జె.టి. పాటిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జె.టి. పాటిల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023
ముందు మురుగేష్ నిరాణి
నియోజకవర్గం బిల్గి
పదవీ కాలం
2013 – 2018
ముందు మురుగేష్ నిరాణి
తరువాత మురుగేష్ నిరాణి
నియోజకవర్గం బిల్గి
పదవీ కాలం
1994 – 2004
ముందు యల్లిగుత్తి గంగాధరప్ప గురుసిద్దప్ప
తరువాత మురుగేష్ నిరాణి
నియోజకవర్గం బిల్గి

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

జగదీష్ తిమ్మనగౌడ పాటిల్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బిల్గి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

జె.టి. పాటిల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1994 శాసనసభ ఎన్నికలలో బిల్గి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి జేడీయూ అభ్యర్థి గంగాధర్ గురుసిద్దప్ప యల్లిగుత్తిపై 11547 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 1999 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్ కులకర్ణిపై 11547 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2] 2004 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి మురుగేష్ నిరాని చేతిలో 17325 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

జె.టి. పాటిల్ 2008 ఎన్నికలలో పోటీ చేయలేదు తిరిగి 2013 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి మురుగేష్ నిరాని పై 11238 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[3] 2018 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి మురుగేష్ నిరాని చేతిలో 4811 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. జె.టి. పాటిల్ 2023 ఎన్నికలలో పోటీ చేయలేదు తిరిగి 2013 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి మురుగేష్ నిరానిపై 11,129 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Karnataka 1994". Archived from the original on 2020-03-02. Retrieved 2020-07-12.
  2. "Bilgi Assembly constituency Election Result". Archived from the original on 2020-07-02. Retrieved 2020-07-12.
  3. "Sitting and previous MLAs from Bilgi Assembly constituency". Archived from the original on 2022-02-14. Retrieved 2020-07-12.
  4. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  5. Hindustan Times (13 May 2023). "Karnataka election 2023 results: List of winners from Hassan area constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.