
8 అరభావి బాలచంద్ర జార్కిహోళి బీజేపీ 96,144 భీమప్ప గుండప్ప గడద్ జేడీఎస్ 48,816 47,328
9 గోకాక్ రమేష్ జార్కిహోళి కాంగ్రెస్ 90,249 అశోక్ పూజారి బీజేపీ 75,969 14,280
10 యెమకనమర్డి (ST) సతీష్ జార్కిహోళి కాంగ్రెస్ 73,512 అస్తగి మారుతి మల్లప్ప బీజేపీ 70,662 2,850
11 బెల్గాం ఉత్తర అనిల్ ఎస్ బెనకే బీజేపీ 79,060 ఫైరోజ్ నూరుద్దీన్ సేత్ కాంగ్రెస్ 61,793 17,267
12 బెల్గాం దక్షిణ అభయ్ పాటిల్ బీజేపీ 84,498 ఎండి లక్ష్మీనారాయణ కాంగ్రెస్ 25,806 58,692
13 బెల్గాం రూరల్ లక్ష్మీ హెబ్బాల్కర్ కాంగ్రెస్ 102,040 సంజయ్ పాటిల్ బీజేపీ 50,316 51,724
14 ఖానాపూర్ అంజలి నింబాల్కర్ కాంగ్రెస్ 36,649 విఠల్ హలగేకర్ బీజేపీ 31,516 5,133
15 కిత్తూరు DM బసవంతరాయ్ బీజేపీ 73,155 ఇనామ్దార్ దానప్పగౌడ బసనగౌడ కాంగ్రెస్ 40,293 32,862
16 బైల్‌హోంగల్ మహంతేష్ కౌజ్లాగి కాంగ్రెస్ 47,040 జగదీష్ మెట్‌గూడ Ind 41,918 5,122
17 సౌందత్తి ఎల్లమ్మ ఆనంద్ మామణి బీజేపీ 62,480 ఆనంద్ చోప్రా Ind 56,189 6,291
18 రామదుర్గ్ మహదేవప్ప యాదవ్ బీజేపీ 68,349 అశోక్ మహదేవప్ప పట్టన్ కాంగ్రెస్ 65,474 2,875
బాగల్‌కోట్ జిల్లా
19 ముధోల్ (SC) గోవింద్ ఎం. కార్జోల్ బీజేపీ 76,431 బండివద్దర్ సతీష్ చిన్నప్ప కాంగ్రెస్ 60,949 15,482
20 టెర్డాల్ సిద్దు సవది బీజేపీ 87,583 ఉమాశ్రీ కాంగ్రెస్ 66,470 21,113
21 జమఖండి ఆనంద్ న్యామగౌడ కాంగ్రెస్ 49,245 శ్రీకాంత్ కులకర్ణి బీజేపీ 46,450 2,795
22 బిల్గి మురుగేష్ నిరాణి బీజేపీ 85,135 JT పాటిల్ కాంగ్రెస్ 80,324 4,811
23 బాదామి సిద్ధరామయ్య కాంగ్రెస్ 67,599 బి. శ్రీరాములు బీజేపీ 65,903 1,696
24 బాగల్‌కోట్ వీరభద్రయ్య చరంతిమఠం బీజేపీ 85,653 HY మేటి కాంగ్రెస్ 69,719 15,934
25 హుంగుండ్ దొడ్డనగౌడ పాటిల్ బీజేపీ 65,012 విజయానంద్ కాశప్పనవర్ కాంగ్రెస్ 59,785 5,227
బీజాపూర్ జిల్లా
26 ముద్దేబిహాల్ అమీనప్ప గౌడ పాటిల్ (నడహళ్లి) బీజేపీ 63,512 సీఎస్ నాదగౌడ కాంగ్రెస్ 54,879 8,633
27 దేవర్ హిప్పర్గి సోమనగౌడ బి పాటిల్ (శాసనూరు) బీజేపీ 48,245 భీమనగౌడ బి. పాటిల్ జేడీఎస్ 44,892 3,353
28 బసవన్న బాగేవాడి శివానంద్ పాటిల్ కాంగ్రెస్ 58,647 సోమనగౌడ బి. పాటిల్ జేడీఎస్ 55,461 3,186
29 బబలేశ్వర్ ఎంబీ పాటిల్ కాంగ్రెస్ 98,339 విజయకుమార్ సిద్రాంగౌడ్ పాటిల్ బీజేపీ 68,624 29,715
30 బీజాపూర్ సిటీ బసంగౌడ పాటిల్ యత్నాల్ బీజేపీ 76,308 అబ్దుల్ హమీద్ ముష్రిఫ్ కాంగ్రెస్ 69,895 6,413
31 నాగథాన్ (SC) దేవానంద్ ఫూలాసింగ్ చవాన్ జేడీఎస్ 59,709 కటకడోండ్ విట్టల్ దొండిబా కాంగ్రెస్ 54,108 5,601
32 ఇండి వైవీ పాటిల్ కాంగ్రెస్ 50,401 BD పాటిల్ హంజాగి జేడీఎస్ 40,463 9,938
33 సింద్గి MC మనగూలి జేడీఎస్ 70,865 రమేష్ భూసనూర్ బీజేపీ 61,560 9,305
గుల్బర్గా జిల్లా
34 అఫ్జల్‌పూర్ MY పాటిల్ కాంగ్రెస్ 71,735 మాలికయ్య గుత్తేదార్ బీజేపీ 61,141 10,594
35 జేవర్గి అజయ్ సింగ్ కాంగ్రెస్ 68,508 దొడ్డప్ప గౌడ ఎస్.పాటిల్ నరిబోలు బీజేపీ 52,452 16,056
యాద్గిర్ జిల్లా
36 షోరాపూర్ (ST) నరసింహ నాయక్ బీజేపీ 104,426 రాజా వెంకటప్ప నాయక్ కాంగ్రెస్ 81,858 22,568
37 షాహాపూర్ శరణబస్సప్ప దర్శనపూర్ కాంగ్రెస్ 78,642 గురు పాటిల్ సిర్వాల్ బీజేపీ 47,668 30,974
38 యాద్గిర్ వెంకటరెడ్డి ముద్నాల్ బీజేపీ 62,227 డాక్టర్ ఎబి మలక రెడ్డి కాంగ్రెస్ 49,346 12,881
39 గుర్మిత్కల్ నాగంగౌడ్ కండ్కూర్ జేడీఎస్ 79,627 బాబూరావు చించనసూర్ కాంగ్రెస్ 55,147 24,480
గుల్బర్గా జిల్లా
40 చిత్తాపూర్ (SC) ప్రియాంక్ ఎం. ఖర్గే కాంగ్రెస్ 69,700 వాల్మీకి నాయక్ బీజేపీ 65,307 4,393
41 సేడం రాజ్ కుమార్ పాటిల్ బీజేపీ 80,668 శరణ్ ప్రకాష్ పాటిల్ కాంగ్రెస్ 73,468 7,200
42 చించోలి (SC) డా. ఉమేష్ జి. జాదవ్ కాంగ్రెస్ 73,905 సునీల్ వల్ల్యాపురే బీజేపీ 54,693 19,212
43 గుల్బర్గా రూరల్ (SC) బసవరాజ్ మట్టిముడ్ బీజేపీ 61,750 విజయ్‌కుమార్ జి. రామకృష్ణ కాంగ్రెస్ 49,364 12,386
44 గుల్బర్గా దక్షిణ దత్తాత్రయ సి. పాటిల్ రేవూరు బీజేపీ 64,788 అల్లంప్రభు పాటిల్ కాంగ్రెస్ 59,357 5,431
45 గుల్బర్గా ఉత్తర కనీజ్ ఫాతిమా కాంగ్రెస్ 64,311 చంద్రకాంత్ బి. పాటిల్ బీజేపీ 58,371 5,940
46 అలంద్ సుభాష్ గుత్తేదార్ బీజేపీ 76,815 బిఆర్ పాటిల్ కాంగ్రెస్ 76,118 697
బీదర్ జిల్లా
47 బసవకల్యాణ్ బి. నారాయణరావు కాంగ్రెస్ 61,425 మల్లికార్జున్ ఖూబా బీజేపీ 44,153 17,272
48 హుమ్నాబాద్ రాజశేఖర్ బసవరాజ్ పాటిల్ కాంగ్రెస్ 74,945 సుభాష్ బీజేపీ 43,131 31,814
49 బీదర్ సౌత్ బందెప్ప కాశెంపూర్ జేడీఎస్ 55,107 డాక్టర్ శైలేంద్ర బెల్డేల్ బీజేపీ 42,365 12,742
50 బీదర్ రహీమ్ ఖాన్ కాంగ్రెస్ 73,270 సూరయ్యకాంత్ నాగమర్పల్లి బీజేపీ 63,025 10,245
51 భాల్కి ఈశ్వర ఖండ్రే కాంగ్రెస్ 84,673 డీకే సిద్రాం బీజేపీ 63,235 21,438
52 ఔరాద్ (SC) ప్రభు చౌహాన్ బీజేపీ 75,061 విజయ్‌కుమార్ కాంగ్రెస్ 64,469 10,592
రాయచూరు జిల్లా
53 రాయచూర్ రూరల్ (ST) బసనగౌడ దద్దల్ కాంగ్రెస్ 66,656 తిప్పరాజు హవాల్దార్ బీజేపీ 56,692 9,964
54 రాయచూరు డాక్టర్ శివరాజ్ పాటిల్ బీజేపీ 56,511 సయ్యద్ యాసీన్ కాంగ్రెస్ 45,520 10,991
55 మాన్వి (ST) రాజా వెంకటప్ప నాయక్ జేడీఎస్ 53,548 డాక్టర్ తనుశ్రీ ప్రీతి Ind 37,733 15,815
56 దేవదుర్గ (ఎస్టీ) కె. శివనగౌడ నాయక్ బీజేపీ 67,003 ఎ. రాజశేఖర్ నాయక్ కాంగ్రెస్ 45,958 21,045
57 లింగ్సుగూర్ డిఎస్ హూలగేరి కాంగ్రెస్ 54,230 బండి సిద్దు జేడీఎస్ 49,284 4,946
58 సింధనూరు వెంకట్రావు నాదగౌడ జేడీఎస్ 71,514 బాదర్లీ హంపన్‌గౌడ కాంగ్రెస్ 69,917 1,597
59 మాస్కీ (ST) ప్రతాప్ గౌడ పాటిల్ కాంగ్రెస్ 60,387 బసనగౌడ తుర్విహాల్ బీజేపీ 60,174 213
కొప్పళ జిల్లా
60 కుష్టగి అమరగౌడ బయ్యాపూర్ కాంగ్రెస్ 87,566 దొడ్డనగౌడ హనమగౌడ పాటిల్ బీజేపీ 69,535 18,031
61 కనకగిరి (SC) బసవరాజ్ దడేసుగూర్ బీజేపీ 87,735 శివరాజ్ తంగడగి కాంగ్రెస్ 73,510 14,225
62 గంగావతి పరన్న మునవల్లి బీజేపీ 67,617 ఇక్బాల్ అన్సారీ కాంగ్రెస్ 59,644 7,973
63 యెల్బుర్గా హాలప్ప ఆచార్ బీజేపీ 79,072 బసవరాజ రాయరెడ్డి కాంగ్రెస్ 65,754 13,318
64 కొప్పల్ కె. రాఘవేంద్ర హిట్నాల్ కాంగ్రెస్ 98,783 అమరేష్ సంగన్న కరడి బీజేపీ 72,432 26,351
గడగ్ జిల్లా
65 శిరహట్టి (SC) రామప్ప లమాని బీజేపీ 91,967 దొడ్డమని రామకృష్ణ శిద్లింగప్ప కాంగ్రెస్ 61,974 29,993
66 గడగ్ HK పాటిల్ కాంగ్రెస్ 77,699 అనిల్ మెన్సినాకై బీజేపీ 75,831 1,868
67 రాన్ కలకప్ప బండి బీజేపీ 83,735 గురుపాదగౌడ పాటిల్ కాంగ్రెస్ 76,401 7,334
68 నరగుండ్ సిసి పాటిల్ బీజేపీ 73,045 బిఆర్ యావగల్ కాంగ్రెస్ 65,066 7,979
ధార్వాడ్ జిల్లా
69 నవల్గుండ్ శంకర్ పాటిల్ మునేనకొప్ప బీజేపీ 65,718 NH కోనారెడ్డి జేడీఎస్ 45,197 20,521
70 కుండ్గోల్ సిఎస్ శివల్లి కాంగ్రెస్ 64,871 చిక్కనగౌడ్ర సిద్దనగౌడ్ ఈశ్వరగౌడ్ బీజేపీ 64,237 634
71 ధార్వాడ్ అమృత్ దేశాయ్ బీజేపీ 85,123 వినయ్ కులకర్ణి కాంగ్రెస్ 64,783 20,340
72 హుబ్లీ-ధార్వాడ్ ఈస్ట్ (SC) అబ్బయ్య ప్రసాద్ కాంగ్రెస్ 77,080 చంద్రశేఖర్ గోకాక్ బీజేపీ 55,613 21,467
73 హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ జగదీష్ షెట్టర్ బీజేపీ 75,794 డా. మహేష్ నల్వాడ్ కాంగ్రెస్ 54,488 21,306
74 హుబ్లీ-ధార్వాడ్ వెస్ట్ అరవింద్ బెల్లాడ్ బీజేపీ 96,462 మహ్మద్ ఇస్మాయిల్ తమత్గార్ కాంగ్రెస్ 55,975 40,487
75 కల్ఘట్గి సీఎం నింబన్నవర్ బీజేపీ 83,267 సంతోష్ లాడ్ కాంగ్రెస్ 57,270 25,997
ఉత్తర కన్నడ
76 హలియాల్ ఆర్వీ దేశపాండే కాంగ్రెస్ 61,577 సునీల్ హెగాడే బీజేపీ 56,437 5,140
77 కార్వార్ రూపాలి నాయక్ బీజేపీ 60,339 ఆనంద్ అస్నోటికర్ జేడీఎస్ 46,275 14,064
78 కుంట దినకర్ కేశవ్ శెట్టి బీజేపీ 59,392 శారదా మోహన్ శెట్టి కాంగ్రెస్ 26,642 32,750
79 భత్కల్ సునీల్ బిలియా నాయక్ బీజేపీ 83,172 MS వైద్య కాంగ్రెస్ 77,242 5,930
80 సిర్సి విశ్వేశ్వర హెగ్డే కాగేరి బీజేపీ 70,595 భీమన్న నాయక్ కాంగ్రెస్ 53,134 17,461
81 ఎల్లాపూర్ అర్బైల్ శివరామ్ హెబ్బార్ కాంగ్రెస్ 66,290 అందాలగి వీరభద్రగౌడ శివనగౌడ పాటిల్ బీజేపీ 64,807 1,483
హావేరి జిల్లా
82 హంగల్ సీఎం ఉదాసి బీజేపీ 80,529 శ్రీనివాస్ మానె కాంగ్రెస్ 74,015 6,514
83 షిగ్గావ్ బసవరాజ్ బొమ్మై బీజేపీ 83,868 అజీమ్‌పీర్ ఖాద్రీ అన్నారు కాంగ్రెస్ 74,603 9,265
84 హావేరి (SC) నెహారు ఓలేకర్ బీజేపీ 86,565 రుద్రప్ప లమాని కాంగ్రెస్ 75,261 11,304
85 బైద్గి బళ్లారి విరూపాక్షప్ప రుద్రప్ప బీజేపీ 91,721 SR పాటిల్ కాంగ్రెస్ 70,450 21,271
86 హిరేకెరూరు బీసీ పాటిల్ కాంగ్రెస్ 72,461 యుబి బనకర్ బీజేపీ 71,906 555
87 రాణేబెన్నూరు ఆర్. శంకర్ KPJP 63,910 KB కోలివాడ్ కాంగ్రెస్ 59,572 4,338
బళ్లారి జిల్లా
88 హూవినా హడగలి (SC) పిటి పరమేశ్వర నాయక్ కాంగ్రెస్ 54,097 ఓడో గంగప్ప Ind 44,919 9,178
89 హగరిబొమ్మనహళ్లి (SC) LBP భీమా నాయక్ కాంగ్రెస్ 78,337 కె.నేమిరాజా నాయక్ బీజేపీ 71,105 7,232
90 విజయనగరం ఆనంద్ సింగ్ కాంగ్రెస్ 83,214 హెచ్ ఆర్ గవియప్ప బీజేపీ 74,986 8,228
91 కంప్లి (ST) జెఎన్ గణేష్ కాంగ్రెస్ 80,592 టిహెచ్ సురేష్ బాబు బీజేపీ 75,037 5,555
92 సిరుగుప్ప (ఎస్టీ) ఎంఎస్ సోమలింగప్ప బీజేపీ 82,546 బి. మురళీ కృష్ణ కాంగ్రెస్ 61,275 21,271
93 బళ్లారి రూరల్ (ST) బి. నాగేంద్ర కాంగ్రెస్ 79,186 సన్న పక్కిరప్ప బీజేపీ 76,507 2,679
94 బళ్లారి సిటీ జి. సోమశేఖర రెడ్డి బీజేపీ 76,589 అనిల్ లాడ్ కాంగ్రెస్ 60,434 16,155
95 సండూర్ (ST) ఇ. తుకారాం కాంగ్రెస్ 78,106 డి రాఘవేంద్ర మంజు బీజేపీ 64,096 14,010
96 కుడ్లిగి NY గోపాలకృష్ణ బీజేపీ 50,085 NT బొమ్మన్న జేడీఎస్ 39,272 10,813
చిత్రదుర్గ జిల్లా
97 మొలకాల్మూరు (ఎస్టీ) బి. శ్రీరాములు బీజేపీ 84,018 డా. బి. యోగేష్ బాబు కాంగ్రెస్ 41,973 42,045
98 చల్లకెరె (ST) టి. రఘుమూర్తి కాంగ్రెస్ 72,874 రవీష్ కుమార్ జేడీఎస్ 59,335 13,539
99 చిత్రదుర్గ జీహెచ్ తిప్పారెడ్డి బీజేపీ 82,896 కెసి వీరేంద్ర జేడీఎస్ 49,911 32,985
100 హిరియూరు కె. పూర్ణిమ బీజేపీ 77,733 డి. సుధాకర్ కాంగ్రెస్ 64,858 12,875
101 హోసదుర్గ గుల్హట్టి డి. శేఖర్ బీజేపీ 90,562 బిజి గోవిందప్ప కాంగ్రెస్ 64,570 25,992
102 హోలాల్కెరే (SC) ఎం. చంద్రప్ప బీజేపీ 107,976 హెచ్.ఆంజనేయ కాంగ్రెస్ 69,036 38,940
దావణగెరె జిల్లా
103 జగలూర్ (ఎస్టీ) ఎస్వీ రామచంద్ర బీజేపీ 78,948 HP రాజేష్ కాంగ్రెస్ 49,727 29,221
104 హరపనహళ్లి జి. కరుణాకర రెడ్డి బీజేపీ 67,603 ఎంపీ రవీంద్ర కాంగ్రెస్ 57,956 9,647
105 హరిహర్ S. రామప్ప కాంగ్రెస్ 64,801 బీపీ హరీష్ బీజేపీ 57,541 7,260
106 దావణగెరె ఉత్తర SA రవీంద్రనాథ్ బీజేపీ 76,540 ఎస్ఎస్ మల్లికార్జున్ కాంగ్రెస్ 72,469 4,071
107 దావణగెరె సౌత్ శామనూరు శివశంకరప్ప కాంగ్రెస్ 71,369 యశవంతరావు జాదవ్ బీజేపీ 55,485 15,884
108 మాయకొండ (SC) ఎన్. లింగన్న బీజేపీ 50,556 కె.ఎస్.బసవరాజ్ కాంగ్రెస్ 44,098 6,458
109 చన్నగిరి కె. మాదాల్ విరూపాక్షప్ప బీజేపీ 73,794 వడ్నాల్ రాజన్న కాంగ్రెస్ 48,014 25,780
110 హొన్నాలి ఎంపీ రేణుకాచార్య బీజేపీ 80,624 డిజి శాంతనగౌడ కాంగ్రెస్ 76,391 4,233
శివమొగ్గ జిల్లా
111 షిమోగా రూరల్ (SC) KB అశోక్ నాయక్ బీజేపీ 69,326 శారద పూర్నాయక్ జేడీఎస్ 65,549 3,777
112 భద్రావతి BK సంగమేశ్వర కాంగ్రెస్ 75,722 ఎంజే అప్పాజీ గౌడ్ జేడీఎస్ 64,155 11,567
113 షిమోగా కేఎస్ ఈశ్వరప్ప బీజేపీ 104,027 KB ప్రసన్న కుమార్ కాంగ్రెస్ 57,920 46,107
114 తీర్థహళ్లి అరగ జ్ఞానేంద్ర బీజేపీ 67,527 కిమ్మనే రత్నాకర్ కాంగ్రెస్ 45,572 21,955
115 షికారిపుర బీఎస్ యడ్యూరప్ప బీజేపీ 86,983 గోని మాలతేషా కాంగ్రెస్ 51,586 35,397
116 సోరాబ్ కుమార్ బంగారప్ప బీజేపీ 72,091 మధు బంగారప్ప జేడీఎస్ 58,805 13,286
117 సాగర్ హర్తాలు హాలప్ప బీజేపీ 78,475 కాగోడు తిమ్మప్ప కాంగ్రెస్ 70,436 8,039
ఉడిపి జిల్లా
118 బైందూర్ BM సుకుమార్ శెట్టి బీజేపీ 96,029 కె. గోపాల పూజారి కాంగ్రెస్ 71,636 24,393
119 కుందాపుర హాలడి శ్రీనివాస్ శెట్టి బీజేపీ 103,434 రాకేష్ మల్లి కాంగ్రెస్ 47,029 56,405
120 ఉడిపి కె. రఘుపతి భట్ బీజేపీ 84,946 ప్రమోద్ మధ్వరాజ్ కాంగ్రెస్ 72,902 12,044
121 కౌప్ లాలాజీ మెండన్ బీజేపీ 75,893 వినయ్ కుమార్ సొరకే కాంగ్రెస్ 63,976 11,917
122 కర్కల వి.సునీల్ కుమార్ బీజేపీ 91,245 H. గోపాల్ భండారి కాంగ్రెస్ 48,679 42,566
చిక్కమగళూరు జిల్లా
123 శృంగేరి టీడీ రాజేగౌడ కాంగ్రెస్ 62,780 డిఎన్ జీవరాజ్ బీజేపీ 60,791 1,989
124 ముదిగెరె (SC) ఎంపీ కుమారస్వామి బీజేపీ 58,783 మోటమ్మ కాంగ్రెస్ 46,271 12,512
125 చిక్కమగళూరు సిటి రవి బీజేపీ 70,863 బిఎల్ శంకర్ కాంగ్రెస్ 44,549 26,314
126 తరికెరె డిఎస్ సురేష్ బీజేపీ 44,940 GH శ్రీనివాస Ind 33,253 11,687
127 కడూరు కెఎస్ ప్రకాష్ బీజేపీ 62,232 యస్వీ దత్తా జేడీఎస్ 46,860 15,372
తుమకూరు జిల్లా
128 చిక్నాయకనహళ్లి జేసీ మధుస్వామి బీజేపీ 69,612 సిబి సురేష్ బాబు జేడీఎస్ 59,335 10,277
129 తిప్టూరు బిసి నగేష్ బీజేపీ 61,383 కె. షడక్షరి INC 35,820 25,563
130 తురువేకెరె ఏఎస్ జయరామ్ బీజేపీ 60,710 MT కృష్ణప్ప జేడీఎస్ 58,661 2,049
131 కుణిగల్ డాక్టర్ హెచ్‌డి రంగనాథ్ కాంగ్రెస్ 58,697 డి. కృష్ణ కుమార్ బీజేపీ 53,097 5,600
132 తుమకూరు నగరం జీబీ జ్యోతి గణేష్ బీజేపీ 60,421 ఎన్.గోవిందరాజు జేడీఎస్ 55,128 5,293
133 తుమకూరు రూరల్ డిసి గౌరీశంకర్ జేడీఎస్ 82,740 బి. సురేష్ గౌడ బీజేపీ 77,100 5,640
134 కొరటగెరె (SC) డాక్టర్ జి. పరమేశ్వర కాంగ్రెస్ 81,598 పిఆర్ సుధాకర లాల్ జేడీఎస్ 73,979 7,619
135 గుబ్బి ఎస్ఆర్ శ్రీనివాస్ జేడీఎస్ 55,572 జిఎన్ బెట్టస్వామి బీజేపీ 46,491 9,081
136 సిరా బి. సత్యనారాయణ జేడీఎస్ 74,338 టిబి జయచంద్ర కాంగ్రెస్ 63,973 10,365
137 పావగడ (SC) వెంకట రమణప్ప కాంగ్రెస్ 72,974 KM తిమ్మరాయప్ప జేడీఎస్ 72,565 409
138 మధుగిరి ఎంవీ వీరభద్రయ్య జేడీఎస్ 88,521 క్యాతసండ్ర ఎన్. రాజన్న కాంగ్రెస్ 69,947 18,574
చిక్కబళ్లాపుర జిల్లా
139 గౌరీబిదనూరు NH శివశంకర రెడ్డి కాంగ్రెస్ 69,000 సిఆర్ నరసింహమూర్తి జేడీఎస్ 59,832 9,168
140 బాగేపల్లి ఎస్ ఎన్ సుబ్బారెడ్డి కాంగ్రెస్ 65,710 జివి శ్రీరామరెడ్డి సిపిఎం 51,697 14,013
141 చిక్కబళ్లాపూర్ కె. సుధాకర్ కాంగ్రెస్ 82,006 కెపి బచ్చెగౌడ జేడీఎస్ 51,575 30,431
142 సిడ్లఘట్ట వి.మునియప్ప కాంగ్రెస్ 76,240 బిఎన్ రవికుమార్ జేడీఎస్ 66,531 9,709
143 చింతామణి జేకే కృష్ణారెడ్డి జేడీఎస్ 87,753 డాక్టర్ ఎంసీ సుధాకర్ BRP 82,513 5,240
కోలారు జిల్లా
144 శ్రీనివాసపూర్ కెఆర్ రమేష్ కుమార్ కాంగ్రెస్ 93,571 జీకే వెంకటశివారెడ్డి జేడీఎస్ 83,019 10,552
145 ముల్బాగల్ హెచ్. నగేష్ Ind 74,213 సమృద్ధి మంజునాథ్ జేడీఎస్ 67,498 6,715
146 కోలార్ గోల్డ్ ఫీల్డ్ (SC) ఎం. రూపకళ కాంగ్రెస్ 71,151 అశ్విని సంపంగి బీజేపీ 30,324 40,827
147 బంగారుపేట (SC) SN నారాయణ స్వామి కాంగ్రెస్ 71,171 ఎం. మల్లేష్ బాబు జేడీఎస్ 49,300 21,871
148 కోలార్ కె. శ్రీనివాసగౌడ్ జేడీఎస్ 82,788 సయ్యద్ జమీర్ పాషా కాంగ్రెస్ 38,537 44,251
149 మలూరు KY నంజేగౌడ కాంగ్రెస్ 75,677 కెఎస్ మంజునాథ్ గౌడ్ జేడీఎస్ 57,762 17,915
బెంగళూరు అర్బన్ జిల్లా
150 యలహంక ఎస్ఆర్ విశ్వనాథ్ బీజేపీ 120,110 ఏఎం హనుమంతెగౌడ జేడీఎస్ 77,607 42,503
151 కృష్ణరాజపురం బైరతి బసవరాజ్ కాంగ్రెస్ 135,404 NS నందీషా రెడ్డి బీజేపీ 102,675 32,729
152 బైటరాయణపుర కృష్ణ బైరే గౌడ కాంగ్రెస్ 114,964 ఎ రవి బీజేపీ 109,293 5,671
153 యశ్వంతపూర్ ST సోమశేఖర్ కాంగ్రెస్ 115,273 టీఎన్ జవరాయి గౌడ్ జేడీఎస్ 104,562 10,711
154 రాజరాజేశ్వరినగర్ మునిరత్న కాంగ్రెస్ 108,065 పి.మునిరాజుగౌడ్ బీజేపీ 82,573 25,492
155 దాసరహళ్లి ఆర్. మంజునాథ జేడీఎస్ 94,044 ఎస్.మునిరాజు బీజేపీ 83,369 10,675
156 మహాలక్ష్మి లేఅవుట్ కె. గోపాలయ్య జేడీఎస్ 88,218 ఎన్ఎల్ నరేంద్ర బాబు బీజేపీ 47,118 41,100
157 మల్లేశ్వరం డాక్టర్ సిఎన్ అశ్వత్ నారాయణ్ బీజేపీ 83,130 కెంగల్ శ్రీపాద రేణు కాంగ్రెస్ 29,130 54,000
158 హెబ్బాల్ సురేషా BS కాంగ్రెస్ 74,453 YA నారాయణస్వామి బీజేపీ 53,313 21,140
159 పులకేశినగర్ అఖండ శ్రీనివాస్ మూర్తి కాంగ్రెస్ 97,574 బి. ప్రసన్న కుమార్ జేడీఎస్ 15,948 81,626
160 సర్వజ్ఞనగర్ KJ జార్జ్ కాంగ్రెస్ 109,955 ఎంఎన్ రెడ్డి బీజేపీ 56,651 53,304
161 CV రామన్ నగర్ (SC) ఎస్. రఘు బీజేపీ 58,887 ఆర్.సంపత్ రాజ్ కాంగ్రెస్ 46,660 12,227
162 శివాజీనగర్ R. రోషన్ బేగ్ కాంగ్రెస్ 59,742 కట్టా సుబ్రహ్మణ్య నాయుడు బీజేపీ 44,702 15,040
163 శాంతి నగర్ NA హరిస్ కాంగ్రెస్ 60,009 కె. వాసుదేవమూర్తి బీజేపీ 41,804 18,205
164 గాంధీ నగర్ దినేష్ గుండు రావు కాంగ్రెస్ 47,354 ఏఆర్ సప్తగిరి గౌడ్ బీజేపీ 37,284 10,070
165 రాజాజీ నగర్ S. సురేష్ కుమార్ బీజేపీ 56,271 జి. పద్మావతి కాంగ్రెస్ 46,818 9,453
166 గోవిందరాజ్ నగర్ వి.సోమన్న బీజేపీ 79,135 ప్రియా కృష్ణ కాంగ్రెస్ 67,760 11,375
167 విజయ్ నగర్ ఎం. కృష్ణప్ప కాంగ్రెస్ 73,353 హెచ్.రవీంద్ర బీజేపీ 70,578 2,775
168 చామ్‌రాజ్‌పేట జమీర్ అహ్మద్ ఖాన్ కాంగ్రెస్ 65,339 ఎం లక్ష్మీనారాయణ బీజేపీ 32,202 33,137
169 చిక్‌పేట్ ఉదయ్ గరుడాచార్ బీజేపీ 57,312 ఆర్వీ దేవరాజ్ కాంగ్రెస్ 49,378 7,934
170 బసవనగుడి LA రవి సుబ్రహ్మణ్య బీజేపీ 76,018 కె. బాగేగౌడ జేడీఎస్ 38,009 38,009
171 పద్మనాభనగర్ ఆర్. అశోక్ బీజేపీ 77,868 వీకే గోపాల్ జేడీఎస్ 45,702 32,166
172 BTM లేఅవుట్ రామలింగ రెడ్డి కాంగ్రెస్ 67,085 లల్లేష్ రెడ్డి బీజేపీ 46,607 20,478
173 జయనగర్ సౌమ్యా రెడ్డి కాంగ్రెస్ 54,457 బిఎన్ ప్రహ్లాద్ బీజేపీ 51,568 2,889
174 మహదేవపుర (SC) అరవింద్ లింబావళి బీజేపీ 141,682 ఏసీ శ్రీనివాస కాంగ్రెస్ 123,898 17,784
175 బొమ్మనహళ్లి ఎం సతీష్ రెడ్డి బీజేపీ 111,863 సుష్మా రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ 64,701 47,162
176 బెంగళూరు సౌత్ ఎం. కృష్ణప్ప బీజేపీ 152,427 ఆర్కే రమేష్ కాంగ్రెస్ 122,068 30,359
177 అనేకల్ (SC) బి. శివన్న కాంగ్రెస్ 113,894 ఎ. నారాయణస్వామి బీజేపీ 105,267 8,627
బెంగళూరు రూరల్ జిల్లా
178 హోస్కోటే MTB నాగరాజ్ కాంగ్రెస్ 98,824 శరత్ కుమార్ బచ్చెగౌడ బీజేపీ 91,227 7,597
179 దేవనహళ్లి (SC) నారాయణస్వామి ఎల్‌ఎన్ జేడీఎస్ 86,966 వెంకటస్వామి కాంగ్రెస్ 69,956 17,010
180 దొడ్డబల్లాపూర్ టి.వెంకటరమణయ్య కాంగ్రెస్ 73,225 బి. మునగౌడ జేడీఎస్ 63,280 9,945
181 నేలమంగళ (SC) డాక్టర్ కె. శ్రీనవసమూర్తి జేడీఎస్ 69,277 ఆర్.నారాయణస్వామి కాంగ్రెస్ 44,956 24,321
రామనగర జిల్లా
182 మగాడి ఎ. మంజునాథ్ జేడీఎస్ 119,492 హెచ్ సి బాలకృష్ణ కాంగ్రెస్ 68,067 51,425
183 రామనగర హెచ్‌డి కుమారస్వామి జేడీఎస్ 92,626 HA ఇక్బాల్ హుస్సేన్ కాంగ్రెస్ 69,990 22,636
184 కనకపుర డీకే శివకుమార్ కాంగ్రెస్ 127,552 నారాయణ గౌడ జేడీఎస్ 47,643 79,909
185 చన్నపట్నం హెచ్‌డి కుమారస్వామి జేడీఎస్ 87,995 సీపీ యోగేశ్వర బీజేపీ 66,465 21,530
మాండ్య జిల్లా
186 మలవల్లి (SC) డాక్టర్ కె. అన్నదాని జేడీఎస్ 103,038 పీఎం నరేంద్రస్వామి కాంగ్రెస్ 76,278 26,760
187 మద్దూరు డిసి తమ్మన్న జేడీఎస్ 109,239 మధు జి మాదేగౌడ కాంగ్రెస్ 55,209 54,030
188 మేలుకోటే సీఎస్ పుట్టరాజు జేడీఎస్ 96,003 దర్శన్ పుట్టన్నయ్య SA 73,779 22,224
189 మండ్య ఎం. శ్రీనివాస్ జేడీఎస్ 69,421 పి.రవికుమార్ కాంగ్రెస్ 47,813 21,608
190 శ్రీరంగపట్టణ రవీంద్ర శ్రీకాంతయ్య జేడీఎస్ 101,307 ఏబీ రమేశ బండిసిద్దెగౌడ కాంగ్రెస్ 57,619 43,688
191 నాగమంగళ సురేష్ గౌడ జేడీఎస్ 112,396 ఎన్ చలువరాయ స్వామి కాంగ్రెస్ 64,729 47,667
192 కృష్ణరాజపేట నారాయణ గౌడ జేడీఎస్ 88,016 KB చంద్రశేఖర్ కాంగ్రెస్ 70,897 17,119
హాసన్ జిల్లా
193 శ్రావణబెళగొళ సిఎన్ బాలకృష్ణ జేడీఎస్ 105,516 సీఎస్ పుట్టెగౌడ కాంగ్రెస్ 52,504 53,012
194 అర్సికెరె KM శివలింగే గౌడ జేడీఎస్ 93,986 జిబి శశిధర కాంగ్రెస్ 50,297 43,689
195 బేలూరు కెఎస్ లింగేశ జేడీఎస్ 64,268 HK సురేష్ బీజేపీ 44,578 19,690
196 హసన్ ప్రీతం జె. గౌడ బీజేపీ 63,348 హెచ్ఎస్ ప్రకాష్ జేడీఎస్ 50,342 13,006
197 హోలెనరసిపూర్ హెచ్‌డి రేవణ్ణ జేడీఎస్ 108,541 బిపి మంజేగౌడ కాంగ్రెస్ 64,709 43,832
198 అర్కలగూడు AT రామస్వామి జేడీఎస్ 85,064 ఎ. మంజు కాంగ్రెస్ 74,411 10,653
199 సకలేష్‌పూర్ (SC) హెచ్‌కే కుమారస్వామి జేడీఎస్ 62,262 సోమశేఖర్ జయరాజ్ బీజేపీ 57,320 4,942
దక్షిణ కన్నడ
200 బెల్తంగడి హరీష్ పూంజా బీజేపీ 98,417 కె. వసంత బంగేరా కాంగ్రెస్ 75,443 22,974
201 మూడబిద్రి ఉమానాథ కోటియన్ బీజేపీ 87,444 అభయచంద్ర జైన్ కాంగ్రెస్ 57,645 29,799
202 మంగళూరు సిటీ నార్త్ భరత్ శెట్టి బీజేపీ 98,648 మొహియుద్దీన్ బావ కాంగ్రెస్ 72,000 26,648
203 మంగళూరు సిటీ సౌత్ డి. వేదవ్యాస్ కామత్ బీజేపీ 86,545 జాన్ రిచర్డ్ లోబో కాంగ్రెస్ 70,470 16,075
204 మంగళూరు UT ఖాదర్ కాంగ్రెస్ 80,813 సంతోష్ కుమార్ రాయ్ బోలియారు బీజేపీ 61,074 19,739
205 బంట్వాల్ యు రాజేష్ నాయక్ బీజేపీ 97,802 రామనాథ్ రాయ్ INC 81,831 15,971
206 పుత్తూరు సంజీవ మతాండూరు బీజేపీ 90,073 శకుంతల టి.శెట్టి కాంగ్రెస్ 70,596 19,477
207 సుల్లియా (SC) అంగర ఎస్. బీజేపీ 95,205 డాక్టర్ బి. రఘు కాంగ్రెస్ 69,137 26,068
కొడగు జిల్లా
208 మడికేరి అప్పచు రంజన్ బీజేపీ 70,631 బిఎ జీవిజయ జేడీఎస్ 54,616 16,015
209 విరాజపేట కెజి బోపయ్య బీజేపీ 77,944 అరుణ్ మచ్చయ్య కాంగ్రెస్ 64,591 13,353
మైసూర్ జిల్లా
210 పెరియపట్న కె. మహదేవ జేడీఎస్ 77,770 కె. వెంకటేష్ కాంగ్రెస్ 70,277 7,493
211 కృష్ణరాజనగర ఎస్ఆర్ మహేష్ జేడీఎస్ 85,011 డి రవిశంకర్ కాంగ్రెస్ 83,232 1,779
212 హున్సూర్ అడగూర్ హెచ్.విశ్వనాథ్ జేడీఎస్ 91,667 HP మంజునాథ్ కాంగ్రెస్ 83,092 8,575
213 హెగ్గడదేవన్‌కోటే (ST) అనిల్ కుమార్ సి. కాంగ్రెస్ 76,652 చిక్కన్న జేడీఎస్ 54,559 22,093
214 నంజన్‌గూడు (SC) హర్షవర్ధన్ బి. బీజేపీ 78,030 కలలే ఎన్.కేశవమూర్తి కాంగ్రెస్ 65,551 12,479
215 చాముండేశ్వరి జిటి దేవెగౌడ జేడీఎస్ 121,325 సిద్ధరామయ్య కాంగ్రెస్ 85,283 36,042
216 కృష్ణంరాజు SA రామదాస్ బీజేపీ 78,573 MK సోమశేఖర్ కాంగ్రెస్ 52,226 26,347
217 చామరాజు ఎల్.నాగేంద్ర బీజేపీ 51,683 వాసు కాంగ్రెస్ 36,747 14,936
218 నరసింహరాజు తన్వీర్ సైత్ కాంగ్రెస్ 62,268 సందేశ్ స్వామి బీజేపీ 44,141 18,127
219 వరుణుడు యతీంద్ర సిద్ధరామయ్య కాంగ్రెస్ 96,435 టి.బసవరాజు బీజేపీ 37,819 58,616
220 టి. నరసిపూర్ (SC) అశ్విన్ కుమార్ ఎం. జేడీఎస్ 83,929 డాక్టర్ హెచ్‌సి మహదేవప్ప కాంగ్రెస్ 55,451 28,478
చామరాజనగర్ జిల్లా
221 హనూర్ ఆర్. నరేంద్ర కాంగ్రెస్ 60,444 డా. ప్రీతన్ నాగప్ప బీజేపీ 56,931 3,513
222 కొల్లేగల్ (SC) ఎన్. మహేష్ BSP 71,792 AR కృష్ణ మూర్తి కాంగ్రెస్ 52,338 19,454
223 చామరాజనగర్ సి.పుట్టరంగశెట్టి కాంగ్రెస్ 75,963 KR మల్లికార్జునప్ప బీజేపీ 71,050 4,913
224 గుండ్లుపేట సీఎస్ నిరంజన్ కుమార్ బీజేపీ 94,151 గీతా మహదేవప్రసాద్ కాంగ్రెస్ 77,467 16,684

ఉప ఎన్నిక

[మార్చు]
S. No నియోజకవర్గం నెం. తేదీ నియోజకవర్గం ఎన్నికల ముందు ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పార్టీ
1 21 6-నవంబర్-2018 జమఖండి సిద్దు న్యామగౌడ కాంగ్రెస్ ఆనంద్ న్యామగౌడ INC
2 183 6-నవంబర్-2018 రామనగర హెచ్‌డి కుమారస్వామి జేడీఎస్ అనిత కుమారస్వామి జేడీఎస్
3 70 23-ఏప్రిల్-2019 కుండ్గోల్ సిఎస్ శివల్లి కాంగ్రెస్ కుసుమ శివల్లి INC
4 42 23-ఏప్రిల్-2019 చించోలి ఉమేష్ జాదవ్ కాంగ్రెస్ అవినాష్ జాదవ్ బీజేపీ
5 3 5-డిసెంబర్-2019 అథని మహేష్ కుమతల్లి కాంగ్రెస్ మహేష్ కుమతల్లి బీజేపీ
6 4 5-డిసెంబర్-2019 కాగ్వాడ్ శ్రీమంత్ పాటిల్ కాంగ్రెస్ శ్రీమంత్ పాటిల్ బీజేపీ
7 9 5-డిసెంబర్-2019 గోకాక్ రమేష్ జార్కిహోళి కాంగ్రెస్ రమేష్ జార్కిహోళి బీజేపీ
8 81 5-డిసెంబర్-2019 ఎల్లాపూర్ శివరామ్ హెబ్బార్ కాంగ్రెస్ శివరామ్ హెబ్బార్ బీజేపీ
9 86 5-డిసెంబర్-2019 హిరేకెరూరు బీసీ పాటిల్ కాంగ్రెస్ బీసీ పాటిల్ బీజేపీ
10 90 5-డిసెంబర్-2019 విజయనగరం ఆనంద్ సింగ్ కాంగ్రెస్ ఆనంద్ సింగ్ బీజేపీ
11 141 5-డిసెంబర్-2019 చిక్కబళ్లాపూర్ కె. సుధాకర్ కాంగ్రెస్ డాక్టర్ కె. సుధాకర్ బీజేపీ
12 151 5-డిసెంబర్-2019 KR పురం బైరతి బసవరాజ్ కాంగ్రెస్ బైరతి బసవరాజ్ బీజేపీ
13 153 5-డిసెంబర్-2019 యశ్వంతపుర ST సోమశేఖర్ కాంగ్రెస్ ST సోమశేఖర్ బీజేపీ
14 87 5-డిసెంబర్-2019 రాణిబెన్నూరు ఆర్. శంకర్ కాంగ్రెస్ అరుణ్‌కుమార్ గుత్తూరు బీజేపీ
15 156 5-డిసెంబర్-2019 మహాలక్ష్మి లేఅవుట్ కె. గోపాలయ్య జేడీఎస్ కె. గోపాలయ్య బీజేపీ
16 192 5-డిసెంబర్-2019 కృష్ణరాజపేట నారాయణ గౌడ జేడీఎస్ నారాయణ గౌడ బీజేపీ
17 212 5-డిసెంబర్-2019 హున్సూర్ ఏహెచ్ విశ్వనాథ్ జేడీఎస్ HP మంజునాథ్ INC
18 162 5-డిసెంబర్-2019 శివాజీనగర్ R. రోషన్ బేగ్ కాంగ్రెస్ రిజ్వాన్ అర్షద్ INC
19 178 5-డిసెంబర్-2019 హోసకోటే MTB నాగరాజ్ కాంగ్రెస్ శరత్ బచ్చెగౌడ Ind
20 136 3-నవంబర్-2020 సిరా బి సత్యనారాయణ జేడీఎస్ రాజేష్ గౌడ్ బీజేపీ
21 154 3-నవంబర్-2020 రాజరాజేశ్వరి నగర్ మునిరత్న కాంగ్రెస్ మునిరత్న బీజేపీ
22 47 17-ఏప్రిల్-2021 బసవకల్యాణ్ బి. నారాయణరావు కాంగ్రెస్ శరణు సాలగర్ బీజేపీ
23 59 17-ఏప్రిల్-2021 మాస్కీ ప్రతాపగౌడ పాటిల్ కాంగ్రెస్ బసంగౌడ తుర్విహాల్ INC
24 33 30-అక్టోబర్-2021 సిందగి మల్లప్ప మనగూళి జేడీఎస్ రమేష్ భూసనూర్ బీజేపీ
25 82 30-అక్టోబర్-2021 హంగల్ సీఎం ఉదాసి బీజేపీ శ్రీనివాస్ మానె INC

మూలాలు

[మార్చు]
 1. "Karnataka election highlights rural-urban divide: State witnesses highest voter turnout, but Bengaluru stays away" (in English). Firstpost. Retrieved 16 May 2018. The 72.13 percent voter turnout for the Karnataka Assembly elections has broken all records and is the highest recorded in the state since the 1952 polls, Chief Electoral Officer Sanjeev Kumar said on Saturday.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
 2. "Election commission's statistical report on general elections, 2013 to the legislative assembly of Karnataka" (PDF).
 3. "Picked Karnataka poll date from Times Now TV: BJP's IT cell head Amit Malviya tells EC". The New Indian Express. Retrieved 2018-04-14.
 4. "Who should get first call to form govt in Karnataka? Jury's out". The Times of India. 16 May 2018. Retrieved 16 May 2018.
 5. "Election Commission sets up panel to probe leak of Karnataka poll date". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-03-27. Retrieved 2018-04-14.
 6. "Karnataka poll date leak: EC probe panel to probe media, not Amit Malviya". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-03-29. Retrieved 2018-04-14.
 7. "Karnataka Poll Date Was Speculation, Not Leak: Election Commission Committee". NDTV.com. Retrieved 2018-04-14.
 8. http://www.thehindu.com/elections/karnataka-2018/over-9000-voter-id-cards-unearthed/article23817906.ece
 9. Poovanna, Sharan (3 November 2017). "Amit Shah launches BJP's Karnataka election campaign in Bengaluru". Mint. Retrieved 3 February 2018.
 10. "In Karnataka, PM Modi addresses crowd of 2 lakh, says 'naked dance of mafia' in Sidda regime". The Times of India. 5 February 2018. Retrieved 6 February 2018.
 11. "BJP Launches 14-Day 'Protect Bengaluru March'". ndtv.com. Press Trust of India. 2 March 2018. Archived from the original on 3 March 2018. Retrieved 3 March 2018.
 12. Poovanna, Sharan (8 December 2017). "How Karnataka Congress is trying to micromanage 2018 assembly elections". Mint. Retrieved 3 February 2018.
 13. "Karnataka Exit Poll: IndiaTV-VMR predicts fractured mandate; Congress and BJP in neck-and-neck fight". 12 May 2018.
 14. "Karnataka Elections 2018: Jan Ki Baat's Exit Poll Says The BJP Will Emerge As The Single Largest Party". 12 May 2018.
 15. "BJP close to majority in Karnataka, may get 110 seats: ABP News exit poll". 12 May 2018. Archived from the original on 15 మే 2018. Retrieved 17 మే 2018.
 16. "TIMES NOW-VMR Exit Poll prediction". 12 May 2018.
 17. "Karnataka Assembly Elections 2018 - Post Poll Analysis". 12 May 2018. Archived from the original on 15 మే 2018. Retrieved 17 మే 2018.
 18. "Assembly Election 2018 - Karnataka". 12 May 2018. Archived from the original on 17 మే 2018. Retrieved 17 మే 2018.
 19. "NewsX-CNX exit poll 2018: A hung Karnataka Assembly with BJP as the single largest party". 12 May 2018. Archived from the original on 13 మే 2018. Retrieved 17 మే 2018.
 20. "Karnataka election 2018: What exit polls can't settle, May 15 will; updates". 12 May 2018.
 21. "రేపే కర్నాటక అసెంబ్లీలో బలపరీక్ష".[permanent dead link]
 22. "అంతకు ముందు సుప్రీం కోర్టులో ఏం జరిగింది?".
 23. ವಿಶ್ವಾಸಮತ ಯಾಚಿಸದೆ ರಾಜೀನಾಮೆ ನೀಡಿದ ಯಡಿಯೂರಪ್ಪ; 19 May, 2018
 24. "కర్నాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం". Archived from the original on 2018-05-27. Retrieved 2018-06-03.
 25. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
 26. The Indian Express (14 May 2018). "Karnataka assembly election results: List of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.

బయటి లంకెలు

[మార్చు]