Jump to content

సి.సి. పాటిల్

వికీపీడియా నుండి
చంద్రకాంతగౌడ చిన్నప్పగౌడ పాటిల్
సి.సి. పాటిల్


ప్రజాపనుల శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 ఆగష్టు 2021
ముందు గోవింద్ కర్జోల్

చిన్న తరహా పరిశ్రమల శాఖ
పదవీ కాలం
21 జనవరి 2021 – 28 జులై 2021
ముందు హెచ్. నగేష్
తరువాత ఎం . టి. బి. నాగరాజ్

ఐటీ & పౌర సంభంధాల శాఖ
పదవీ కాలం
21 జనవరి 2021 – 28 జులై 2021
ముందు డీ.కే. శివ కుమార్

అటవీ & పర్యావరణ శాఖ మంత్రి
పదవీ కాలం
27 సెప్టెంబర్ 2019 – 10 ఫిబ్రవరి 2020
ముందు సతీష్ జర్కిహోళి
తరువాత ఆనంద్ సింగ్

బొగ్గు గనులు & జియాలజి శాఖ మంత్రి
పదవీ కాలం
20 ఆగష్టు 2019 – 21 జనవరి 2021
ముందు రాజశేఖర్ పాటిల్
తరువాత మురుగేష్ నిరాని

మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ
పదవీ కాలం
22 సెప్టెంబర్ 2010 – 9 ఫిబ్రవరి 2012
ముందు పి. ఎం . నరేంద్ర స్వామి
తరువాత కలకప్ప జి బండి

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018
ముందు బి ఆర్ యావగల్
నియోజకవర్గం నార్గున్డ్
పదవీ కాలం
2004 – 2013
ముందు బి ఆర్ యావగల్
తరువాత బి ఆర్ యావగల్
నియోజకవర్గం నార్గున్డ్

వ్యక్తిగత వివరాలు

జననం (1958-10-22) 1958 అక్టోబరు 22 (వయసు 66)
గడగ్ జిల్లా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం బెంగళూరు, నార్గున్డ్

చంద్రకాంతగౌడ చిన్నప్పగౌడ పాటిల్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నార్గున్డ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సి.సి. పాటిల్ బీజేపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున నరగుండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2008లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి డి.వి.సదానంద గౌడ, బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో 2010 సెప్టెంబరు 22 నుండి 2012 ఫిబ్రవరి 9 వరకు మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాడు.

సి.సి. పాటిల్ 2013లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి అనంతరం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో బొగ్గు గనులు & జియాలజి, అటవీ & పర్యావరణ, చిన్న తరహా పరిశ్రమల, ఐటీ & పౌర సంబంధాల శాఖల మంత్రిగా పనిచేసి ఆ తరువాత 2021 ఆగస్టు 4 నుండి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  2. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.