భారత ఉప ప్రధాన మంత్రి
భారత దేశంలో ఉప ప్రధానమంత్రి గురించి రాజ్యాంగము లో ఎలాంటి వ్యాఖ్యలేదు. సాధారణంగా ఉప ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలిలో ముఖ్యమైన శాఖను కల్గి ఉంటాడు. ఇది రాజ్యాంగ హోదా కానందున ఉప ప్రధానమంత్రికి ఎలాంటి ప్రత్యేక అధికారాలు ఉండవు. ప్రధానమంత్రి ఇచ్చిన శాఖను, అధికారాలనే నిర్వర్తించాల్సి ఉంటుంది.అయిననూ ఇంతవరకు ఉప ప్రధానిగా వ్యవహరించిన వారు మంత్రిమండలిలో కీలకమైన హోంశాఖ, ఆర్థిక శాఖ లాంటి పదవులను నిర్వహించారు. ప్రధానమంత్రి స్వయంగా సమానులలో కెల్లా ప్రథముడిగా భావించి ఉప ప్రధానమంత్రికి సముచితమైన పదవిని అప్పగిస్తాడు. పార్టీలో ప్రధాని పదవికి పోటీ దారైన అభ్యర్థి కాని, సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతిస్తున ప్రధాన పార్టీ అభ్యర్తిని కాని, పదవిని ఇవ్వనిచో పార్టీలో సంక్షోభం సృష్టించే అవకాశం ఉన్న అభ్యర్థిని కాని, బలమైన ఆభ్యర్థికి అనివార్య కారణాల వల్ల ప్రధాని పదవి దక్కని సందర్భాల్లో సాధారణంగా ఈ పదవి అప్పగించడం జర్గుతుంది. తప్పని సరిగా కేంద్ర మంత్రివర్గంలో ఉండాలనే నియమం లేనందువల్ల ఉప్పటి వరకు వివిధ సందర్భాల్లో కేవలం 7 గురు మాత్రమే ఈ పదవిని అధిష్టించారు. వారిలో తొలి వ్యక్తి సర్దార్ వల్లభభాయి పటేల్ కాగా చివరి వ్యక్తి లాల్ కృష్ణ అద్వానీ. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఈ పదవి ఎవరికీ కేటాయించలేదు.
భారత దేశపు ఉప ప్రధానమంత్రులు[మార్చు]
- సర్దార్ వల్లభభాయి పటేల్ (1947 ఆగస్టు 15 నుంచి 1950 డిసెంబర్ 15 వరకు)
- మురార్జీ దేశాయ్ (1967 మార్చి 21 నుంచి 1969 డిసెంబర్ 6 వరకు)
- చరణ్ సింగ్ (1979 జూలై 28 నుంచి 1979 అక్టోబర్ 28 వరకు)
- జగ్జీవన్ రాం (1979 అక్టోబర్ 9 నుంచి 1979 డిసెంబర్ 10 వరకు)
- యశ్వంత్రావ్ చవాన్ (1979 డిసెంబర్ 10 నుంచి 1980 జనవరి 14 వరకు)
- దేవీలాల్ (1989 అక్టోబర్ 19 నుంచి 1991 జూన్ 21 వరకు)
- లాల్ కృష్ణ అద్వానీ (2002 జూన్ 29 నుంచి 2004 మే 20 వరకు)