2018 కర్నాటక శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు, 2018
భారతదేశం
2013 ←
12 మే 2018 (222 సీట్లు)
28 మే 2018 (2 సీట్లు)

→ 2023

కర్నాటక అసెంబ్లీలో 224 సీట్లకు 222
మెజారిటీ కొరకు 113 సీట్లు అవసరం
పోలింగ్ 72.13%[1]
  మెజారిటీ పార్టీ మైనారిటీ పార్టీ ఇతర పార్టీ
  Yeddyurappa (cropped).jpg Siddaramaiah1.jpg Kumaraswamy.jpg
నాయకుడు బి.ఎస్.యడ్యూరప్ప సిద్ధరామయ్య హెచ్. డి. కుమారస్వామి
పార్టీ బి.జె.పి INC JD(S)
నాయకుని నియోజకవర్గం శికారిపుర అసెంబ్లీ నియోజకవర్గం (గెలుపు) 1. బాదామి(తెలుపు)
2. చాముండేశ్వరి (ఓటమి)
1. రామనగర (గెలుపు)
2. చన్నపట్న (గెలుపు)
ప్రస్తుత సీట్లు 40 122 40
గెలిచిన సీట్లు 104 78 37
మార్పు Increase64 Decrease44 Decrease3
జనాదరణ పొందిన ఓట్లు 13,185,384 13,824,005 6,666,307
ఓట్ల శాతం 36.2% 38% 18.3%
ఊగిసలాట Increase16.3% Increase1.4% Decrease1.9%

Wahlkreise zur Vidhan Sabha von Karnataka.svg

కర్నాటక అసెంబ్లీ నియోజకవర్గాలు

ఎన్నికల ముందు
ముఖ్యమంత్రి

సిద్ధరామయ్య
కాంగ్రెస్

ఎన్నికల తరువాత
ముఖ్యమంత్రి

హెచ్. డి. కుమారస్వామి
JD(S)

కర్ణాటక రాష్ట్రంలో 2018 మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 224 స్థానాలకు జరగవలసిన ఎన్నికలలో 222 అసెంబ్లీ స్థానాలకుమాత్రెమే ఈ ఎన్నికలు జరిగినవి. మిగిలిన రెండు స్థానాలైన విజయనగర శాసనసభ నియోజకవర్గం లో ఎం.ఎల్.ఎ మరణం వల్ల, రాజరాజేశ్వరి నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఎన్నికల మోసం అభియోగం వల్ల ఎన్నికలు వాయిదా వేయబడినవి. ఈ స్థానాలలో 2018 మే 28 న ఎన్నికలు జరుగుతాయి.[2] భారతీయ జనతా పార్టీ 2007 లో, 2008 నుండి 2013 వరకు ప్రభుత్వం ఏర్పాటుచేసింది. బహుజన్ సమాజ్ పార్టీ, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలు కూటమి కలసి పోటీ చేసింది. ఆమ్‌ఆదమీ పార్టీ మొదటి సారి ఈ రాష్ట్రంలో పోటీ చేసింది.[3]

ఈ ఎన్నికల ఫలితాలలో వివిధ పార్టీలకు లభించిన సీట్ల ఆధారంగా హంగ్ అసెంబ్లీకి దారితీసింది. 104 సీట్లతో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు సంపాదించింది. కానీ ప్రభుత్వానికి సరిపడే మెజారిటీ (113) ను సాధించలేకపోయింది.[4] 2013 లో ఎన్నికలు జరిగినప్పటి నుంచి రాష్ట్రాన్ని పాలించిన భారత జాతీయ కాంగ్రెస్ కు 78 సీట్లు వచ్చాయి. అది ఏ పార్టీకి సరిపడే మెజారిటీ లేనందున ఉప ఎన్నిక కావాలని కోరింది.

నేపధ్యం[మార్చు]

కర్నాటక అసెంబ్లీ కాలం 2018 మే 28 నాటికి ముగుస్తుంది.[5]

ఎన్నికల షెడ్యూల్[మార్చు]

భారత ఎన్నికల కమిషన్ చే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ 2018 మార్చి 27 న ప్రకటించబడింది. ఒకే దశలో ఎన్నికల పోలింగును మే 12 న జరిపి, మే 15నాటికి ఫలితాలు ప్రకంటించాలని అందులో ఉంది.[6] ఈ ప్రకటన వెలువడిన నాటి నుండి ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులోనికి వచ్చింది.[7][8]

విషయం తేదీ వారం
నామినేషన్ల తేదీ 17 ఏప్రిల్ 2018 మంగళవారం
నామినేషన్ల చివరితేదీ 24 ఏప్రిల్ 2018 మంగళవారం
నామినేషన్ల పరిశీలన 25 ఏప్రిల్ 2018 బుధవారం
నామినేషన్ల ఉపసంహరణ 27 ఏప్రిల్ 2018 శుక్రవారం
ఎన్నికల తేదీ 12 మే 2018 శనివారం
ఎన్నికల కౌంటింగ్ 15 మే 2018 మంగళవారం
ఎన్నికల ప్రక్రియ పూర్తవడానికి తేదీ 31 మే 2018 గురువారం

ఎన్నికల ప్రచారం[మార్చు]

భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని 2017, నవంబరు 2 న ప్రారంభించింది.[9] ఈ పార్టీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో 85 రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహించి 2018 ఫిబ్రవరి 4 తో ముగించింది. ఈ ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా పాల్గొన్నాడు.[10] మార్చి మొదటి వారంలో 14 రోజుల బెంగళూరు పాదయాత్రను చేసింది.[11]

ఎన్నికల ప్రచారంలో భాగం కాకపోయినా కర్ణాటక కాంగ్రెస్ కమిటీ డిసెబరు 2017 న కర్నాటక రాష్ట్రంలో 54,261 చోట్ల బూత్ స్థాయి కమిటీలను వేసి ప్రభుత్వ కార్యకలాపాలను వివిధ కార్యక్రమాల ద్వారా అందరికీ తెలియజేయాలని నిర్ణయించింది. ఈ విస్తృతమైన కార్యక్రమంతో పాటు ఎన్నికల ప్రచారం కూడా జరిగింది.[12]

ఎగ్జిట్ పోల్స్[మార్చు]

వివిధ సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ లో భారతీయ జనతాపార్టీ అధికారంలోనికి వస్తుందని ఒక సంస్థ జోస్యం చెప్పగా, ఐదు సంస్థలు బి.జె.పికి ఎక్కువ స్థానాలు వస్తాయని తెలిపాయి. రెండు సంస్థలు కాంగ్రెస్ అధికారంలోనికి వస్తుందని చెప్పాయి.

ఎగ్జిట్ పోల్స్
పోలింగ్ సంస్థ ప్రచురణ తేదీ ఆధిక్యం
బి.జె.పి కాంగ్రెస్ జె.డి.ఎస్ ఇతరులు
ఇండియా TV-VMR[13] 12 May 2018 94 97 28 3 3
రిపబ్లిక్ TV-జన్ కీ బాత్ [14] 12 May 2018 105 78 37 2 27
ABP న్యూస్-C ఓటర్[15] 12 May 2018 110 88 24 2 22
టైమ్స్ నౌ-VMR[16] 12 May 2018 87 97 35 3 10
టమ్స్ నౌ-టుడేస్ చాణక్య[17] 12 May 2018 120 73 26 3 47
ఇండియా టుడే - ఏక్సిస్ మై ఇండియా [18] 12 May 2018 85 111 26 0 26
న్యూస్ X-CNX[19] 12 May 2018 106 75 37 4 31
న్యూస్ నేషన్ [20] 12 May 2018 107 73 38 4 34

ఫలితాలు[మార్చు]

కర్నాటక అసెంభ్లీ ఎన్నికలు 2018
ಪಕ್ಷ seats
బి.జె.పి
  
104
కాంగ్రెస్
  
78
జె.డి.ఎస్
  
37
ఇతరులు
  
3
మొత్తం స్థానాలు 224; ఎన్నికలు జరిగినవి 222
Parties and coalitions Popular vote Seats
Votes % ±pp Won +/−
భారతీయ జనతా పార్టీ (BJP) 1,31,85,384 36.2 104 Increase64
భారత జాతీయ కాంగ్రెస్ (INC) 1,38,24,005 38.0 78 Decrease44
జనతాదళ్ (సెక్యులర్) (JDS) 66,66,307 18.3 37 Decrease3
స్వతంత్రులు (IND) 14,37,045 3.9 1 Decrease8
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) 1,08,592 0.3 1 Increase1
కర్నాటక ప్రజ్ఞావత జనతా పార్టీ (KPJP) 74,229 0.2 1 Increase1
ఇతర పార్టీలు, నాయకులు 6,83,632 2.2 0 Decrease13
(NOTA) 3,22,841 0.9
ఖాళీ స్థానాలు 2 Increase2
Total 100.00 224 ±0

1999 నుండి 2018 వరకు వివిధ పార్టీల సీట్లలో మార్పులు[మార్చు]

  భారతీయ జనతా పార్టీ
  కాంగ్రెస్
  జె.డి (ఎస్)

పార్టీల ఓట్ల శాతం[మార్చు]

2014 కర్నాటక ఎన్నికలలో పార్టీల ఓట్ల శాతం

  కాంగ్రెస్ (38%)
  బి.జె.పి (36.2%)
  జె.డి (ఎస్) (18.4%)
  స్వతంత్రులు (4.00%)
  ఇతరులు (3.4%)
 • బిజెపి కంటే కాంగ్రెస్ అత్యధిక ఓట్లను సాధించింది.
పార్టీ ఓట్లశాతం పొందిన ఓట్లు
1 భారత జాతీయకాంగ్రెస్ 38% 1,37,63,500
2 భారతీయ జనతాపార్టీ 36.2% 1,31,20,300
3 జనతాదళ్ సెక్యులర్ 18.4% 66,48700
4 స్వతంత్రులు 4.00% 14,34,951
5 బహుజన సమాజ పార్టీ 0.3% 1,08592
6 ఎ.ఐ.ఎం ఇపి 0.33% 97,572
7 బి.పి.జె.పి 0.2% 83,071
8 సి.పి.ఎం 0.2% 81,181
9 స్వరాజ్ 0.2% 94,000
10 కె.పి.జి.పి 0.2% 74,229
11 నోటా 0.9% 3,09573
12 ఇతరులు -

గవర్నర్ నిర్ణయం - వివాదాలు[మార్చు]

కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్‌లకు 118 సీట్లతో పూర్తి మద్దతు ఉంది. బీజేపీకి కేవలం 104 సీట్లు మాత్రమే ఉన్నాయి. అయినా గవర్నర్ వాజుభాయ్ వాలా బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసినదిగా సూచించాడు. అసెంబ్లీలో బలనిరూపణకు 15 రోజుల సమయం ఇచ్చాడు. కర్నాటక 23వ ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప 2018 మే 17న ప్రమాణస్వీకారం చేశాడు. గవర్నర్ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా నిర్ణయం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్, జె.డి.ఎస్ పార్టీలు సుప్రీం కోర్టులో కేసు వేసాయి. మే 19 సాయంత్రం నాలుగు గంటలకు బల పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే బల పరీక్షకు కనీసం వారం రోజులు సమయం కావాలన్న బీజేపీ వాదనలను  కోర్టు తిరస్కరించింది. బలపరీక్షకు ఏర్పాట్లు చేయాలని కర్నాటక డీజీపీని కోర్టు ఆదేశించింది.[21] ఈ బల పరీక్షను ప్రోటెం స్పీకరు నిర్వహించాలని ఆదేశించింది. ఆ ఆదేశాలకనుగుణంగా గవర్నర్ ప్రోటెం స్పీకరుగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను నియమించాడు. బోపయ్య 2010 అక్టోబరులో అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్పపై తిరుగుబాటు చేసిన 11మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుని, ప్రభుత్వాన్ని నిలబెట్టాడు. కర్ణాటక హైకోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థించినా, సుప్రీంకోర్టు మాత్రం దీన్ని తప్పుబట్టింది. ఈ నేపథ్యం గల వ్యక్తిని స్పీకరుగా పారదర్శకంగా వ్యవహరించడని కాంగ్రెస్, జె.డి.ఎస్ పార్టీ నాయకులు మరలా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2018 మే 19 న ప్రోటెం స్పీకర్ నియామకం చెల్లదన్న కాంగ్రెస్, జేడీఎస్ వాదనలను సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. అసెంబ్లీలో నిర్వహించే విశ్వాస పరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.[22] 2018 మే 19 ఉదయం 11 గంటలకు శాసన సభ సమావేశం జరిగింది. ప్రోటెం స్పీకర్ బోపయ్య ముందుగా ఎన్నికైన శాసన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించాడు. మొదట భారతీయ జనతా పార్టీ సంఖ్యాబలం పెంచుకోవడానికి ప్రయత్నించి విఫలమైంది. రెండు రోజుల పాటు (55 గంటలు) ముఖ్యమంత్రిగా కొనసాగిన యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. అందువల్ల విశ్వాస పరీక్షకు ఆస్కారం లేకుండా పోయింది.[23]

కాంగ్రెస్- జె.డి.ఎస్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంగీకారాన్ని గవర్నరుకు తెలిపాయి. దీని ఫలితంగా కర్నాటక 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పరమేశ్వర ప్రమాణం స్వీకారం చేశారు. వారి చేత 2018 మే 23న గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రమాణం చేయించాడు. కర్నాటక విధాన సౌధ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది జేడీఎస్, కాంగ్రెస్, బీఎస్పీ, ఇతర పార్టీల కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.[24]

అవిశ్వాస తీర్మానం[మార్చు]

కర్నాటకలో 23/జులై/2019 లో కాంగ్రస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారు కూలిపోయింది. కర్నాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో కుమార సర్కారు మెజారిటీ నిరూపించుకోవడంలో విఫలమైంది. సభలో మెజార్టీకి కావాల్సిన మేజిక్ ఫిగర్ 103 కాగా. సభకు హాజరయిన బీజేపీ ఎమ్మెల్యేలు 105 మంది ఉన్నారు. మరో వైపు రెబల్స్‌ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ సభ్యుల సంఖ్య కేవలం 101 మాత్రమే ఉంది. కాగా స్పీకర్‌, నామినేటేడ్‌ ఎమ్మెల్యేలను తీసివేస్తే అధికారపక్షం బలం 99కి పరిమితం అయ్యింది. 15 మంది రెబల్స్‌, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు అయ్యారు. డివిజన్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. హెడ్ కౌంట్ ద్వారా సభ్యులను లెక్కించారు. విశ్వాస పరీక్షలో అధికార పక్షం ఓట్లు 99 కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా 105 ఓట్లు దక్కాయి.

మూలాలు[మార్చు]

 1. "Karnataka election highlights rural-urban divide: State witnesses highest voter turnout, but Bengaluru stays away" (in English). Firstpost. Retrieved 16 May 2018. The 72.13 percent voter turnout for the Karnataka Assembly elections has broken all records and is the highest recorded in the state since the 1952 polls, Chief Electoral Officer Sanjeev Kumar said on Saturday.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
 2. "Election commission's statistical report on general elections, 2013 to the legislative assembly of Karnataka" (PDF).
 3. "Picked Karnataka poll date from Times Now TV: BJP's IT cell head Amit Malviya tells EC". The New Indian Express. Retrieved 2018-04-14.
 4. "Who should get first call to form govt in Karnataka? Jury's out". The Times of India. 16 May 2018. Retrieved 16 May 2018.
 5. "Election Commission sets up panel to probe leak of Karnataka poll date". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-03-27. Retrieved 2018-04-14.
 6. "Karnataka poll date leak: EC probe panel to probe media, not Amit Malviya". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-03-29. Retrieved 2018-04-14.
 7. "Karnataka Poll Date Was Speculation, Not Leak: Election Commission Committee". NDTV.com. Retrieved 2018-04-14.
 8. http://www.thehindu.com/elections/karnataka-2018/over-9000-voter-id-cards-unearthed/article23817906.ece
 9. Poovanna, Sharan (3 November 2017). "Amit Shah launches BJP's Karnataka election campaign in Bengaluru". Mint. Retrieved 3 February 2018.
 10. "In Karnataka, PM Modi addresses crowd of 2 lakh, says 'naked dance of mafia' in Sidda regime". The Times of India. 5 February 2018. Retrieved 6 February 2018.
 11. "BJP Launches 14-Day 'Protect Bengaluru March'". ndtv.com. Press Trust of India. 2 March 2018. Archived from the original on 3 March 2018. Retrieved 3 March 2018.
 12. Poovanna, Sharan (8 December 2017). "How Karnataka Congress is trying to micromanage 2018 assembly elections". Mint. Retrieved 3 February 2018.
 13. "Karnataka Exit Poll: IndiaTV-VMR predicts fractured mandate; Congress and BJP in neck-and-neck fight". 12 May 2018.
 14. "Karnataka Elections 2018: Jan Ki Baat's Exit Poll Says The BJP Will Emerge As The Single Largest Party". 12 May 2018.
 15. "BJP close to majority in Karnataka, may get 110 seats: ABP News exit poll". 12 May 2018. Archived from the original on 15 మే 2018. Retrieved 17 మే 2018.
 16. "TIMES NOW-VMR Exit Poll prediction". 12 May 2018.
 17. "Karnataka Assembly Elections 2018 - Post Poll Analysis". 12 May 2018. Archived from the original on 15 మే 2018. Retrieved 17 మే 2018.
 18. "Assembly Election 2018 - Karnataka". 12 May 2018. Archived from the original on 17 మే 2018. Retrieved 17 మే 2018.
 19. "NewsX-CNX exit poll 2018: A hung Karnataka Assembly with BJP as the single largest party". 12 May 2018. Archived from the original on 13 మే 2018. Retrieved 17 మే 2018.
 20. "Karnataka election 2018: What exit polls can't settle, May 15 will; updates". 12 May 2018.
 21. "రేపే కర్నాటక అసెంబ్లీలో బలపరీక్ష".[permanent dead link]
 22. "అంతకు ముందు సుప్రీం కోర్టులో ఏం జరిగింది?".
 23. ವಿಶ್ವಾಸಮತ ಯಾಚಿಸದೆ ರಾಜೀನಾಮೆ ನೀಡಿದ ಯಡಿಯೂರಪ್ಪ; 19 May, 2018
 24. "కర్నాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం". Archived from the original on 2018-05-27. Retrieved 2018-06-03.

బయటి లంకెలు[మార్చు]