కేశవ్ ప్రసాద్ మౌర్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేశవ్ ప్రసాద్ మౌర్య
కేశవ్ ప్రసాద్ మౌర్య


ఉప ముఖ్యమంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
19 మార్చి 2017
ముందు నరైన్ సింగ్

రాష్ట్ర మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 మార్చి 2017

శాసనమండలి సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 సెప్టెంబర్ 2017
నియోజకవర్గం ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు
పదవీ కాలం
8 ఏప్రిల్ 2016 – 31 ఆగష్టు 2017
తరువాత మహేంద్రనాథ్ పాండే

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
26 మే 2014 – 21 సెప్టెంబర్ 2017
ముందు కపిల్ ముని కర్వారియా
తరువాత నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్
నియోజకవర్గం ఫుల్పూర్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2012 – 2014
ముందు వాచస్పతి
తరువాత వాచస్పతి
నియోజకవర్గం సిరతు

వ్యక్తిగత వివరాలు

జననం (1969-05-07) 1969 మే 7 (వయసు 54)[1]
సిరతు, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి రాజకుమార్‌ మౌర్య
సంతానం ఇద్దరు కుమారులు
నివాసం అలహాబాదు , ఉత్తర ప్రదేశ్, భారతదేశం
వృత్తి వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు

కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా పనిచేశాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, కౌశంబి జిల్లా, సిరాథు గ్రామంలో 1969 మే 7న జన్మించాడు. ఆయన బిఎ వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఆరెస్సెస్, బజరంగ్‌దళ్‌లో సభ్యునిగా, గో సంరక్షణ, రామజన్మభూమి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని అనంతరం భారతీయ జనతా పార్టీతో తన రాజకీయ జీవితం ప్రారంభించాడు. ఆయన 2002లో తొలిసారిగా బాందా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ ఓడిపోయాడు, ఆయనకు ఆ ఎన్నికల్లో కేవలం 204 ఓట్లు వచ్చాయి. మౌర్య 2007లో రెండోసారి అలహాబాద్‌ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి బీఎస్పీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు.

కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య 2012లో సిరాథు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్పీ అభ్యర్థి ఆనంద్‌ మోహన్‌పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఫుల్పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 3 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికై పోలయిన ఓట్లలో 52 శాతం ఓట్లు సాధించి రికార్డ్‌ సృష్టించాడు.

కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య 2016లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడై, 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికల నాయకత్వ బాధ్యతలను పూర్తిగా తనపై వేసుకొని ఏకంగా 200 ర్యాలీలు చేపట్టి బీజేపీ పార్టీకి 312 సీట్లు రావడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఎన్నికల ఫలితాల తరువాత యూపీ సీఎం పదవి ఆయనకే దక్కుతుందని అందరూ భావించారు, కానీ యోగి ఆదిత్యనాథ్ తెరపైకి రావడంతో ఆయనకు ఉప ముఖ్యమంత్రితో పాటు పీడబ్ల్యూడీ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[2]

కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య 2022 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సిరతు నియోకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అప్నా దళ్ కెమెరావాడి అభ్యర్థి డాక్టర్ పల్లవి పటేల్ చేతిలో 7337 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Lok Sabha (2017). "Keshav Prasad Maurya". Archived from the original on 15 March 2022. Retrieved 15 March 2022.
  2. Sakshi (3 February 2022). "కీలక నేత మౌర్య.. ఈయన కూడా చాయ్‌వాలానే!". Archived from the original on 15 March 2022. Retrieved 15 March 2022.
  3. Andhra Jyothy (11 March 2022). "ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం సహా 11మంది మంత్రుల ఘోర పరాజయం". Archived from the original on 15 March 2022. Retrieved 15 March 2022.