Jump to content

బి. శివన్న

వికీపీడియా నుండి
బోలప్ప శివన్న (

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2013
ముందు ఎ. నారాయణస్వామి
నియోజకవర్గం అనేకల్

వ్యక్తిగత వివరాలు

జననం (1967-02-02)1967 ఫిబ్రవరి 2
బెంగళూరు, కర్ణాటక , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు ఆర్.ధ్రువనారాయణ, వీణా
జీవిత భాగస్వామి ఎం సరస్వతి
సంతానం 2
పూర్వ విద్యార్థి గవర్నమెంట్ సైన్స్ కాలేజ్ బెంగుళూరు యూనివర్సిటీ (1992) ఇస్లామియా లా కాలేజ్ (1995)

బోలప్ప శివన్న ( కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అనేకల్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బి. శివన్న ఎన్‌ఎస్‌యూఐ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995లో బేగూర్ నుండి జిల్లా పంచాయతీ సభ్యునిగా ఎన్నికై ఆ తరువాత 2004లో అనేకల్, 2008లో మహదేవపుర నియోజకవర్గం నుండి శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో అనేకల్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బిజెపి అభ్యర్థి ఎ. నారాయణస్వామిపై 40182 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

బి. శివన్న 2018 శాసనసభ ఎన్నికలలో అనేకల్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బిజెపి అభ్యర్థి బి. హర్షవర్ధన్‌పై 8,627 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా,[2] 2023 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బిజెపి అభ్యర్థి శ్రీనివాస్. సి. హుల్లహళ్లిపై 31,325 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. A. B. P. Live (13 May 2023). "Anekal Election Result 2023 Live: Inc Candidate B. Shivanna Wins From Anekal" (in ఇంగ్లీష్). Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.
  2. The Times of India (5 May 2018). "Caste a touchy issue despite reservation". Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.
  3. India Today (13 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2023. Retrieved 17 November 2024.