2022 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2022 ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. తొలి దశ ఎన్నికలు ఫిబ్రవరి 10న, చివరగా ఏడో దశ పోలింగ్ మార్చి 7న జరిగాయి. మార్చి 10న జరిగిన కౌంటింగ్‌లో 255 స్థానాల్లో బీజేపీ, 18 స్థానాల్లో మిత్రపక్షాలు గెలిచాయి. సమాజ్‌వాదీ పార్టీ 111 సీట్లు, దాని మిత్రపక్షాలు 14 సీట్లు గెలిచాయి.

షెడ్యూల్[మార్చు]

2022 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను 2022 జనవరి 8న కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.[1]

Map of constituencies and their phases
షెడ్యూల్ దశ
తొలి దశ రెండో దశ మూడో దశ నాలుగో దశ ఐదో దశ ఆరో దశ ఏడో దశ
నోటిఫికేషన్ తేదీ 14 జనవరి 2022 21 జనవరి 2022 25 జనవరి 2022 27 జనవరి 2022 1 ఫిబ్రవరి 2022 4 ఫిబ్రవరి 2022 10 ఫిబ్రవరి 2022
నామినేషన్ చివరి తేదీ 21 జనవరి 2022 28 జనవరి 2022 1 ఫిబ్రవరి 2022 3 ఫిబ్రవరి 2022 8 ఫిబ్రవరి 2022 11 ఫిబ్రవరి 2022 17 ఫిబ్రవరి 2022
నామినేషన్ పరిశీలన 24 జనవరి 2022 29 జనవరి 2022 2 ఫిబ్రవరి 2022 4 ఫిబ్రవరి 2022 9 ఫిబ్రవరి 2022 14 ఫిబ్రవరి 2022 18 ఫిబ్రవరి 2022
నామినేషన్ విత్‌డ్రా 27 జనవరి 2022 31 జనవరి 2022 4 ఫిబ్రవరి 2022 7 ఫిబ్రవరి 2022 11 ఫిబ్రవరి 2022 16 ఫిబ్రవరి 2022 22 ఫిబ్రవరి 2022
ఎన్నిక తేదీ 10 ఫిబ్రవరి 2022 14 ఫిబ్రవరి 2022 20 ఫిబ్రవరి 2022 23 ఫిబ్రవరి 2022 27 ఫిబ్రవరి 2022 3 మార్చి 2022 7 మార్చి 2022
ఎన్నికల ఫలితాలు లెక్కింపు 10 మార్చి 2022

పార్టీల మేనిఫెస్టో[మార్చు]

బీజేపీ మేనిఫెస్టోలో ప్రధాన హామీలు[మార్చు]

  • సాగునీటి కోసం రైతులకు ఉచిత విద్యుత్
  • గోధుమ, వరి పంటకు కనీస మద్దతు ధర[2]
  • స్వామి వివేకానంద యువ సశక్తికరణ్‌ యోజన కింద 2 కోట్ల ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు ఉచితంగా పంపిణీ
  • ఏటా హోళీ, దీపావళి పండుగ రోజుల్లో ఒక్కో సిలిండర్ చొప్పున ఫ్రీగా అందజేత
  • 60 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రజా రవాణాలో ఉచిత ప్రయాణం
  • కాలేజీకి వెళ్లే యువతులకు ఉచితంగా స్కూటీలు
  • పట్టణ పేదలకు తక్కువ ధరకు ఆహారం 'మా అన్నపూర్ణ క్యాంటీన్'ల ఏర్పాటు
  • వితంతు పెన్షన్ 1,500 రూపాయలకు పెంపు
  • లవ్ జీహాద్ కేసుల్లో దోషులుగా తేలితే పదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
  • రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు చేయడం
  • రాష్ట్రంలోకి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం
  • 15 రోజుల్లోనే చెరుకు పంట బకాయిలు చెల్లింపు
  • కన్యా సుమంగళ యోజన పథకం కింద అందించే ఆర్థిక సాయాన్ని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంపు
  • కొత్తగా ఆరు మెగా ఫుడ్ పార్కుల ఏర్పాటు[3][4]

సమాజ్‌వాదీ పార్టీ మేనిఫెస్టోలో ప్రధాన హామీలు[మార్చు]

  • 15 రోజుల్లో చెరుకు రైతులకు పరిహారం అందజేత
  • రైతు పోరాటాల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం
  • ద్విచక్ర వాహనదారులందరికీ ప్రతి నెలా ఒక లీటర్ ఉచిత పెట్రోల్‌[5]
  • ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
  • 12వ తరగతి బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులైన బాలికలకు రూ. 36,000 ఒకేసారి చెల్లించే ‘కన్యా విద్యా ధన్' పథకంతో పాటు పాటు ప్రాథమిక తరగతుల నుంచి పీ.జి వరకు బాలికలకు ఉచిత విద్య
  • దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మహిళలు, కుటుంబాలకు ప్రతి సంవత్సరం రూ. 18,000 రూపాయల[6]
  • 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు
  • ఏడాదిలో అన్ని గ్రామాలు, పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
  • ప్రతి జిల్లాలో మోడల్ స్కూల్స్ నిర్మాణం[7]

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రధాన హామీలు[మార్చు]

  • 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు[8]
  • వరి, గోధుమలను క్వింటాల్‌కు రూ.2500, చెరకు క్వింటాల్‌కు రూ.400 చొప్పున కొనుగోలు
  • ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేజీ మొదలు పీజీ వరకు ఉచిత విద్య
  • ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు
  • కోల్ సామాజిక వర్గానికి ఎస్టీ మోదా కల్పన
  • పాఠశాలల్లో వంటవారికి నెలసరి జీతం రూ.5,000కు పెంపు
  • విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కోవిడ్ వారియర్స్‌కు రూ.50లక్షల పరిహారం
  • కోవిడ్‌ బాధిత కుటుంబాలకు రూ.25వేల ఆర్థిక సాయం
  • అనుభవం, నిబంధనల మేరకు కాంట్రాక్ట్ టీచర్ల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ
  • చిన్న తరహా పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు[9]
  • బాలికలకు ద్విచక్ర వాహనం, స్మార్ట్ ఫోన్
  • మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు, మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా

బహుజన్ సమాజ్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయలేదు[మార్చు]

ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ మేనిఫెస్టో లేకుండా ప్రజల ముందుకు వెళ్లింది.[10]

గెలిచిన అభ్యర్థులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sakshi (8 January 2022). "ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. నోటిఫికేషన్‌ విడుదల". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  2. Andhra Jyothy (8 February 2022). "యూపీలో బీజేపీ ఎన్నికల హామీలివే..." Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  3. Eenadu (8 February 2022). "యూపీలో 'ఉచితాల' వర్షం కురిపించిన భాజపా." Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  4. TV5 News (9 February 2022). "ఉత్తరప్రదేశ్‌లో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో" (in ఇంగ్లీష్). Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  5. TV5 News (8 February 2022). "అధికారంలోకి వస్తే నెలకి లీటర్ పెట్రోల్ ఫ్రీ...!" (in ఇంగ్లీష్). Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  6. Dishadaily (దిశ) (8 February 2022). "సమాజ్ వాదీ పార్టీ మేనిఫెస్టో.. గెలిపిస్తే కోటి ఉద్యోగాలు!". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  7. News18 Telugu (8 February 2022). "రైతులకు రుణమాఫీ, మహిళలకు ఫించన్లు, 300 యూనిట్ల ఉచిత్ విద్యుత్.. యూపీలో ఎస్పీ హామీలు.. పూర్తి వివరాలు". Retrieved 28 February 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  8. TV9 Telugu (9 February 2022). "20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.. యూపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  9. TV9 Telugu, TV9 (10 February 2022). "వ్యవసాయ రుణాల మాఫీ, మహిళలకు 40శాతం ఉద్యోగాలు.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  10. Hindustan Times (23 November 2021). "BSP to not release manifesto this time" (in ఇంగ్లీష్). Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.