వాజుభాయ్ వాలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాజుభాయ్ వాలా
వాజుభాయ్ వాలా


కర్ణాటక గవర్నర్
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1 సెప్టెంబరు 2014[1]
ముందు కొణిజేటి రోశయ్య

గుజరాత్ విధానసభ స్పీకర్
పదవీ కాలము
23 జనవరి 2012 – 31 ఆగస్టు 2014
ముందు గనపత్ వాసవ
తరువాత మంగూభాయ్ సి. పాటెల్ (acting)

గుజరాత్ విధాన సభ సభ్యుడు
పదవీ కాలము
26 డిసెంబరు 2012 – 31 ఆగస్టు 2014
నియోజకవర్గం రాజకోట్ పశ్చిమ

వ్యక్తిగత వివరాలు

జననం (1939-01-13) 13 జనవరి 1939 (వయస్సు 82)
రాజకోట్, రాజకోట్ రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
సంతానము 2 కుమార్తెలు, 2 కుమారులు
నివాసము గాంధీనగర్, గుజరాత్
మతం హిందూ
మూలం legislativebodiesinindia.nic.in

వాజుభాయ్ రుదభాయి వాలా భారతీయ రాజకీయ నాయకుడు, కర్ణాటక రాష్ట గవర్నరుగా సెప్టెంబరు 2014 నుండి పనిచేస్తున్నాడు. [1] అతను గుజరాత్ అసెంబ్లీకి స్పీకరుగా 2012 నుండి 2014 మధ్య తన సేవలనందించాడు. అతను భారతీయ జనతా పార్టీ నాయకుడు. అతను గుజరాత్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఆర్థిక, కార్మిక, ఉపాధి వంటి వివిధ శాఖలలో పనిచేసాడు. అతను గుజరాత్ అసెంబ్లీకి రాజకోట్ పశ్చిమ స్థానం నుండి అనేక సార్లు ఎన్నికయ్యాడు.

జీవిత విశేషాలు[మార్చు]

అతను రాజకీయ ప్రవేశం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వారా జరిగింది. అతను 1971లో జనసంఘ్ లో చేరాడు. అతను 1975 ఎమర్జెన్సీ కాలంలో 11 నెలలపాటు జైలు శిక్ష అనుభవించాడు.[2] అతను 1980లలో రాజకోట్ కు మేయరుగా పనిచేసాడు. తరువాత రాజకోట్ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీచేసి అనేక సార్లు గెలుపొందాడు. అతను ఆర్థిక, రెవెన్యూ వంటి అనేక శాఖలకు 1998 నుండి 2012 వరకు కేబినెట్ మంత్రిగా తన సేవలనంచిందాడు. అతను రెండుసార్లు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. అతను గుజరాత్ శాసనసభలో 18 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా రికార్డు సంపాదించాడు. అతను డిసెంబరు 2012 నుండి ఆగస్టు 2014 వరకు అసెంబ్లీ స్పీకరుగా పనిచేసాడు. అతను సెప్టెంబరు 2014 లో కర్ణాటక రాష్ట్ర గవర్నరుగా పదవినలంకరించాడు.[1][3][4][5][6][7][8] అతనికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు, ఐదుగురు మనుమలు ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Vajubhai Rudabhai Vala to take oath as Karnataka Guv on Sept 1". One India News. 30 August 2014. Retrieved 31 August 2014. CS1 maint: discouraged parameter (link)
  2. "'Paniwala Mayor' reinducted into Narendra Modi cabinet". One India. 13 December 2006. Retrieved 11 January 2015. CS1 maint: discouraged parameter (link)
  3. Balan, Premal (23 January 2013). "Vaju Vala unanimously elected new speaker of Gujarat Assembly". Business Standard. Gandhinagar. Retrieved 24 January 2013. CS1 maint: discouraged parameter (link)
  4. "Vaju Vala named 'pro tem' Speaker of Gujarat Assembly". Zee News. PTI. 26 December 2012. Retrieved 2 January 2013. CS1 maint: discouraged parameter (link)
  5. "Vaju Vala named 'pro tem' Speaker". Indian Express. Press Trust of India. 27 December 2012. Retrieved 2 January 2013. CS1 maint: discouraged parameter (link)
  6. "177 sworn in as MLAs". The Times of India. TNN. 23 January 2012. Retrieved 24 January 2013. CS1 maint: discouraged parameter (link)
  7. "Narendra Modi aide Vajubhai Vala is Karnataka governor". The Times of India. TNN. 27 August 2014. Retrieved 31 August 2014. CS1 maint: discouraged parameter (link)
  8. "Karnataka's Governor Vajubhai Vala hails RSS,says posts don't matter". TNN. 26 August 2014. Retrieved 31 August 2014. CS1 maint: discouraged parameter (link)

బయటి లింకులు[మార్చు]