Jump to content

మల్లు భట్టివిక్రమార్క

వికీపీడియా నుండి
మల్లు భట్టివిక్రమార్క
మల్లు భట్టివిక్రమార్క

తెలంగాణ రాష్ట్ర శాసన సభ ప్రతిపక్ష నాయకుడు


తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి & ఆర్ధిక, విద్యుత్ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023 డిసెంబర్ 7 నుండి ప్రస్తుతం
ముందు కడియం శ్రీహరి

పదవీ కాలం
18 జనవరి 2019 – 6 జూన్ 2019
ముందు కె. జానారెడ్డి, భారత జాతీయ కాంగ్రెస్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - ప్రస్తుతం
ముందు కట్టా వెంకట నర్సయ్య
నియోజకవర్గం మధిర

డిప్యూటి స్పీకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2011 – 2014
తరువాత మండలి బుద్ధ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2009 – 2014
నియోజకవర్గం మధిర

వ్యక్తిగత వివరాలు

జననం (1961-06-15) 1961 జూన్ 15 (వయసు 63)
స్నానాల లక్ష్మీపురం, వైరా మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు అఖిలాండ, మాణిక్యమ్మ
జీవిత భాగస్వామి నందిని
బంధువులు మల్లు అనంత రాములు, మల్లు రవి (సోదరులు)[1]
సంతానం సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య

మల్లు భట్టివిక్రమార్క తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మధిర నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2023 డిసెంబరు 7 నుండి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా,  ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[2][3]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

మల్లు భట్టివిక్రమార్క 1961, జూన్ 15న మల్లు అఖిలాండ, మాణిక్యమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, వైరా మండలం, స్నానాల లక్ష్మీపురం గ్రామంలో జన్మించాడు.[4] ఈయన అన్న మల్లు అనంత రాములు నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం మాజీ పార్లమెంటు సభ్యుడు కాగా,[5] మరో అన్న మల్లు రవి మాజీ పార్లమెంటు సభ్యుడు. విక్రమార్క హైదరాబాదులోని కళాశాల నుండి గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు.[6]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

విక్రమార్కకు నందీనితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య) ఉన్నారు.

రాజకీయ విశేషాలు

[మార్చు]

భట్టి విక్రమార్క భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2007 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009లో మధిర నియోజకవర్గం నుండి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై చీఫ్ విప్‌గా పనిచేశాడు.[7][8] భట్టి విక్రమార్క 2011 జూన్ 04 నుండి 2014 మే 20 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశాడు.[9] 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీనుండి పోటీచేసి సమీప సి. పి. యం పార్టీ అభ్యర్థి లింగాల కమల్​ రాజు పై 12,329 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[10] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 3567 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన రెండో వ్యక్తిగా విక్రమార్క నిలిచాడు. 2019 జనవరి 18న తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా నియామకమయ్యాడు.[11][12]

భట్టి విక్రమార్క 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మధిర నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, డిసెంబరు 7న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా,  ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[13] ఆయనను 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో డిసెంబరు 18న సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గల ఇన్‌చార్జ్‌గా నియమించారు.[14]

పదవులు

[మార్చు]
  • డైరెక్టర్, ఆంధ్రాబ్యాంక్
  • పిసిసి కార్యనిర్వాహక సభ్యుడు (1990–92)
  • పిసిసి కార్యదర్శి (2000–2003)
  • శాసనమండలి సభ్యుడు (2007 -2009)
  • ప్రభుత్వ చీఫ్ విప్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ (2009 - 03.06.2011)
  • డిప్యూటీ స్పీకర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ (04.06.2011 - 20.05.2014)
  • తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు (2019 జనవరి 20 - 2023)[15]

పాదయాత్ర

[మార్చు]

మల్లు భట్టి విక్రమార్క 2023 మార్చి 16న ఆదిలాబాద్​ జిల్లాలోని బోథ్ నుంచి ‘పీపుల్స్​ మార్చ్’​ పాదయాత్ర ప్రారంభించి రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,360 కిలో మీటర్లు పూర్తి చేసి పాదయాత్రకు గుర్తుగా ఖమ్మం రూరల్​ మండలంలోని తల్లంపాడు దగ్గర పైలాన్ ను ఆవిష్కరించి ముగింపు సందర్భంగా ఖమ్మంలో 2023 జూలై 2న రాహుల్‌ గాంధీ ముఖ్యఅతిధిగా జన గర్జన సభను నిర్వహించాడు.[16]

మూలాలు

[మార్చు]
  1. V6 Velugu (8 December 2023). "తెలంగాణ మంత్రుల ప్రొఫైల్స్". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Andhrajyothy (8 December 2023). "ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు". Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.
  3. Eenadu (8 December 2023). "అమాత్య యోగం.. సాగాలి అభివృద్ధి యాగం". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. "Home". Bhatti Vikramarka Mallu. 20 December 2017. Archived from the original on 18 September 2019. Retrieved 18 September 2019.
  5. Lokasabha, 9th Lok Sabha. "Members Bioprofile". www.loksabhaph.nic.in. Retrieved 28 June 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]
  6. Eenadu (10 December 2023). "ఆ ఇద్దరు మంత్రులూ హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులే". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
  7. "Bhatti Vikramarka to be Cong chief whip". The Times of India. 2009-06-05. Archived from the original on 2012-11-04. Retrieved 2016-12-01.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-07-30. Retrieved 2021-10-29.
  9. "No-trust move falls flat | Deccan Chronicle". Archived from the original on 2011-06-08. Retrieved 2011-06-05.
  10. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  11. hmtvlive, తాజా వార్తలు (18 January 2019). "సీఎల్పీ నేతగా మల్లు భట్టివిక్రమార్క". www.hmtvlive.com. Archived from the original on 18 September 2019. Retrieved 18 September 2019.
  12. TV9 Telugu (2 November 2023). "బలమైన దళిత నేత.. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు.. భట్టి విక్రమార్క రాజకీయ ప్రస్థానమిదే." Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  13. Namaste Telangana (8 December 2023). "12 మందితో కాంగ్రెస్‌ క్యాబినెట్‌". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  14. Eenadu (18 December 2023). "తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిల నియామకం". Archived from the original on 18 December 2023. Retrieved 18 December 2023.
  15. Eenadu (7 December 2023). "విధేయతకు పెద్దపీట". Archived from the original on 18 January 2024. Retrieved 18 January 2024.
  16. Sakshi (1 July 2023). "ముగిసిన భట్టి పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర.. కాంగ్రెస్‌లో సరికొత్త జోష్‌". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.