ఎం. కృష్ణప్ప (కర్ణాటక రాజకీయ నాయకుడు)
ఎం. కృష్ణప్ప | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2008 | |||
ముందు | నియోజకవర్గం ఏర్పాటు చేశారు | ||
---|---|---|---|
నియోజకవర్గం | బెంగుళూరు దక్షిణ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బెంగళూరు | 1962 జూన్ 1||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
ఎం. కృష్ణప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బెంగుళూరు దక్షిణ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఎం కృష్ణప్ప బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2005లో ఉత్తరహళ్లి నుండి జిల్లా పంచాయతీ సభ్యునిగా ఎన్నికై ఆ తరువాత 2008 శాసనసభ ఎన్నికలలో బెంగుళూరు దక్షిణ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎం. సదానందపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి జేడీఎస్ అభ్యర్థి ఆర్. ప్రభాకర రెడ్డిపై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
ఎం కృష్ణప్ప 2018 శాసనసభ ఎన్నికలలో బెంగుళూరు దక్షిణ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.కె. రమేష్‌పై 30,359 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా,[3] 2023 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.కె. రమేష్‌పై 49,699 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (25 April 2018). "Karnataka election 2018: 'Big margin' Krishnappa of BJP eyes a hat-trick". Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (13 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2023. Retrieved 17 November 2024.
- ↑ TV9 Kannada (13 May 2023). "Bangalore South Election Results: ಬೆಂಗಳೂರು ದಕ್ಷಿಣ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಬಿಜೆಪಿ ಅಭ್ಯರ್ಥಿ ಎಂ.ಕೃಷ್ಣಪ್ಪಗೆ ನಾಲ್ಕನೇ ಬಾರಿ ಭಾರಿ ಗೆಲುವು". Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)