ఎస్.ఎమ్. కృష్ణ
![]() |
ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి.
|
Somanahalli Mallaiah Krishna ಸೋಮನಹಳ್ಳಿ ಮಲ್ಲಯ್ಯ ಕೃಷ್ಣ |
|
---|---|
![]() |
|
Minister of External Affairs | |
Incumbent | |
Assumed office 23 May 2009 |
|
అంతకు ముందువారు | Pranab Mukherjee |
Governor of Maharashtra | |
కార్యాలయంలో 12 December 2004 – 5 March 2008 |
|
Chief Minister | Vilasrao Deshmukh |
అంతకు ముందువారు | Mohammed Fazal |
తరువాత వారు | Sanayangba Chubatoshi Jamir |
Chief Minister of Karnataka | |
కార్యాలయంలో 11 October 1999 – 28 May 2004 |
|
గవర్నరు | V. S. Ramadevi Triloki Nath Chaturvedi |
అంతకు ముందువారు | Jayadevappa Halappa Patel |
తరువాత వారు | Dharam Singh |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1 మే 1932 |
రాజకీయ పార్టీ | UPA-INC |
భాగస్వామి | Prema Krishna |
నివాసం | Bangalore, India |
పూర్వవిద్యార్థి | Maharajas College, Mysore University Law College, Bangalore Southern Methodist University George Washington University |
వెబ్సైటు | Ministry of External Affairs |
సాధారణంగా ఎస్.ఎమ్.కృష్ణ గా వ్యవహరించబడే సోమనహల్లి మల్లయ్య కృష్ణ (కన్నడ: ಸೋಮನಹಳ್ಳಿ ಮಲ್ಲಯ್ಯ ಕೃಷ್ಣ), (1932 మే 1న జన్మించారు) విదేశీ వ్యవహారాల మంత్రి మరియు రాజ్యసభలో కర్నాటక నుండి భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 1999 నుంచి 2004 వరకు కర్నాటక ముఖ్యమంత్రిగా, 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నరుగా వ్యవహరించారు.
జీవిత సమాచారం[మార్చు]
ఎస్.ఎమ్ కృష్ణ ఎస్.సి మల్లయ్య కుమారుడు, మాండ్య జిల్లాలోని మద్దూర్ తాలూకాలోని సోమనహల్లి అనే చిన్నగ్రామంలో కృష్ణ జన్మించారు. ఇతడు మైసూరు మహారాజా కాలేజ్ నుంచి ఆర్ట్స్‌లో డిగ్రీని పూర్తి చేశారు.యూనివర్శిటీ లా కళాశాల నుంచి లా డిగ్రీ పుచ్చుకున్నారు. అప్పట్లో ఇది బెంగళూరు ప్రభుత్వ లా కాలేజీగా వ్యవహరించబడేది [1]. కృష్ణ యునైటెడ్ స్టేట్స్‌లో చదువుకున్నారు. టెక్సాస్ డల్లాస్‌లోని సదరన్ మెథడిస్ట్ యూనివర్శిటీ నుంచి, వాషింగ్టన్ డి.సి. లోని ది జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ లా స్కూల్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఇక్కడ ఇతడు ఫుల్‌బ్రైట్ స్కాలర్‌గా ఉండేవాడు. తర్వాత ఇతడు ఫ్యాకల్టీలో చేరి అంతర్జాతీయ న్యాయశాస్త్రాన్ని చదువుకున్నాడు. భారత్‌కు తిరిగి వచ్చిన వెంటనే, అతడు కర్నాటక శాసనసభకు 1962లో ఎన్నికయ్యాడు. [2].
1964 ఏప్రిల్ 29న ఇతడు ప్రేమను వివాహమాడాడు, వీరికి ఇద్దరు కుమార్తెలు. కృష్ణ చక్కటి క్రీడాకారుడు, టెన్నిస్‌ని క్రమం తప్పకుండా ఆడేవాడు.
రాజకీయ జీవితం[మార్చు]
అదనంగా, కృష్ణ కర్నాటకలోని మాండ్య నుంచి అనేకసార్లు MPగా సేవలందించాడు. 1968లో మొదలై 4వ, 5వ, 7వ, 8వ లోక్‌సభలో సభ్యుడయ్యాడు. ఇతడు 1983-84 మధ్యన ఇందిరాగాంధీ ప్రభుత్వంలో మంత్రిగా, 1984 -85 మధ్యన రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో పరిశ్రమలు, ఆర్థికశాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు. 1996 మరియు 2006 సంవత్సరాలలో ఇతడు రాజ్యసభ సభ్యుడుగా ఉండేవాడు. ఇతడు కర్నాటక శాసనసభ సభ్యుడు, మరియు మండలిలో వివిధ కాలాల్లో సభ్యుడుగా ఉండేవాడు. 1989-1992 మధ్యకాలంలో ఇతడు కర్నాటక శాసన సభ స్పీకర్ గాను, కర్నాటక ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు
1999లో, కెపీసీసీ అధ్యక్షుడిగా, ఇతడు తన పార్టీని అసెంబ్లీ ఎన్నికలలో విజయం వైపు నడిపించాడు, మరియు కర్నాటక ముఖ్యమంత్రిగా 2004 వరకు పనిచేశాడు. ఇతడు ESCOMSలో విద్యుత్ సంస్కరణలు తీసుకురావడంలో విశేష కృషి సల్పాడు. ఇతడు ప్రయివేటు, పబ్లిక్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాడు, బెంగళూరు అడ్వాన్స్ టాస్క్ ఫోర్స్‌ని ఏర్పర్చడంలో అగ్రగామిగా నిలిచాడు. ఇతడు తర్వాత మహారాష్ట్ర గవర్నర్ అయ్యాడు.
2008 మార్చి 5న కృష్ణ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశాడు కర్నాటకలో క్రియాశీల రాజకీయాలలోకి తిరిగి రావాలన్న ఉద్దేశంతోటే ఇలా చేశాడు అప్పట్లో నివేదించబడింది.[1] రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఇతడి రాజీనామాను మార్చి 6న ఆమోదించారు.[2] కృష్ణ రాజ్యసభలో ప్రవేశించారు. తదనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో 2009 మే 22న కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
నిర్వహించిన పదవులు[మార్చు]
- 2వ కర్నాటక శాసస సభ సభ్యుడు 1962–67
- కామన్వెల్త్‌కు భారతీయ పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో సభ్యుడు
- పార్లమెంటరీ కాన్ఫరెన్స్, న్యూజీలాండ్, 1965
- 5వ లోక్‌సభ సభ్యుడు, 1971–1976
- 7వ లోక్‌సభ సభ్యుడు, 1980–1984
- కర్నాటక శాసన మండలి సభ్యుడు 1972–1977
- వాణిజ్యం & పరిశ్రమలు & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, కర్నాటక ప్రభుత్వం 1972–77
- ఐక్యరాజ్యసమితికి భారతీయ ప్రతినిధి బృంద సభ్యుడు, 1982
- కేంద్ర పరిశ్రమల శాఖ సహాయమంత్రి 1983–1984
- 1984–1985లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి
- 9వ కర్నాటక శాసన సభ సభ్యుడు 1989–1992
- స్పీకర్, కర్నాటక శాసన సభ 1989–93
- 1990 మార్చి నెలలో యునైటెడ్ కింగ్‌డమ్‌లో వెస్ట్ మినిస్టర్ వద్ద జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ సెమినార్‌లో ప్రతినిధి
- కర్నాటక ఉప ముఖ్యమంత్రి, 1992–1994
- 1996 ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎన్నికయ్యాడు
- కర్నాటక ముఖ్యమంత్రి అక్టోబరు 1999–2004
- కర్నాటక శాసనసభకు తిరిగి ఎన్నిక: 2004
- గవర్నర్, మహారాష్ట్ర: 2004–2008
- విదేశీ వ్యవహారాల మంత్రి, భారత ప్రభుత్వం: 2009 మే 22 నుంచి ఇప్పటిదాకా
సూచనలు[మార్చు]
- ↑ "ఎస్.ఎమ్. కృష్ణ క్విట్స్ యాజ్ గవర్నర్", ది హిందూ , 6 మార్చ్ 2008.
- ↑ "కృష్ణా రిజగ్నేషన్ యాక్సెప్టెడ్, జమీర్ ఇన్ఛార్జ్ ఆఫ్ స్టేట్", Sify.com, 6 మార్చి 2008.
![]() |
Wikimedia Commons has media related to S. M. Krishna. |
Unrecognised parameter | ||
---|---|---|
Preceded by Unknown |
Member for Mandya 1968–1989 |
Succeeded by Unknown |
Unrecognised parameter | ||
Preceded by Unknown |
Member for Mandya 1996–2006 |
Succeeded by Unknown |
Political offices | ||
Preceded by Jayadevappa Halappa Patel |
Chief Minister of Karnataka 1999–2004 |
Succeeded by Dharam Singh |
Preceded by Mohammed Fazal |
Governor of Maharashtra 2004–2008 |
Succeeded by Sanayangba Chubatoshi Jamir |
Preceded by Pranab Mukherjee |
Minister of External Affairs 2009 – present |
Incumbent |