జగదీష్ దేవదా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగదీష్ దేవదా
జగదీష్ దేవదా


మధ్య ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి
పదవీ కాలం
13 డిసెంబర్ 2023 – ప్రస్తుతం
గవర్నరు మంగూభాయ్ సి. పటేల్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
3 డిసెంబర్ 2023
నియోజకవర్గం మల్హర్‌ఘర్

వ్యక్తిగత వివరాలు

జననం (1957-07-01) 1957 జూలై 1 (వయసు 66)
రాంపుర గ్రామం, నీమచ్ జిల్లా, మధ్యప్రదేశ్‌
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

జగదీష్ దేవదా మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను మల్హర్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై 2023 డిసెంబరు 13న మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

జగదీష్ దేవదా 1979లో బీజేపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ యువమోర్చా, బీజేపీ యువజన విభాగం, భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) మండల అధ్యక్షుడు, మందసౌర్ జిల్లాలో జిల్లా అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శితో లాంటి పదవులు నిర్వహించి 1990లో తొలిసారి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి సువాసర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1993లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

జగదీష్ దేవదా 2003లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా హోం, పాఠశాల విద్య, ఇంధన శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన ఆ తరువాత మల్హర్‌ఘర్ నియోజకవర్గం నుండి 2008 నుండి 2023 వరకు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. జగదీష్ దేవదా  2020 మార్చి 24 నుండి జూలై 2 వరకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా, శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో 2 జూలై 2020 నుండి 2023  వరకు  ఆర్థిక మంత్రిగా పనిచేశాడు.[2] ఆయన 2023లో ఎన్నికల్లో గెలిచి[3], 2023 డిసెంబరు 13న మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[4][5]

మూలాలు[మార్చు]

  1. The Indian Express (13 December 2023). "Madhya Pradesh, Chhattisgarh CM Swearing-in Ceremony Live Updates: Mohan Yadav takes oath as MP CM in presence of PM Modi" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  2. The Times of India (1 March 2023). "Finance minister Jagdish Devda to present Madhya pradesh budget today". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  3. The Times of India (4 December 2023). "Madhya Pradesh Assembly Elections Results 2023: Check full and final list of winners here". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  4. The Week (12 December 2023). "Who are Rajendra Shukla and Jagdish Devda, Madhya Pradesh's new deputy CMs?" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  5. The Indian Express (13 December 2023). "Meet the two new deputy CMs in MP: Jagdish Devda and Rajendra Shukla, who rose up the BJP ranks" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.