1957లో ఉత్తరప్రదేశ్ రెండవ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. 1951 నాటి ఎన్నికల కంటే మెజారిటీ తగ్గినప్పటికీ, భారత జాతీయ కాంగ్రెస్ 430 విధానసభ స్థానాల్లో 286 స్థానాలతో ఆధిక్యాన్ని సాధించింది.
ఎన్నికలు 1957 ఫిబ్రవరి 25 న జరిగాయి. అసెంబ్లీలోని 430 నియోజకవర్గాలకు 1711 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీటిలో 89 ద్విసభ్య నియోజకవర్గాలు, 252 ఏకసభ్య నియోజకవర్గాలు ఉన్నాయి.
సంపూర్ణానంద్ ఉత్తరప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి. అతను తన పార్టీకి చెందిన గోవింద్ బల్లభ్ పంత్ తర్వాత 1954 నుండి 1960 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1960లో, కమలాపతి త్రిపాఠి, చంద్ర భాను గుప్తా మొదలెట్టిన రాజకీయ సంక్షోభం కారణంగా, సంపూర్ణానంద ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. అతన్ని రాజస్థాన్కుగవర్నర్గా పంపించారు.[1][2] ఉత్తరప్రదేశ్ రెండవ శాసనసభలో ముఖ్యమైన సభ్యులు క్రిందివారు. [3][4][5]