వీరభద్రయ్య చరంతిమఠ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీరభద్రయ్య చరంతిమఠ్
వీరభద్రయ్య చరంతిమఠ్


పదవీ కాలం
2018 – 2023
ముందు హెచ్.వై. మేటి
నియోజకవర్గం బాగల్‌కోట్
పదవీ కాలం
2004 – 2013
ముందు పూజారి ప్రహ్లాద్ హనమంతప్ప
తరువాత హెచ్.వై. మేటి
నియోజకవర్గం బాగల్‌కోట్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

వీరన్న చంద్రశేఖరయ్య చరంతిమఠ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బాగల్‌కోట్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

వీరభద్రయ్య చరంతిమఠ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004 శాసనసభ ఎన్నికలలో బాగల్‌కోట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి పూజార్ ప్రహ్లాద్ హనుమంతప్పపై 34,597 ఓట్ల మెజారితో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2008 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి హెచ్.వై. మేటిపై 9,246 ఓట్ల మెజారితో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

వీరభద్రయ్య చరంతిమఠ్ 2013 శాసనసభ ఎన్నికలలో బాగల్‌కోట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి హెచ్.వై. మేటి చేతిలో 2,900 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి హెచ్.వై. మేటిపై 15,934 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా,[3] 2023 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి హెచ్.వై. మేటి చేతిలో 5,878 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. The Times of India (15 May 2023). "Karnataka election results: BJP loses two strongholds - Vijayapura & Bagalkot". Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.
  2. News18 ಕನ್ನಡ (23 April 2023). "Veeranna Charantimath: ಈ ಬಾರಿಯೂ ಅಗ್ನಿಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ಗೆಲ್ತಾರಾ ಬಿಜೆಪಿ ಶಾಸಕ?". Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Times of India (13 May 2023). "Bagalkot Constituency Election Results: Assembly seat details, MLAs, candidates & more". Archived from the original on 22 November 2024. Retrieved 22 November 2024.