ఉమాశ్రీ
ఉమాశ్రీ | |||
| |||
స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం మే 20, 2013 – మే 15, 2018 | |||
ముందు | కలకప్ప జి. బండి | ||
---|---|---|---|
తరువాత | జయమాల | ||
కన్నడ , సాంస్కృతిక శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2013 మే 20 – 2018 మే 15 | |||
ముందు | గోవింద్ ఎం. కర్జోల్ | ||
తరువాత | జయమాల | ||
కర్ణాటక శాసనసభ సభ్యురాలు
| |||
పదవీ కాలం 2013 మే 17 – 2018 మే 15 | |||
ముందు | సిద్దు సవది | ||
తరువాత | సిద్దూ సవాడి | ||
నియోజకవర్గం | టెర్డాల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నోనవినకెరె, తిప్టూరు, తుంకూరు జిల్లా, కర్ణాటక, భారతదేశం | 1957 మే 10||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
వృత్తి | నటి (1978 - ప్రస్తుతం) రాజకీయ నాయకురాలు (2013 - ప్రస్తుతం) |
ఉమాశ్రీ (జననం 1957 మే 10) భారతీయ సినిమా నటి, రాజకీయవేత్త. ఆమె 400లకు పైచిలుకు కన్నడ భాషా చలనచిత్రాలలో నటించి ప్రసిద్ధి చెందింది. ఆమె 2008లో గులాబి టాకీస్‌లో గులాబీ పాత్రకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది.[1]
2013లో, ఆమె కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వంలో శాసనసభ సభ్యురాలు, [2] మంత్రిగా కూడా వ్యవహరించింది.[3][4]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఉమాశ్రీ దేవాంగ కుటుంబంలో జన్మించింది.[5][6] ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ఆమెను విడిచిపెట్టి వేరే పెళ్లి చేసుకున్నాడు. ఆమె తన ఇద్దరు పిల్లలను ఒంటరిగా పెంచింది. ఆమె కుమార్తె గాయత్రి దంతవైద్యురాలు కాగా కుమారుడు విజయకుమార్ న్యాయవాది.
కెరీర్
[మార్చు]శాసన సభ్యురాలు, మంత్రిగా
[మార్చు]ఉమాశ్రీ గ్రామీణ, వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు మద్దతు ఇవ్వడం వంటి సానుకూల సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటుంది. ఆమె గ్రామీణ ప్రాంతాల అవసరాలకు ప్రదానంగా కృషి చేస్తుంది. 2013లో కాంగ్రెస్ పార్టీ నుండి తెర్డాల్ నియోజకవర్గం శాసన సభ్యురాలుగా ఎన్నికైంది. ఆమె మహిళా, శిశు అభివృద్ధి, కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రిగా కూడా చేసింది.
నాటకాలు
[మార్చు]ఆమెకు నాటకాలలో అనుభవం ఉంది. ఫ్రిట్జ్ బెన్నెవిట్జ్, బి.వి. కారంత్, గిరీష్ కర్నాడ్, సి. జి. కృష్ణస్వామి, ఆర్. నగేష్, టి.ఎస్. నాగాభరణం వంటి దర్శకులతో ఆమె పనిచేసింది. ఆమె బెంగుళూరులోని రంగసంపద అమెచ్యూర్ థియేటర్ గ్రూప్‌లో సభ్యురాలు.
సినిమా నటిగా
[మార్చు]ఉమాశ్రీ 1984లో కాశీనాథ్‌తో కలిసి అనుభవ చిత్రంలో సహాయ పాత్రలో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. కానీ అంతకు ముందు ఆమె టి ఎస్ నాగభరణ దర్శకత్వంలో 1980 కన్నడ చిత్రం బంగారడ జింకే విడుదలైంది.
ఆమె నటుడు ఎన్. ఎస్. రావు, దినేష్, ద్వారకీష్, మైసూర్ లోకేష్, సిహికహి చంద్రు, రమేష్ భట్, ముఖ్యమంత్రి చంద్రు, దొడ్డన్న, కరిబసవయ్యలతో కలిసి నటించింది. అలాగే ఆమె దర్శకుల్లో ఎస్. వి. రాజేంద్ర సింగ్ బాబు, భార్గవ, సింగీతం శ్రీనివాసరావు, పేరాల, కె వి రాజు, విజయ్, దొరై భగవాన్, ద్వారాకిష్, డి రాజేంద్ర బాబు, దినేష్ బాబు, వి రవిచంద్రన్, పూరీ జగన్నాథ్, యోగరాజ్ భట్ తదితర దర్శకులతో పనిచేసింది.
టెలివిజన్
[మార్చు]- నొందవర హాడు, టి. ఎస్. రంగా దర్శకత్వం వహించిన కుష్టు వ్యాధి గురించిన డాక్యుమెంటరీ (దూరదర్శన్)
- హట్యే, హెచ్. గిరిజమ్మ అనే టెలిఫిల్మ్ (దూరదర్శన్)
- ముసంజే, టి. ఎస్. నాగబరణ దర్శకత్వం వహించిన సీరియల్ (ఉదయ టీవీ)
- ముసంజే కథా ప్రసంగ, ప్రకాష్ బెలవాడి దర్శకత్వం వహించిన సీరియల్ (ఈటీవీ)
- కిచ్చు, చైతన్య దర్శకత్వం వహించిన సీరియల్. (ఈటీవీ)
- అమ్మ నినగాగి (ఈటీవీ)
- ఆరతిగొబ్బ కీర్తిగొబ్బా (స్టార్ సువర్ణ)
- చిన్నారి చిలిపిలి (ఉదయ టీవీ)
- పుట్టక్కన మక్కలు (జీ కన్నడ)
అవార్డులు
[మార్చు]- 2004 - మణి చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారం
- 2008 - గులాబీ టాకీస్ చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు (55వ జాతీయ చలనచిత్ర అవార్డులు).
- 2020-21 - రత్నన్ ప్రపంచ చిత్రానికి ఉత్తమ సహాయ నటి
మూలాలు
[మార్చు]- ↑ "Jo misses National Award by a whisker!". Sify. 8 September 2009. Archived from the original on 5 March 2014. Retrieved 3 December 2011.
- ↑ "Karnataka 2013." Myneta website, National Election Watch. Accessed 21 February 2014.
- ↑ "Writer's remarks on Umashree draw flak." The Hindu Bangelore, 9 February 2014.
- ↑ Nandakumar P. "Karnataka: Umashree lone woman minister." Archived 2013-06-10 at the Wayback Machine Deccan Chronicle 18 May 2013. Accessed 21 February 2014
- ↑ "Siddharamaiah, increases Quota in Cabinet".
- ↑ "Terdal Election News".
- 1957 జననాలు
- భారతీయ సినిమా నటీమణులు
- భారతీయ మహిళా రాజకీయ నాయకులు
- కన్నడ సినిమా నటీమణులు
- ఉత్తమ నటి జాతీయ చలనచిత్ర అవార్డు విజేతలు
- దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కార గ్రహీతలు
- భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు
- భారతీయ టెలివిజన్ నటీమణులు
- భారతీయ మహిళా హాస్యనటులు
- కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రులు
- భారతదేశంలోని మహిళా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు
- కర్ణాటక ఎమ్మెల్యేలు 2013–2018
- కర్ణాటక శాసనసభ మహిళా సభ్యులు