సలోన కుష్వాహ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సలోన కుష్వాహ
లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యురాలు, 18వ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ
Assumed office
2022 మార్చి 25
నియోజకవర్గంతిల్హార్ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1974-01-01) 1974 జనవరి 1 (వయసు 50)
నిగోహి, షాజహాన్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయతభారతీయురాలు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిడా. రామ్ సింగ్ కుష్వాహ
సంతానంసృష్టి కుష్వాహ
సూర్యంష్ విక్రమ్ సింగ్
కళాశాల
  • మహాత్మా జ్యోతిబా ఫూలే రోహిల్‌ఖండ్ విశ్వవిద్యాలయం (మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్)
నైపుణ్యం
  • రాజకీయ నాయకురాలు

సలోనా కుష్వాహ (ఆంగ్లం: Salona Kushwaha; జననం 1974 జనవరి 1) భారతీయ రాజకీయవేత్త. ఆమె ఉత్తరప్రదేశ్ పద్దెనిమిదవ శాసనసభ సభ్యురాలు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఆమె ఉత్తరప్రదేశ్‌లోని తిల్హార్ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది.[1][2]

2022 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో షాజహాన్‌పూర్ జిల్లా తిల్హార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆమె మొదటిసారిగా పోటీచేసి ఎన్నికైన సభ్యురాలు.[3] ఆ ఎన్నికల్లో నలుగురు ఫిరాయింపుదారుల స్థానాల్లో, స్వామి ప్రసాద్ మౌర్యతో పాటు సిట్టింగ్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రోషన్ లాల్ వర్మ సమాజ్ వాదీ పార్టీకి వెళ్లడంతో సలోనా కుష్వాహను తిల్హార్ నుంచి పోటీకి దింపింది బీజేపీ.[4] ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని తిల్హార్ శాసనసభ నియోజకవర్గం, షాజహాన్‌పూర్ జిల్లాలోని షాజహాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

వ్యక్తిగత జీవితం[మార్చు]

సలోనా కుష్వాహా నిగోహి, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్ పట్టణంలో 1974 జనవరి 1న జన్మించింది. ఆమె తండ్రి రీత్రమ్ సింగ్ కుష్వాహ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యవసాయదారుడు.

ఆమె మహాత్మా జ్యోతిబా ఫూలే రోహిల్‌ఖండ్ విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. పట్టభద్రురాలైంది. ఆమె ప్రఖ్యాత న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రామ్ సింగ్ కుష్వాహాను 1997 మార్చి 7న వివాహం చేసుకుంది. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు సంతానం.

ఎన్నికల కమిషన్‌లో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, సలోనా కుష్వాహా అలోక్ ఫార్మాస్యూటికల్స్ లో మేనేజర్ గా వ్యవహరిస్తోంది.

సామాజిక సేవ[మార్చు]

తిల్హార్ నియోజకవర్గంలోని జహాన్‌పూర్‌ గ్రామం లో మహిళా పాలిటెక్నిక్ కళాశాలను ఎమ్మెల్యే హోదాలో సలోనా కుష్వాహా ప్రారంభించింది. ఆ తరువాత, స్థానిక బాలికల స్వచ్ఛమైన తాగునీటి డిమాండ్‌పై స్పందించిన ఆమె తాగునీటి సదుపాయం కోసం వాటర్ ట్యాంక్ నిర్మించి, 2022 సెప్టెంబరు 14న ప్రారంభించింది. అలాగే, బాలికలు రవాణ సదుపాయం కోసం ఉద్యమం చేపడితే ఆమె షాజహాన్‌పూర్ నుండి జహాన్‌పూర్ లోని పాలిటెక్నిక్ కళాశాల వరకు ఎలక్ట్రిక్ బస్సు సర్వీస్ ను అందించింది.

నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైయ్యే ఆమె నగర పంచాయతీ నిగోహికి వీధి దీపాలు, స్కై లిఫ్ట్ మెషీన్‌ను కూడా అందించి ప్రజలకు సౌకర్యం కలిగించింది.

దాతృత్వం[మార్చు]

ఎమ్మెల్యే సలోనా కుష్వాహ దాతృత్వానికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. గుడిసెలో మంటలు అంటుకుని చెలరేగుతున్నక్రమంలో అక్కడి నుంచి వెళ్తున్న ఆమె బాడీ గార్డులు అందులో నివసిస్తున్న కుటుంబాన్ని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ఆమె బాధిత కుటుంబాన్ని ఆదుకుంటానవి భరోసా కల్పించి ఓదార్చింది. ఆమె దాతృత్వంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ ఘటన తిల్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిర్సింగ్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.[5]

వివాదం[మార్చు]

కోర్టు ఆదేశాలను అనుసరించి, కుటుంబ రిజిస్టర్‌ను ట్యాంపరింగ్ చేసిన కేసులో నిగోహి పోలీస్ స్టేషన్‌లో ఆమె, ఆమె అనుచరులపై కేసు నమోదైంది. దివంగత, మాజీ ఎమ్మెల్యే రోషన్‌లాల్ వర్మ కుమారుడు. వినోద్ వర్మ భార్య రుచి వర్మ పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యే, గుమస్తా సహకారంతో కుటుంబ రిజిస్టర్‌ను తారుమారు చేసినట్లు రుచి వర్మ తెలిపింది.[6]

ఈ విషయంలో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా ఎక్కడా వినిపించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించిన రుచి వర్మ 2022 అక్టోబరు 20న, అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అస్మా సుల్తానా, దరఖాస్తును స్వీకరించి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిగోహి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జిని ఆదేశించింది. అదేరోజు రాత్రి, నిగోహి పోలీస్ స్టేషన్‌లో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యురాలు సలోనా కుష్వాహా, అంధ్‌ఖేడా నివాసి సరితా యాదవ్, నిగోహి, క్లర్క్ డానిష్ ఖాన్ తదితరులపై నిగోహి పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్ 218, 120 బి కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. అయితే, ఇదంతా రాజకీయ కుట్రలో భాగమని, పోలీసుల విచారణలో నిజం బయటపడనుందని, తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె ప్రకటించింది.

మూలాలు[మార్చు]

  1. "salona-kushwaha in Uttar Pradesh Assembly Elections 2022". News18 (in ఇంగ్లీష్). Retrieved 2022-03-21.
  2. "Salona Kushwaha Election Results 2022: News, Votes, Results of Uttar-pradesh Assembly". NDTV.com (in ఇంగ్లీష్). Retrieved 2022-03-21.
  3. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. "Bjp: In 4th UP list, BJP keeps focus on OBCs, Dalits, shows faith in sitting MLAs | India News - Times of India". web.archive.org. 2024-02-09. Archived from the original on 2024-02-09. Retrieved 2024-02-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "BJP MLA Salona Kushwaha stopped her car after Seeing fire in hut she saved a family | झोपड़ी में लगी आग देख BJP MLA ने रोका अपना काफिला, बॉडी गार्ड्स और सहयोगियों की मदद से पूरे परिवार को बचाया | Hindi News, Uttar Pradesh". web.archive.org. 2024-02-09. Archived from the original on 2024-02-09. Retrieved 2024-02-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "Friends In Family Register... Fir On Mla Salona Kushwaha - Shahjahanpur News - परिवार रजिस्टर में हेराफेरी...विधायक सलोना कुशवाहा पर एफआईआर". web.archive.org. 2024-02-09. Archived from the original on 2024-02-09. Retrieved 2024-02-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)