హెచ్.పి. మంజునాథ్
హెచ్.పి. మంజునాథ్ | |||
పదవీ కాలం 2019 – 2023 | |||
ముందు | అడగూర్ హెచ్.విశ్వనాథ్ | ||
---|---|---|---|
తరువాత | జి.డి. హరీష్ గౌడ్ | ||
నియోజకవర్గం | హుణసూరు | ||
పదవీ కాలం 2008 – 2018 | |||
ముందు | జి.టి. దేవెగౌడ | ||
తరువాత | అడగూర్ హెచ్. విశ్వనాథ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | రత్నమ్మ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
హెచ్.పి. మంజునాథ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హుణసూరు శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]హెచ్.పి. మంజునాథ్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 శాసనసభ ఎన్నికలలో హుణసూరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి ఎస్. చిక్కమడుపై 15041 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి కుమారస్వామిపై 40207 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
హెచ్.పి. మంజునాథ్ 2018 శాసనసభ ఎన్నికలలో హుణసూరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి అడగూర్ హెచ్. విశ్వనాథ్ చేతిలో 8,575 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[1] అడగూర్ హెచ్.విశ్వనాథ్ ఆ తరువాత 2013 శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2019లో జరిగిన ఉప ఎన్నికలలో హెచ్.పి. మంజునాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి[2] తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అడగూర్ హెచ్.విశ్వనాథ్ పై 39,727 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5]
హెచ్.పి. మంజునాథ్ 2023 శాసనసభ ఎన్నికలలో హుణసూరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి జి.డి. హరీష్ గౌడ్ చేతిలో 2,411 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (1 May 2018). "Hunsur: A constituency that has risen above caste politics". Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
- ↑ The New Indian Express (13 November 2019). "Ex-Karnataka MLA HP Manjunath files papers as Congress candidate for Hunsur bypolls" (in ఇంగ్లీష్). Retrieved 28 November 2024.
- ↑ The Hindu (9 December 2019). "Congress wins battle in Hunsur" (in Indian English). Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
- ↑ Deccan Herald. "Hunsur win: Siddaramaiah's clout works only in Mysuru" (in ఇంగ్లీష్). Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
- ↑ The Hindu (9 December 2019). "Karnataka bypoll: Hunsur bucks the trend, hands out defeat to BJP" (in Indian English). Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.
- ↑ Election Commision of India (2023). "Karnataka Assembly Election result 2023: Hunasuru". Archived from the original on 28 November 2024. Retrieved 28 November 2024.