లింగాల కమల్​ రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లింగాల కమల్​ రాజు

ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
7 ఆగష్టు 2019 - ప్రస్తుతం
నియోజకవర్గం మధిర

వ్యక్తిగత వివరాలు

జననం 15 జూన్ 1971
కోస్టల గ్రామం, వైరా మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
నివాసం మధిర , ఖమ్మం
వృత్తి రాజకీయ నాయకుడు

లింగాల కమల్​రాజు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పని చేస్తున్నాడు.[1][2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

లింగాల కమల్​ రాజు 15 జూన్ 1971లో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, వైరా మండలం, కోస్టల గ్రామంలో జ్ఞానయ్య & కరుణమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన వైరా లోని జిల్లా పరిషత్ పాఠశాలో 1985లో పదవ తరగతి పూర్తి చేశాడు. కమల్​ రాజు 1987 నుండి 1989 వరకు వైరా లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, 1989 నుండి 1992వరకు ఖమ్మం లోని ఎస్ఆర్ & బి.జి.ఎన్.ఆర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆయన 1994లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి పిజి పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

లింగాల కమల్​రాజు 1987-1992 వరకు సిపిఐ అనుబంధ విద్యార్థి సంఘం ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా సభ్యుడిగా పని చేశాడు. ఆయన 1995లో సిపిఎం లో చేరి, 1995 నుండి 2000 వరకు వైరా ఎంపీపీగా ఎన్నికయ్యాడు. ఆయన 1997 నుండి 2000 వరకు డెమోక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ (డీవైఎఫ్ఐ) ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2004 నుండి 2004 వరకు డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా భాద్యతలు నిర్వహించాడు. లింగాల కమల్​రాజు 2009 & 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం తరపున మధిర నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2015లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు.కమల్ రాజు 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఖమ్మం స్థానిక సంస్థల స్థానం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.[3] కమల్​రాజు 2016లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లో చేరి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున మధిర నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. ఆయన 2019లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో మధిర జెడ్పిటిసి గా గెలిచి, ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Sakshi (7 June 2019). "'కుర్చీ' కమల్‌కే..!". Sakshi. Archived from the original on 14 June 2021. Retrieved 14 June 2021.
  2. The Hans India (12 June 2019). "Zilla Parishad chief meets CM K Chandrashekar Rao in Khammam". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 14 June 2021. Retrieved 14 June 2021.
  3. Sakshi (7 December 2015). "ఖమ్మం స్థానిక ఎమ్మెల్సీ బరిలో వైఎస్ఆర్ సీపీ". Sakshi. Archived from the original on 16 June 2021. Retrieved 16 June 2021.
  4. The Hans India (7 August 2019). "Kamal Raju, Kanakaiah take charge as Khammam, Kothagudem ZP chiefs". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2021. Retrieved 16 June 2021.