Jump to content

డి.కె. శివకుమార్

వికీపీడియా నుండి
(డీ.కే. శివ కుమార్ నుండి దారిమార్పు చెందింది)
డి. కె. శివకుమార్
2025లో శివకుమార్
18వ కర్ణాటక ముఖ్యమంత్రి
Assumed office
3 జూన్ 2026[1]
గవర్నర్థావర్ చంద్ గెహ్లాట్
Deputyజి. పరమేశ్వర
అంతకు ముందు వారుసిద్దరామయ్య
కర్ణాటక శాసనసభ సభ్యుడు
Assumed office
15 మే 2008
అంతకు ముందు వారుపి. జి. ఆర్. సింధియా
నియోజకవర్గంకనకపుర
In office
30 నవంబర్ 1989  15 మే 2008
అంతకు ముందు వారుకె. ఎల్. శివలింగేగౌడ
తరువాత వారునియోజకవర్గం రద్దు చేయబడింది
నియోజకవర్గంసాతనూరు
28వ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
In office
2 జూలై 2020  3 జూన్ 2026
ఏఐసీసీ అధ్యక్షుడు
అంతకు ముందు వారుదినేష్ గుండూరావు
తరువాత వారుబి. కె. హరిప్రసాద్
9వ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి
In office
20 మే 2023  28 మే 2026
గవర్నర్థావర్ చంద్ గెహ్లాట్
ముఖ్యమంత్రిసిద్దరామయ్య
మంత్రిత్వ శాఖలు
  • జలవనరుల శాఖ (భారీ, మధ్యతరహా నీటిపారుదల)
  • బెంగళూరు నగర అభివృద్ధి (బీబీఎంపీ, బీడీఏ, బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ, బీఎంఆర్‌డీఏ, బీఎంఆర్‌సీఎల్, జీబీఏ)
అంతకు ముందు వారు
తరువాత వారుజి. పరమేశ్వర
కర్ణాటక క్యాబినెట్ మంత్రి
In office
11 జూలై 2014  23 జూలై 2019
గవర్నర్
ముఖ్యమంత్రి
మంత్రిత్వ శాఖలు
  • జలవనరులు
  • వైద్య విద్య
  • విద్యుత్
అంతకు ముందు వారు
తరువాత వారు
  • రమేష్ జార్కిహోళి
  • ఈ. తుకారాం
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్
In office
2008–2010
అంతకు ముందు వారుపదవి ఏర్పడింది
తరువాత వారుఈశ్వర ఖండ్రే (2018)
వ్యక్తిగత వివరాలు
జననం (1962-05-15) 1962 మే 15 (వయసు: 64)
కనకపుర, మైసూర్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిఉషా శివకుమార్
సంతానం3
బంధువులుడీ.కే. సురేశ్ (తమ్ముడు)
వృత్తిరాజకీయ నాయకుడు

డీ.కే. శివ కుమార్‌ అనబడే '''దొడ్డాలహళ్లి కెంపెగౌడ శివకుమార్''' (జననం 15 మే 1962), కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మూడుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసి 2026 జూన్ నుండి 18వ కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు..[2][3][4]

శివకుమార్ 2008 నుండి కర్ణాటక శాసనసభలో కనకపుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనికి ముందు, ఆయన 1989 నుండి 2008 వరకు సాతనూరు శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

డీ.కే. శివ కుమార్‌ కర్ణాటకలోని రామనగర్‌ జిల్లా కనకపుర తాలూకా దొడ్డఆలహళ్ళి గ్రామంలో కెంపేగౌడ, గౌరమ్మ దంపతులకు 1962 మే 15న జన్మించాడు.[5][6] ఆయన వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు.[7] ఆయన ఓపెన్‌ యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.

ఆయనకు ఒక తమ్ముడు డీ.కే. సురేశ్ ఉన్నారు, ఆయన కూడా రాజకీయ నాయకుడే.[8] శివకుమార్ 1993లో ఉషను వివాహం చేసుకున్నారు, వీరికి ఇద్దరు కుమార్తెలు (ఐశ్వర్య, ఆభరణ), ఒక కుమారుడు (ఆకాష్) ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్యకు కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి. జి. సిద్ధార్థ కుమారుడు అమర్త్యతో వివాహం జరిగింది.[9]

భారతదేశంలోని అత్యంత సంపన్న రాజకీయ నాయకులలో ఆయన ఒకరు.[10]

రాజకీయ జీవితం

[మార్చు]

డీ.కే. శివ కుమార్‌ విద్యార్థి దశలోనే కాంగ్రెస్‌ పట్ల ఆకర్షితుడై రాజకీయాల్లోకి ప్రవేశించి 18వ ఏటనే కాంగ్రెస్‌ అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌యూఐలో చేరాడు. ఆయన ఉన్నత విద్యాభ్యాసం కోసం బెంగళూరుకు వచ్చి ఆర్‌సీ కళాశాలలో చేరి ఆ తరువాత ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యాడు. శివ కుమార్ 1985లో సాతనూరు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి జేడీఎస్ అభ్యర్థి దేవేగౌడపై పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 1987లో సాతనూరు నియోజకవర్గం నుంచి బెంగళూరు గ్రామీణ జిల్లా పంచాయతీ సభ్యుడిగా ఎంపికయ్యాడు.

డీ.కే. శివ కుమార్‌ 1989లో తొలిసారిగా కాంగ్రెస్‌ తరఫున సాతనూరు నియోజకవర్గం తరపున   ఎమ్మెల్యేగా ఎన్నికై ఎస్. బంగారప్ప మంత్రివర్గంలో జైళ్ల శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 1994లో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కనందున స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచాడు, ఆ తరువాత  1999లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఎస్‌ఎం కృష్ణ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.

డీ.కే. శివ కుమార్‌ 2013లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి సిద్దరామయ్య మంత్రివర్గంలో విద్యుత్‌శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తరువాత  2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ సాధ్యం కాకపోవడంతో, జేడీఎస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగా కుమారస్వామి మంత్రివర్గంలో జలవనరుల శాఖ మంత్రిగా పని చేశాడు.

2017లో గుజరాత్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికలకు కొద్ది ముందు, 42 మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర రాజకీయ పార్టీల వైపు వెళ్లకుండా నిరోధించడానికి బెంగళూరులోని తన రిసార్ట్‌కు తరలించడంలో తన పార్టీ నాయకత్వానికి సహాయం చేశారు. ఆ తర్వాత ఇది ఎన్నికల్లో అహ్మద్ పటేల్ గెలవడానికి సహాయపడింది.[11][12]

2018 ఎన్నికల తర్వాత కర్ణాటకలో భారత జాతీయ కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు.[13]

2 జూలై 2020న దినేష్ గుండూరావు తర్వాత కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా శివకుమార్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.[14]

2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత 20 మే 2023న శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.[15]

కర్ణాటక ముఖ్యమంత్రి (2026–ప్రస్తుతం)

[మార్చు]

మే 2026లో ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్దరామయ్య దిగిపోవడంతో ఆ పదవికి ప్రధాన పోటీదారుగా శివకుమార్ నిలిచారు.[16] జూన్ 3న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.[17]

నిర్వహించిన భాద్యతలు

[మార్చు]
సంవత్సరం పదవి ఇతర
1989 - 1994 ఎమ్మెల్యే
  • జైళ్ల శాఖ మంత్రి (17 అక్టోబర్ 1990 – 19 నవంబర్ 1992)
[18]
1994 - 1999 ఎమ్మెల్యే
  • పట్టణాభివృద్ధి శాఖ మంత్రి (11 అక్టోబర్ 1999 – 20 మే 2004)
[18]
1999 - 2004 ఎమ్మెల్యే
2004 - 2008 ఎమ్మెల్యే
2008 - 2013 ఎమ్మెల్యే
  • కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు ( 2008 – 2010)
2013 - 2018 ఎమ్మెల్యే [19]
2018 - 2023 ఎమ్మెల్యే
  • వైద్య విద్య & మేజర్ ఇరిగేషన్ శాఖ మంత్రి (23 మే 2018 – 23 జులై 2019)
  • కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు (2 జులై 2020[2] – ప్రస్తుతం)
2023[20] ఎమ్మెల్యే
  • కర్ణాటక ఉప ముఖ్యమంత్రి (20 మే 2023 - 3 జూన్ 2026)
  • కర్ణాటక ముఖ్యమంత్రి (3 జూన్ 2026 - ప్రస్తుతం)

ఎన్నికల్లో పోటీ

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం పార్టీ ఫలితం ఓట్లు ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ ప్రత్యర్థి ఓట్లు ఇతర
1989సాతనూర్కాంగ్రెస్ పార్టీగెలుపు44,595యూ. కే. స్వామిజనతా పార్టీ30,945[21]
1994సాతనూర్స్వతంత్రగెలుపు48,270యూ. కే. స్వామిజనతా దళ్47,702[21]
1999సాతనూర్కాంగ్రెస్ పార్టీగెలుపు56,050హెచ్. డి. కుమారస్వామిజనతా దళ్ (సెక్యూలర్)41,663[21]
2004సాతనూర్కాంగ్రెస్ పార్టీగెలుపు51,603విశ్వనాధ్ డిఎంజనతా దళ్ (సెక్యూలర్)37,675[21]
2008కనకాపురకాంగ్రెస్ పార్టీగెలుపు68,096విశ్వనాధ్ డిఎంజనతా దళ్ (సెక్యూలర్)60,917[22]
2013కనకాపురకాంగ్రెస్ పార్టీగెలుపు1,00,007పి.జి.ఆర్. సింధియాజనతా దళ్ (సెక్యూలర్)68,583[22]
2018కనకాపురకాంగ్రెస్ పార్టీగెలుపు1,27,552నారాయణ గౌడజనతా దళ్ (సెక్యూలర్)47,643[23]
2023కనకాపురకాంగ్రెస్ పార్టీగెలుపు1,42,156బి. నాగరాజుజనతా దళ్ (సెక్యూలర్)20,561[24]

మూలాలు

[మార్చు]
  1. Gautam, Sagay RajRahul (2026-05-29). "DK Shivakumar to take oath as Karnataka Chief Minister on June 3". India Today (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-05-30.
  2. 1 2 "కీలక బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్‌". Sakshi. 2 July 2020. the original నుండి 15 April 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 April 2022. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "కీలక బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్‌" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. "సింధియా రాజీనామాతో మేలుకున్న కాంగ్రెస్‌". Sakshi. 11 March 2020. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 April 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. "అధిష్ఠానానికే ఆపద్బంధువు". Eenadu. 14 May 2023. the original నుండి 14 May 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 May 2023.
  5. "Shivakumar's father passes away". The Hindu (in Indian English). 2014-01-01. ISSN 0971-751X. ఒరిజినల్ నుండి 3 January 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-03-07.
  6. Swamy, Rohini (August 4, 2017). "DK Shivakumar: The man called tiger of Sathanur". India Today (in ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 20 September 2019 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-03-07.
  7. "D K Shivakumar: Congress's trusted Vokkaliga strategist-strongman". Hindustan Times (in ఇంగ్లీష్). 2017-08-02. ఒరిజినల్ నుండి 1 September 2019 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-09-01.
  8. "DK Shivakumar likely to be Karnataka Congress chief". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-02-16. ఒరిజినల్ నుండి 20 February 2020 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-03-07.
  9. "VVIPs from Delhi to land in Bengaluru for wedding of DK Shivakumar's daughter- the New Indian Express". ఒరిజినల్ నుండి 2 March 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 March 2021.
  10. "D.K.Shivakumar Assets". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 October 2023.
  11. "DK Shivakumar: The man who saved Congress". Bangalore Mirror. ఒరిజినల్ నుండి 16 July 2018 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-07-16.
  12. "DK Shivakumar: The man who checkmated Amit Shah in Karnataka". The News Minute. 2018-05-20. ఒరిజినల్ నుండి 3 September 2019 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-07-16.
  13. "Cong's D K Shivakumar man of the match". The Times of India. ఒరిజినల్ నుండి 25 February 2020 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-07-16.
  14. "D K Shivakumar takes charge as KPCC president". The Hindu. 2020-07-02. ఒరిజినల్ నుండి 2 August 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-07-02.
  15. Desk, India Today News (2023-05-18). "Karnataka: Shivakumar accepts formula, says 'more responsibility on me now'". India Today (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-05-30. {{cite web}}: |last= has generic name (help)
  16. Nair, Preetha Nair; Chauhan, Bala; Bijapur, Naushad; Hirehalli, Devaraj B. (27 May 2026). "Karnataka power tussle: Siddaramaiah agrees to quit". The New Indian Express (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 June 2026.
  17. "Sun rises on DKS era in Karnataka: Shivakumar takes oath as Chief Minister". Deccan Herald (in ఇంగ్లీష్). 3 June 2026. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 June 2026.
  18. 1 2 "Meet DK Shivakumar, Congress' Last 'Resort' for Tricky Trust Votes". News18. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 August 2018.
  19. "Shiva Kumar and Roshan Baig sworn-in as ministers in Karnataka cabinet" (in ఇంగ్లీష్). 2014. the original నుండి 15 April 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 April 2022.
  20. Eenadu (13 May 2023). "కనకపురాలో శివకుమార్‌ విజయం". the original నుండి 13 May 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 May 2023.
  21. 1 2 3 4 "Sathanur Assembly Constituency Election Result". resultuniversity.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 Oct 2021.
  22. 1 2 "Kanakapura (Karnataka) Assembly Constituency Elections". elections.in. the original నుండి 28 అక్టోబరు 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 Oct 2021.
  23. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). the original నుండి 4 January 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 January 2023.
  24. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). the original నుండి 14 May 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 May 2023.