మల్లు అనంత రాములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మల్లు అనంత రాములు
A.R.Mallu.jpg
ఎంపీ 7వ లోక్‌సభ నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం
In office
18 జనవరి 1980 – 31 డిసెంబరు 1984
అంతకు ముందు వారుఎం. భీష్మ దేవ్
తరువాత వారువి. తులసిరామ్
ఎంపీ 9వ లోక్‌సభ నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం
In office
2 డిసెంబరు 1989 – 7 ఫిబ్రవరి 1990
అంతకు ముందు వారువి. తులసిరామ్
తరువాత వారుమల్లు రవి
వ్యక్తిగత వివరాలు
జననంజనవరి 2, 1943
లక్ష్మీపురం, వైరా మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ, భారతదేశం
మరణంఫిబ్రవరి 7, 1990
పౌరసత్వంభారతీయుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్

మల్లు అనంత రాములు (జనవరి 2, 1943 - ఫిబ్రవరి 7, 1990) తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం ఎంపీగా ప్రాతినిధ్యం వహించాడు.[2]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

అనంత రాములు 1943, జనవరి 2న అఖిలాండ దాసు, మాణిక్యమ్మ దంపతులకు ఖమ్మం జిల్లా, వైరా మండలం, లక్ష్మీపురం గ్రామంలో జన్మించాడు. అనంత రాములు, ఆ కుటుంబానికి పెద్ద కుమారుడు. మల్లు రవి, మల్లు భట్టివిక్రమార్క ఇతని సోదరులు. పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పూర్తిచేసి, 1962లో గ్రామ అభివృద్ధి అధికారిగా చేరాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

1959లో జానకితో అనంత రాములు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు.[3]

రాజకీయ ప్రస్థానం[మార్చు]

గ్రామ అభివృద్ధి ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ ఉద్యోగుల సమస్వయ కమిటీకి చైర్మన్‌గా 16 సంవత్సరాలపాటు పనిచేశాడు. 1978లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 1980, 1989లలో మహబూబ్ నగర్ జిల్లా, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. మంత్రిగా కూడా పనిచేశాడు. పార్లమెంటు సభ్యునిగా, తన నియోజకవర్గంలోని వివిధ సమస్యలపై సకాలంలో స్పందిస్తూ నిజమైన ప్రజా ప్రతినిధిగా నిరూపించుకున్నాడు. ఇందిరా గాంధీ పార్లమెంటరీ కమిటీలో ప్రతినిధిగా ఉంటూ రెండుసార్లు విదేశాలకు పంపబడ్డాడు. 1986లో రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా ఎంపికయ్యాడు. అఖిల భారత కాంగ్రేస్ కమిటికి జాయింట్ సెక్రటరీగా నామినేట్ అవ్వడంతోపాటు 1989లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. పిసిసి మాజీ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.[4]

మరణం[మార్చు]

అనంత రాములు 1990, ఫిబ్రవరి 7న గుండెపోటుతో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. "YSR's trusted lieutenant named Chief Whip". The Hindu. 5 June 2009. Archived from the original on 8 జూన్ 2009. Retrieved 27 June 2020.
  2. "Combined List of Members". Parliament of India. Archived from the original on 27 జూన్ 2013. Retrieved 27 జూన్ 2020.
  3. Lokasabha, 9th Lok Sabha. "Members Bioprofile". www.loksabhaph.nic.in. Retrieved 28 June 2020.[permanent dead link]
  4. ఆంధ్రప్రభ, ఖమ్మం (29 June 2019). "కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రమేష్ మృతి". www.prabhanews.com. Archived from the original on 28 June 2020. Retrieved 28 June 2020.