బసవరాజు బొమ్మై
బసవరాజు బొమ్మై | |||
![]() బసవరాజు సోమప్ప బొమ్మై | |||
20వ ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 28 జులై 2021 – 13 మే 2023 | |||
గవర్నరు | తవార్ చంద్ గెహ్లాట్ | ||
---|---|---|---|
డిప్యూటీ | ఖాళీగా
| ||
ముందు | బి.ఎస్.యడియూరప్ప | ||
రాష్ట్ర హోంమంత్రి
| |||
పదవీ కాలం 26 ఆగష్టు 2019 – 26 జులై 2021 | |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 25 మే 2008 | |||
నియోజకవర్గం | షిగ్గాన్ నియోజకవర్గం | ||
శాసనమండలి సభ్యుడు
| |||
పదవీ కాలం 1998 – 2008 | |||
నియోజకవర్గం | ధారవాడ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హుబ్లీ , మైసూరు జిల్లా, కర్ణాటక రాష్ట్రం , భారతదేశం | 1960 జనవరి 28||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2008 - ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | * జనతాదల్ | ||
తల్లిదండ్రులు | ఎస్.ఆర్.బొమ్మై గంగమ్మ | ||
జీవిత భాగస్వామి | చెన్నమ్మ | ||
నివాసం | బెంగళూరు | ||
పూర్వ విద్యార్థి | కె.ఎల్.ఈ టెక్నలాజికల్ యూనివర్సిటీ |
బసవరాజు సోమప్ప బొమ్మై కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక రాష్ట్ర 23వ ముఖ్యమంత్రిగా నియమితుడయ్యాడు.[1][2]ఆయన 28 జులై 2021న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.
జననం, విద్యాభాస్యం[మార్చు]
బసవరాజు బొమ్మై 28 జనవరి 1960న కర్ణాటక రాష్ట్రం , మైసూరు జిల్లా, హుబ్లీ లో ఎస్.ఆర్.బొమ్మై, గంగమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన కె.ఎల్.ఈ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుండి ఇంజినీరింగ్ పూర్తి చేసి కొంతకాలం టాటా గ్రూప్‌లో పని చేశాడు.
రాజకీయ జీవితం[మార్చు]
బసవరాజు బొమ్మై రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన తండ్రి ఎస్.ఆర్. బొమ్మై 13 ఆగష్టు 1988 నుండి 21 ఏప్రిల్ 1989 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశాడు. ఆయన 1998, 2004లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో హావేరి జిల్లాలోని షిగ్గాన్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి జనతాదళ్ (యూ) అభ్యర్థిగా పోటీ చేసి రెండుసార్లు ఎమ్మెల్సీగా, షిగ్గాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. బసవరాజు బొమ్మై 2008లో జనతాదళ్ (యూ) నుండి బీజేపీలో చేరాడు. ఆయన కర్ణాటక రాష్ట్ర హోం, జల వనరుల శాఖ మంత్రిగా పని చేశాడు.[3]బసవరాజు బొమ్మై 28 జులై 2021న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[4][5] 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి 13 మే 2023న రాజీనామా చేశాడు.[6]
మూలాలు[మార్చు]
- ↑ Namasthe Telangana (27 July 2021). "కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై". Archived from the original on 27 July 2021. Retrieved 27 July 2021.
- ↑ Andrajyothy (27 July 2021). "అసలెవరీ బసవరాజ్ బొమ్మై?". Archived from the original on 27 July 2021. Retrieved 27 July 2021.
- ↑ Namasthe Telangana (27 July 2021). "యెడ్డీ వారసుడిగా బస్వరాజ్ బొమ్మై.. ఇదీ ఆయన నేపథ్యం". Archived from the original on 27 July 2021. Retrieved 27 July 2021.
- ↑ TV9 Telugu (28 July 2021). "కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై ప్రమాణం స్వీకారం - Basavaraj Bommai sworn-in as the new Chief Minister of Karnataka". Archived from the original on 28 July 2021. Retrieved 28 July 2021.
- ↑ Sakshi (28 July 2021). "కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బసవరాజ్ బొమ్మై". Archived from the original on 28 July 2021. Retrieved 28 July 2021.
- ↑ Sakshi (13 May 2023). "సీఎం పదవికి బసవరాజు బొమ్మై రాజీనామా". Archived from the original on 13 May 2023. Retrieved 13 May 2023.