Jump to content

మురుగేష్ నిరాని

వికీపీడియా నుండి
మురుగేష్ నిరాని

భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖల మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 ఆగష్టు 2021 - 13 మే 2023
ముందు జగదీష్ శెట్టర్
పదవీ కాలం
7 జూన్ 2008 – 13 మే 2013
ముందు కట్ట సుబ్రమణ్య నాయుడు
తరువాత ఆర్. వీ. దేశ్ పాండే

గనుల శాఖ మంత్రి
పదవీ కాలం
21 జనవరి 2021 – 28 జులై 2021
ముందు సి.సి. పాటిల్
తరువాత హాలప్ప ఆచార్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018
ముందు జె.టి. పాటిల్
నియోజకవర్గం బిల్గి
పదవీ కాలం
2004 – 2013
ముందు జె.టి. పాటిల్
తరువాత జె.టి. పాటిల్
నియోజకవర్గం బిలిగి

వ్యక్తిగత వివరాలు

జననం (1965-06-01) 1965 జూన్ 1 (వయసు 59)
బిలాగి, బాగల్ కోట్ జిల్లా, మైసూర్ రాష్ట్రం, భారతదేశం (ప్రస్తుతం కర్ణాటక)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి కమల నిరాని
పూర్వ విద్యార్థి బొంబాయి యూనివర్సిటీ
వెబ్‌సైటు murugeshnirani.com, archived from the original on 2022-03-27, retrieved 2022-05-10

మురుగేష్ నిరాని కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బిలిగి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేశాడు.[1] ఆయన 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

మురుగేష్ నిరాని మైసూర్ మహారాజా, కృష్ణ రాజా వడియార్ IV యొక్క సిద్ధాంతాల నుండి ప్రేరణ పొంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరి అనంతరం బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన ఉత్తర కర్ణాటకలో బీజేపీలో సామాన్య కార్యకర్తగా పనిచేసి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిలిగి అసెంబ్లీ నియోజకవర్గం నుండి నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2008లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రిగా పనిచేసి అనంతరం 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు.

మురుగేష్ నిరాని 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో గనులు, భూగర్భ శాఖ మంత్రిగా ఆ తరువాత 2021 నుండి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  2. Sakshi (14 May 2023). "స్పీకర్‌ సహా మంత్రుల ఓటమిబాట". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  3. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.