హఫీజ్ మహమ్మద్ ఇబ్రహీం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హఫీజ్ మహమ్మద్ ఇబ్రహీం (1889-1968) భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. ఆయన 1965లో భారతదేశంలోని పంజాబ్‌కు గవర్నర్‌గా పనిచేశాడు. ఆయన 1958 నుండి 1962 వరకు రాజ్యసభ సభ్యుడు, కేంద్ర విద్యుత్, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన ఫిబ్రవరి 1961 నుండి ఆగస్టు 1963 వరకు రాజ్యసభ సభానాయకుడిగా వ్యవహరించాడు.[1] ఆయన యునైటెడ్ ప్రావిన్సెస్ (1937-50) కమ్యూనికేషన్, నీటిపారుదల మంత్రిగా పనిచేశాడు.[2]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆయనను 1967లో భారతప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

1888లో నగీనాలోని మొహల్లా ఖాజీ సరాయ్ 1 లో జన్మించిన ఆయన రాజ్‌కియా దీక్షా విద్యాలయలో చదువుకున్నాడు. ఉన్నత చదువుల కోసం అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఆయన చేరాడు.

ఆయన కుమారుడు అతికుర్ రెహ్మాన్ ఉత్తరప్రదేశ్ 4వ, 5వ శాసనసభకు నాగినా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మార్చి 1967 నుండి మార్చి 1974 వరకు ప్రాతినిధ్యం వహించాడు.

ఆయన మరో కుమారుడు అజీజుర్ రెహమాన్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అలాగే ఆయన నాలుగుసార్లు రాష్ట్రంలో మంత్రిగా మార్చి 1974 నుంచి నవంబరు 1989 వరకు ఉన్నాడు.

మరణం[మార్చు]

హఫీజ్ మహమ్మద్ ఇబ్రహీం 1968 జనవరి 24న వైద్య చికిత్స పొందుతూ మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. "Rajya Sabha Members" (PDF). Archived from the original (PDF) on 2019-03-28. Retrieved 2023-05-16.
  2. "How Uttar Pradesh got its name". Hindustan Times. 5 February 2018. Retrieved 26 April 2021.