దేవీలాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Chaudhari Devi Lal
దేవీలాల్

Chaudhary Devi Lal (1914–2001)


పదవీ కాలం
2 December 1989 – 21 June 1991
ప్రధాన మంత్రి Vishwanath Pratap Singh
Chandra Shekhar Singh
ముందు Yashwantrao Chavan
తరువాత Lal Krishna Advani

పదవీ కాలం
17 July 1987 – 2 December 1989
గవర్నరు Muzaffar Husain Burney
Hara Anand Barari
ముందు Bansi Lal
తరువాత ఓం ప్రకాశ్ చౌతాలా
పదవీ కాలం
21 June 1977 – 28 June 1979
గవర్నరు Jaisukh Lal Hathi
Harcharan Singh Brar
ముందు Banarsi Das Gupta
తరువాత Bhajan Lal

వ్యక్తిగత వివరాలు

జననం (1914-09-25)1914 సెప్టెంబరు 25
Sirsa, British Raj (now భారత దేశము)
మరణం 2001 ఏప్రిల్ 6(2001-04-06) (వయసు 86)
New Delhi
రాజకీయ పార్టీ Indian National Lok Dal (1987–2001)
ఇతర రాజకీయ పార్టీలు Indian National Congress (Before 1971)
Independent (1971–1977)
Janata Party (1977–1987)

1914 సెప్టెంబర్‌ 25 వ తేదీన హర్యానా లోని సిర్సాలా జిల్లా తేజఖేరాలో జన్మించిన చౌదరీ దేవీలాల్ (Chaudhari Devi Lal) (Hindi: चौधरी देवी लाल)భారత దేశపు రాజకీయవేత్త. స్వాతంత్ర్య సంగ్రామంలో కూడా ప్రముఖ పాత్ర వహించాడు. తావుగా ఉత్తర భారతీయులందరికీ చిరపరిచితుడైన దేవీలాల్హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి గా, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్‌ మంత్రివర్గాల్లో ఉప ప్రధానమంత్రిగా పదవులు నిర్వహించాడు.[1]. దేశ రాజకీయాలలో కురువృద్ధుడిగా పేరు సంపాదించిందిన దేవీలాల్ 86 ఏళ్ళ వయస్స్సులో రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ 2001 ఏప్రిల్ 6 న మరణించాడు. అతని కుమారుడు ఓం ప్రకాష్ చౌతాలా హర్యానా ముఖ్యమంత్రి.

స్వాతంత్ర్యోద్యమ నేతగా[మార్చు]

దేవీలాల్ మహాత్మా గాంధీ అనుచరుడిగా స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా చురుగ్గా పాలుపంచుకున్నాడు. 1938లో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ డెలిగేట్స్ గా ఎన్నికయ్యాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటీష్ ప్రభుత్వం చే అరెస్ట్ అక్టోబర్ 5, 1942 న అయి దాదాపు రెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు.

స్వాతంత్ర్యం అనంతరం[మార్చు]

భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత దేవీలాల్ వ్యవసాయ రంగానికి మంచి చేయూతనిచ్చాడు.హర్యానా రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశాడు. 1958లో ఇతడు హర్యానా లోని సిర్సా నియోజక వర్గం నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికైనాడు. అంతకు పూర్వమే 1952లో పంజాబ్ శాసనసభకు ఎన్నికయ్యడు. 1971లో కాంగ్రెస్ పార్టీని వదలిపెట్టి, 1974లో రోరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్పై పోటీ చేసి గెల్చాడు. 1975లో ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి ఫలితంగా అనేక ప్రతిపక్ష నేతలతో పాటు దేవీలాల్ కూడా దాదాపు 19 మాసాలు జైల్లో గడిపాడు. 1977లో ఎమర్జెన్సీ ఎత్తివేసి ఎన్నికలు జర్పినప్పుడు ఇతను జనతా పార్టీ టెకెట్టు పై గెల్చి హర్యానా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. అంతేకాకుండా ఇతడు షేర్-ఇ-హర్యానా (హర్యానా సింహం) గా ప్రసిద్ధి చెందినాడు. 1980 నుంచి 1982 వరకు పార్లమెంటు సభ్యుడిగాను, 1982 నుంచి 1987 వరకు రాష్ట్ర శాసన సభ్యుడిగాను వ్యవహరించాడు. 1987 శాసన సభ ఎన్నికలలో కొత్తగా స్థాపించిన లోక్‌దళ్ మంచి ఫలితాలను సాధించింది. 90 కి గాను 85 స్థానాలు సాధించి కామ్గ్రెస్ ను 5 స్థానాలకే పరిమితం చేసి రికార్డు సృష్టించాడు. దాంతో రెండో సారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాడు. 1989 పార్లమెంటరీ ఎన్నికలలో రాజస్థాన్ లోనిసికార్ లోనూ, హర్యానా లోని రోటక్ లోనూ పోటీ చేసి రెండు చోట్లా విజయం సాధించాడు. కేంద్రంలో రెండు ప్రభుత్వాలలో ఉప ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. 1998లో చివరి సారిగా రాజ్యసభకు ఎన్నికయ్యాడు.

గ్రామీణ, వ్యవసాయ రంగానికి సేవ[మార్చు]

దేవీలాల్ అధికార పదువులు నిర్వహిస్తున్నప్పుడు గ్రామీణ రంగానికి ముఖ్యంగా వ్యవసాయరంగానికి అధిక శ్రద్ధ ఇచ్చేవాడు. దాని ఫలితంగా రైతులచే తావు [Tau (Elder Uncle)]గా పిలిపించుకున్నాడు. అతని సమాధి పేరు కూడా కిసాన్ ఘాట్ కావడం గమనార్హం. యమున నది తీరాన ఉన్న కిసాన్ ఘాట్ వద్ద మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్ సమాధి కూడా ఉంది.

గుర్తింపులు[మార్చు]

  • అతను చేసిన సేవలకు గుర్తింపుగా చండీగర్లో పంచకుల లోని క్రికెట్ స్టేడియానికి దేవీలాల్ క్రికెట్ స్టేడియంగా పేరు పెట్టారు.

బయటి లింకులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://thatstelugu.oneindia.in/news/2001/4/7/devi[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=దేవీలాల్&oldid=3866222" నుండి వెలికితీశారు