అరుణ్ సావో
అరుణ్ సావో (జననం 1968 నవంబరు 25) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకు[1], ఆ తరువాత 2023లో శాసనసభ ఎన్నికల్లో లోర్మి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2023 డిసెంబరు 13న ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]అరుణ్ సావో ముంగేలిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, బిలాస్‌పూర్‌లోని కేఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్ర పట్టా అందుకున్నాడు. ఆయన 2001లో హైకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టి, 2004లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి, 2005 నుండి 2013 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్యానెల్ లాయర్‌గా, 2013 నుండి 2018 వరకు ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు డిప్యూటీ అడ్వకేట్ జనరల్‌గా పనిచేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]అరుణ్ సావో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కి వాలంటీర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 1990 నుండి 1995 వరకు ABVP ముంగేలి యూనిట్‌కు అధ్యక్షుడిగా, బూత్ స్థాయి కార్యకర్తగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర సహ కార్యదర్శిగా, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేశాడు. అరుణ్ సావో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిలాస్‌పూర్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అటల్ శ్రీవాస్తవ్ పై 141763 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 2023లో జరిగిన ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో లోర్మి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై[3], 2023 డిసెంబరు 13న ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ India Today (13 December 2023). "Vishnu Deo Sai sworn in as Chhattisgarh Chief Minister, PM Modi present" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
- ↑ బీబీసీ News తెలుగు (3 December 2023). "ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-2023 - BBC News తెలుగు". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
- ↑ The Indian Express (14 December 2023). "Meet BJP's new Chhattisgarh Deputy CMs: Sahu OBC leader Arun Sao, Hindutva face Vijay Sharma" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.