ఎ.ఆర్. కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎ.ఆర్. కృష్ణమూర్తి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023
ముందు ఎన్. మహేష్
తరువాత ఆర్.ధ్రువనారాయణ
నియోజకవర్గం కొల్లేగల్
పదవీ కాలం
1994 – 2004
ముందు కె. సిద్దయ్య
నియోజకవర్గం సంతేమరహళ్లి

వ్యక్తిగత వివరాలు

జననం (1961-03-23) 1961 మార్చి 23 (వయసు 63)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్
జనతాదళ్ (యునైటెడ్)
జనతాదళ్ (సెక్యులర్)

ఎ.ఆర్. కృష్ణమూర్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సంతేమరహళ్లి, కొల్లేగల్ శాసనసభ నియోజకవర్గల నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఎ.ఆర్. కృష్ణమూర్తి జనతాదళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989 శాసనసభ ఎన్నికలలో సంతేమరహళ్లి నియోజకవర్గం నుండి జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కే. సిద్దయ్య చేతిలో 17,756 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 1994 ఎన్నికలలో జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి టి. గోపాల్‌పై 12,253 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఎ.ఆర్. కృష్ణమూర్తి ఆ తరువాత జనతాదళ్ (యునైటెడ్) పార్టీలో చేరి 1999 శాసనసభ ఎన్నికలలో సంతేమరహళ్లి నియోజకవర్గం నుండి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఆర్.ధ్రువననారాయణపై 5,906 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2004 ఎన్నికలలో జనతాదళ్ (సెక్యులర్) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆర్.ధ్రువనారాయణ చేతిలో కేవలం 1 ఓటు తేడాతో ఓడిపోయాడు.[1]

ఎ.ఆర్. కృష్ణమూర్తి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి సంతేమరహళ్లి నియోజకవర్గం రద్దు కావడంతో ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో కొల్లేగల్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి ఎన్. మహేష్ చేతిలో 19,454 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ ఎన్. మహేష్ పై 59,519 ఓట్ల మెజారిటీతో గెలిచి 19 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. ETV Bharat News (13 May 2023). "कभी एक वोट से चुनाव हार गए थे कृष्णमूर्ति, इस बार 59 हजार मतों से जीत हासिल की". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.
  2. Star of Mysore (14 May 2023). "A.R. Krishnamurthy makes a come back from Kollegal after 19 years". Archived from the original on 2 March 2024. Retrieved 17 November 2024.
  3. Mint (13 May 2023). "Karnataka Assembly Election result 2023: These new MLAs won by a margin of 50,000 votes or more". Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.