Jump to content

ఓం ప్రకాశ్ చౌతాలా

వికీపీడియా నుండి
ఓం ప్రకాశ్ చౌతాలా
ఓం ప్రకాశ్ చౌతాలా


పదవీ కాలం
24 జులై 1999 – 5 మార్చి 2005
ముందు బన్సీ లాల్
తరువాత భూపిందర్ సింగ్ హూడా
పదవీ కాలం
22 మార్చి 1991 – 6 ఏప్రిల్ 1991
ముందు హుకమ్ సింగ్
తరువాత రాష్ట్రపతి పాలన
పదవీ కాలం
12 జులై 1990 – 17 జులై 1990
ముందు బనారసీ దాస్ గుప్తా
తరువాత హుకమ్ సింగ్
పదవీ కాలం
2 డిసెంబర్ 1989 – 22 మే 1990
ముందు దేవీలాల్
తరువాత బనారసీ దాస్ గుప్తా

వ్యక్తిగత వివరాలు

జననం (1935-01-01) 1935 జనవరి 1 (వయసు 89)
చౌతాలా, పంజాబ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్
జీవిత భాగస్వామి స్నేహ లత చౌతాలా
సంతానం అజయ్ సింగ్ చౌతాలా, అభయ్ సింగ్ చౌతాలా సహా 5
నివాసం సిర్సా జిల్లా, హర్యానా
వృత్తి వ్యవసాయదారుడు
వృత్తి రాజకీయ నాయకుడు

ఓం ప్రకాశ్ చౌతాలా (జననం:1935 జనవరి 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను భారత 6వ ఉప ప్రధాని చౌదరి దేవి లాల్ కుమారుడు. ఓం ప్రకాశ్ చౌతాలా చౌతాలా ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 1995 నుంచి 2005 వరకు నాలుగు పర్యాయాలు హర్యానా ముఖ్యమంత్రిగా పని చేశాడు.

ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు

[మార్చు]

హర్యానాలో 2000 సంవత్సరంలో 3,206 మంది జూనియర్ ఉపాధ్యాయులను అక్రమంగా నియమించిన కేసులో చౌతాలా, అతను కుమారుడు అజయ్ చౌతాలా, ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్ సహా 53 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో అతనిని 2013లో అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించింది.

2021లో కరోనాను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ ప్రభుత్వం జైళ్లలో రద్దీని తగ్గించేందుకు పదేళ్ల జైలు శిక్షలో కనీసం తొమ్మిదిన్నర సంవత్సరాల శిక్షా కాలం పూర్తి చేసిన వారికి 6నెలలు మినహాయింపును ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో అతనికి ఆరు నెలల మినహాయింపు లభించి జైలు నుంచి విడుదలయ్యాడు.[1]

అక్ర‌మాస్తుల కేసు

[మార్చు]

హ‌ర్యానా మాజీ సీఎం ఓం ప్ర‌కాశ్ చౌతాలా 1993 నుంచి 2006 మ‌ధ్య ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని నిర్ధారణ కావడంతో ఢిల్లీకి చెందిన సీబీఐ కోర్టు అతనికి 2002 మే 27న నాలుగేళ్ల జైలుశిక్ష‌తో పాటు 50 ల‌క్ష‌ల జ‌రిమానా కూడా విధించింది.[2]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (2 July 2021). "తీహార్‌ జైలు నుంచి ఓం ప్రకాశ్‌ చౌతాలా విడుదల". Archived from the original on 7 September 2022. Retrieved 7 September 2022.
  2. Andhra Jyothy (22 May 2022). "ఓం ప్రకాశ్‌ చౌతాలా దోషి" (in ఇంగ్లీష్). Archived from the original on 7 September 2022. Retrieved 7 September 2022.