Jump to content

కే.ఎస్‌. ఈశ్వరప్ప

వికీపీడియా నుండి
కే.ఎస్‌. ఈశ్వరప్ప
కే.ఎస్‌. ఈశ్వరప్ప


పదవీ కాలం
20 ఆగష్టు 2019 – 14 ఏప్రిల్ 2022
ముందు కృష్ణ బైరె గౌడ
పదవీ కాలం
12 జులై 2012 – 13 మే 2013
ముందు జగదీష్ శెట్టర్
తరువాత హెచ్.కె. పాటిల్

క్రీడా శాఖ మంత్రి
పదవీ కాలం
27 సెప్టెంబర్ 2019 – 10 ఫిబ్రవరి 2020
ముందు రహీమ్ ఖాన్
తరువాత సి. టి. రవి

పదవీ కాలం
12 జులై 2012 – 13 మే 2013
ముందు బి.ఎస్.యడ్యూరప్ప
తరువాత జీ. పరమేశ్వర

పదవీ కాలం
12 జులై 2012 – 13 మే 2013
ముందు జి. కరుణాకర రెడ్డి
తరువాత శ్రీనివాస ప్రసాద్

పదవీ కాలం
30 మే 2008 – 28 జనవరి 2010
ముందు హెచ్. డి. రేవన్న
తరువాత శోభా కరంద్లాజే

పదవీ కాలం
18 ఫిబ్రవరి 2006 – 8 అక్టోబర్ 2007
ముందు మల్లికార్జున్ ఖర్గే
తరువాత బ‌స‌వ‌రాజు బొమ్మై

కర్ణాటక శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు
పదవీ కాలం
13 జులై 2014 – 29 మే 2018
ముందు డి. వీ. సదానంద గౌడ
తరువాత కోట శ్రీనివాస పూజారి

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు[1]
పదవీ కాలం
2 జనవరి 2010 – 11 జులై 2012
ముందు డి. వీ. సదానంద గౌడ
తరువాత ప్రహ్లాద్ జోషి[2][3]

వ్యక్తిగత వివరాలు

జననం (1948-06-10) 1948 జూన్ 10 (వయసు 76)
బళ్లారి,
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం బెంగళూరు

కే.ఎస్‌. ఈశ్వరప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన శివమొగ్గ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, కర్ణాటక రాష్ట్ర 6వ ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశాడు.[4]

మంత్రిగా భాద్యతలు

[మార్చు]
  • భారీ నీటి పారుదల శాఖ మంత్రి: 2006 ఫిబ్రవరి 18 – 2007 అక్టోబరు 8
  • విద్యుత్ శాఖ మంత్రి : 2008 మే 30 – 2010 జనవరి 28
  • రెవెన్యూ శాఖ మంత్రి: 2012 జూలై 12 – 2013 మే 13
  • కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి: 2012 జూలై 12 – 2013 మే 13
  • క్రీడా శాఖ మంత్రి: 2019 సెప్టెంబరు 27 – 2020 ఫిబ్రవరి 10
  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి: 2019 ఆగస్టు 20 – 2022 ఏప్రిల్ 14[5]

పార్టీ పదవులు

[మార్చు]

ఆరోపణలు, మంత్రిగా రాజీనామా

[మార్చు]

సంతోష్ పాటిల్ అనే ఓ సివిల్ కాంట్రాక్టర్ 2022 ఏప్రిల్లో ఉడుపిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన త‌న మ‌ర‌ణ వాంగ్మూలంలో మంత్రి ఈశ్వ‌ర‌ప్ప ఒత్తిళ్ల వ‌ల్లే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. సంతోష్ పాటిల్ మరణాంతరం తన సోదరుడి మరణానికి మంత్రి ఈశ్వరప్ప కారణమంటూ ఆయన సోదరుడు ప్రశాంత్ పాటిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హిందళగ గ్రామంలో చేపట్టిన రూ. 4కోట్ల పనుల్లో 40శాతం కమిషన్ కావాలంటూ తన సోదరుడు సంతోష్ పాటిల్‌ను మంత్రితో పాటు ఆయన అనుచరులు వేధించినట్లు అందులో పేర్కొన్నాడు. ఈ కాంట్రాక్టు సంబంధించి బిల్లులను విడుదల చేయాలంటూ ఎన్నోసార్లు (దాదాపు 80 సార్లు కలిసినట్లు) మంత్రికి మొర పెట్టుకునప్పటికీ ఫలితం లేదన్నారు. మంత్రి అనుచరులు బసవరాజు, రమేశ్ లు తమకు 40 శాతం కమిషన్ ఇవ్వాలంటూ వేధించారని ఆరోపించాడు.

సంతోష్ పాటిల్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డటంతో క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయ క‌ల‌క‌లం చెల‌రేగింది. దీంతో ఈశ్వ‌ర‌ప్ప‌, ఆయ‌న స‌న్నిహితుల‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖ‌లు చేశారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆదేశాల మేరకు ఈశ్వ‌ర‌ప్ప‌ రాజీనామా చేసినట్లు 2022 ఏప్రిల్ 14న ప్రకటించాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "K.S. Eshwarappa all set to become State BJP president". The Hindu. 28 January 2010. Archived from the original on 15 September 2010. Retrieved 2010-02-01.
  2. "Eshwarappa steps down as State BJP president". The Hindu. 9 May 2013. Retrieved 2013-05-12.
  3. "Pralhad Joshi appointed Karnataka BJP president". The Hindu. 22 March 2013. Retrieved 2016-06-26.
  4. Andhra Jyothy (15 April 2022). "ఈశ్వరప్ప రాజీనామా!" (in ఇంగ్లీష్). Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.
  5. Eenadu (14 April 2022). "మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా: ఈశ్వరప్ప ప్రకటన". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.
  6. Andhra Jyothy (14 April 2022). "కాంట్రాక్టర్‌ ఆత్మహత్య.. మంత్రి ఈశ్వరప్ప రాజీనామా" (in ఇంగ్లీష్). Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.