ప్రహ్లాద్ జోషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Shri Pralhad Joshi Minister of Coal.jpg
ప్రహ్లాద్ జోషి

ప్రహ్లాద్ వెంకటేష్ జోషి ( జననం 1962 నవంబరు 27) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుత కేంద్ర బొగ్గు, గనులు ఇంకా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

ప్రహ్లాద్ జోషి 2004 నుంచి కర్ణాటకలోని ధార్వాడ్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నాడు. ఆయన ఇప్పటి వరకు 4 సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. ప్రహ్లాద్ జోషి 2014 నుంచి 2016 వరకు కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి మోడీ ప్రభుత్వంలో 2019 మే 30న నుండి బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2] ఆయన 2022 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఇన్‌చార్జ్‌గా పనిచేశాడు.[3]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

జోషి 1962 నవంబరు 27న అప్పటి బీజాపూర్ జిల్లాలో జన్మించాడు, ప్రస్తుతం బీజాపూర్ కర్ణాటక రాష్ట్రంలో భాగంగా ఉంది.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రహ్లాద్ జోషి 1992 నుండి 1994 రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యుడిగా ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని బొబ్బిలి పట్టణంలో జరిగిన సమావేశంలో ప్రజల దృష్టికి వచ్చాడు. ధార్వాడ్ లోక్సభ నియోజకవర్గం నుండి 2004, 2009, 2014 అలాగే 2019 ఎన్నికల్లో విజయం సాధించాడు. 2014 నుండి 2016 వరకు కర్ణాటక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు నిర్వహించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Pralhad Venkatesh Joshi | National Portal of India". www.india.gov.in. Retrieved 2021-07-18.
  2. Writer, Staff (2019-05-31). "PM Modi allocates portfolios. Full list of new ministers". mint (in ఇంగ్లీష్). Retrieved 2021-07-18.
  3. TV9 Telugu (11 March 2022). "దేవభూమిలో కమల విజయం వెనుక ప్రహ్లాద్ జోషి.. బీజేపీకి కలిసొచ్చిన కన్నడికుని నాయకత్వ లక్షణాలు." Archived from the original on 17 March 2022. Retrieved 17 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Lok Sabha (2022). "Pralhad Joshi". Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.