వైరా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వైరా
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటములో వైరా మండలం యొక్క స్థానము
ఖమ్మం జిల్లా పటములో వైరా మండలం యొక్క స్థానము
వైరా is located in Telangana
వైరా
తెలంగాణ పటములో వైరా యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°07′N 80°13′E / 17.11°N 80.21°E / 17.11; 80.21
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రము వైరా
గ్రామాలు 21
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 54,320
 - పురుషులు 26,793
 - స్త్రీలు 27,527
అక్షరాస్యత (2011)
 - మొత్తం 60.59%
 - పురుషులు 70.20%
 - స్త్రీలు 50.73%
పిన్ కోడ్ 507165

వైరా, తెలంగాణ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు పట్టణం.[1]. పిన్ కోడ్ నం.507165. యస్.టీ.డీ.కోడ్.08749.

ఇది ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మధిర , జగయ్యపేట పట్టణాలకు కూడలిగా ఉన్నది. కనుక చుట్టుప్రక్కల ప్రాంతాలకు కేంద్రంగా ఉన్నది.

జన విస్తరణ[మార్చు]

జనాభా (2011) - మొత్తం 54,320 - పురుషులు 26,793 - స్త్రీలు 27,527

2001 జనగణన ప్రకారం వైరా జనాభా షుమారు 51,205. ఇందులో మగవారు 25,984 ఆడువారు 25,221. అక్షరాస్యత 60.59%; మగవారిలో అక్షరాస్యత 70.20% మరియు ఆడువారిలో అక్షరాస్యత 50.73%.

ఆలయాలు[మార్చు]

వైరాలో అయ్యప్ప మందిరం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఖమ్మం నుండి వైరా వచ్చు దారిలో ఉన్నది. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి అందాలమధ్య నెలకొని భక్తులకు కావలసినంత మానసికానందాన్నిస్తోంది. వివిధ దేవతల ఆలయాలతో నెలకొని ఉన్న ఈ ఆలయ దర్శనం సర్వ శ్రేయోదాయకంగా భక్తులు భావిస్తారు.

ఇంకా పాత బస్ స్టాండు వద్ద రామాలయం ఉంది. మధు విద్యాలయం వద్ద సాయిబాబా గుడి ఉంది.శివాలాయం ఉంది.

వైరా జలాశయం[మార్చు]

వైరా చెరువు అనునది వైరా నది నుండి వచ్చినది. ఈ చెరువు నందు 19 బావులువున్నవి. దీనిని నిజాం నవాబు 1929లో తవ్వించెను. దీని ద్వారా చుట్టుప్రక్కల 8 మండలాలకు త్రాగు నీరు, సుమారు ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి ఛెందుతుంది. ఇక్కడ బోటు షికారు, గెస్ట్ హౌస్, పిల్లలు ఆడుకునే స్థలం మొదలగునవి ఉన్నాయి. చేపల పెంపకం కూడా జరుగుతున్నది.ఇది ఒక మన్ఛి ప్రదెషము.

విద్యా సంస్థలు[మార్చు]

 • KVCM డిగ్రీ కాలేజి
 • మధు విద్యాలయం, జూనియర్ కాలేజి
 • టాగోర్ విద్యాలయం
 • ప్రభుత్వ ఉన్నత పాఠశాల
 • క్రాంతి జూనియర్ కాలేజి

బ్యాంకులు[మార్చు]

 1. స్టేట్ బ్యాంక్ అఫ్ హైదరాబాద్.
 2. నాగార్జున గ్రామీణ బ్యాంక్.
 3. ఆంధ్రాబ్యాంక్.
 4. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ( పెట్రోల్ బంక్ సమీపం లో ).

వ్యవసాయం[మార్చు]

వ్యవసాయం కుడా ఒక ప్రదాన వృత్తి , వైరా చెరువు వల్ల ఇక్కడ ఛాపల వాళ్ళు (జాలర్లు) కూడా ఉన్నారు.
జాలర్ల నివసించే వీధిని ఫిషరీష్ కాలని అని అంటారు ... ఇది చెరువు పక్కనె ఉంటంది.

రవాణా సొకర్యాలు[మార్చు]

 ఇక్కడ నుంచి సరాసరి బస్సులు ఎక్కడికి లేవు.
ఖమ్మం కు : జిల్లా కేంద్రం అయిన ఖమ్మం కు సర్వీసు ఆటొలు ఉంటాయి , మదిర నుంఛి ఆర్డినరి , ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి.
హైదరాబాద్ కు : మధిర నుంచి బస్సులు కలవు ఇంకా సత్తుపల్లి , బద్రాఛలం , కొత్తగూడెం , పాల్వంఛ ,తిరువూరు డిపొలకు సంబంధింఛిన బస్సులు అందుబాటులొ ఉన్నాయి.
సత్తుపల్లి వైపు : సత్తుపల్లి కి చెందిన డిపొబస్సులే తప్ప సరాసరి సర్వీసులు అందుబాటులేవు.
మధిర వైపు : మధిర డిపొ బస్సులు అందుబాటులొ ఉన్నాయి.
భద్రాఛలం వైపు : కొత్తగూడెం , మణుగూరు ,పాల్వంఛ డిపొ బస్సులు ఉంటాయి.
   ఇక్కడ బస్ స్టేషలొ ఒక రిజవేషన్ కవుంటరు ఉంది , దానిని రాజు అనే వ్యక్తి నడుపుతూ ఉంటాడు.

శాసనసభ నియోజకవర్గం[మార్చు]

వైరా రోడ్డు దృశ్యం
వైరా మండల పరిషత్తు కార్యాలయం

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వైరా&oldid=1794875" నుండి వెలికితీశారు