Jump to content

అశోక్ పట్టన్

వికీపీడియా నుండి
అశోక్ పట్టన్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023
ముందు మహదేవప్ప యాద్వాడ్
నియోజకవర్గం రామదుర్గ్
పదవీ కాలం
2008 – 2018
ముందు మహదేవప్ప యాద్వాడ్
తరువాత మహదేవప్ప యాద్వాడ్
నియోజకవర్గం రామదుర్గ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్

అశోక్ మహదేవప్ప పట్టన్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రామదుర్గ్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అశోక్ పట్టన్ తల్లితండ్రులు మహదేవప్ప పట్టన్,[1] శారదమ్మ[2] రామదుర్గ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

రాజకీయ జీవితం

[మార్చు]

అశోక్ పట్టన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 శాసనసభ ఎన్నికలలో రామదుర్గ్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి మహదేవప్ప యాదవ్‌పై 384 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి మహదేవప్ప యాదవ్‌పై 4,984 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

అశోక్ పట్టన్ 2018 శాసనసభ ఎన్నికలలో రామదుర్గ్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి మహదేవప్ప యాదవ్‌ చేతిలో 2,875 ఓట్ల తేడాతో ఓడిపోయి, 2023 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చిక్కా రేవణ్ణపై 11,730 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[4][5] శాసనసభలో కాంగ్రెస్ చీఫ్ విప్‌గా నియమితుడయ్యాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (23 March 2018). "Mahadevappa Pattan passes away at 107" (in Indian English). Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.
  2. Star of Mysore (21 February 2019). "Two former women MLAs pass away". Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
  4. The Times of India (14 May 2023). "List of winning candidates and their constituencies in Karnataka assembly elections". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
  5. The Hindu (13 May 2023). "Karnataka elections: Congress wins majority of seats in Belagavi district" (in Indian English). Archived from the original on 24 May 2023. Retrieved 19 November 2024.
  6. Vartha Bharathi (3 July 2023). "Ashok Pattan, Saleem Ahmed appointed Congress Chief Whips in Karnataka Assembly, Council" (in ఇంగ్లీష్). Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.