వి.జి.సిద్ధార్థ
వి.జి సిద్ధార్థ | |
---|---|
జననం | వీరప్ప గంగయ్య సిద్ధార్థ హెగ్డే 23 ఆగష్టు 1959 |
మరణం | (aged 59) |
మరణ కారణం | ఆత్మహత్య |
సమాధి స్థలం | చిక్కమగళూరు, కర్ణాటక, భారతదేశం |
విద్యాసంస్థ | మంగళూరు యూనివర్సిటీ |
వృత్తి | వ్యాపారవేత్త |
బిరుదు | చైర్మన్ & ఎండి, కేఫ్ కాఫీ డే |
బోర్డు సభ్యులు | మైండ్ ట్రీ |
బంధువులు | ఎస్.ఎమ్. కృష్ణ (మామయ్య) |
వి.జి సిద్ధార్థ భారతదేశానికి చెందిన వ్యాపారవేత్త. ఆయన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్.[1]
జీవిత నేపథ్యం
[మార్చు]వి.జి. సిద్ధార్థ కర్ణాటక రాష్ట్రం, చిక్మగుళురులో జన్మించాడు. ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ముంబయిలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రెసిడెంట్, జేఎం క్యాపిటల్ అధినేత మహేష్ కంపానీ వద్ద స్టాక్మార్కెట్ లో మెలకువలు నేర్చుకున్నాడు. ఆయన తరువాత ముంబయి నుంచి తిరిగి బెంగళూరు చేరుకొని ఏడున్నర లక్షలతో శివన్ సెక్యూరిటీస్ అనే స్టాక్ బ్రోకింగ్ కంపెనీని ప్రారంభించి అక్కడ వచ్చిన లాభాలతో చిక్మగళూరులో కాఫీ తోటలు కొన్నాడు. కొన్నాళ్లకు శివన్ సెక్యూరిటీస్ వే2 వెల్త్‌గా మారింది.
సిద్ధార్థ కుటుంబానికి 12 వేల ఎకరాలకు పైగా కాఫీ తోటలు ఉండడంతో రిటైల్ మార్కెట్లోకి అడుగుపెట్టాలనుకొని 1992లో అమాల్గమేటెడ్ బీన్ కాఫీ ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించి విదేశాలకు కాఫీ ఎగుమతి చేసి కేవలం రెండేళ్లలోనే దేశంలోని అతిపెద్ద కాఫీ ఎగుమతిదారుగా కంపెనీని నిలబెట్టాడు.
కెఫే కాఫీ డే
[మార్చు]సిద్ధార్థ 1996లో బెంగళూరులో బ్రిగేడ్ రోడ్లో కెఫే కాఫీ డే పేరుతో తొలి రిటైల్ అవుట్లెట్ ప్రారంభించి ఒక కాఫీ, గంట ఇంటెర్నెట్‌కు రూ.100 వసూలు చేయడంతో ఇది విశేష ఆదరణ పొంది ఇతర ప్రాంతాలకూ దీన్ని విస్తరించి దేశంలో అతిపెద్ద కాఫీ చైన్‌గా అభివృద్ధి చేశాడు. కెఫే కాఫీ డే 2019 నాటికీ దేశవ్యాప్తంగా 17వందల కెఫేలు, 48 వేల వెండింగ్ మిషన్లు ఈ సంస్థకు ఉన్నాయి. వియన్నా, చెక్రిపబ్లిక్, మలేషియా, నేపాల్, ఈజిప్టు లాంటి దేశాల్లో కాఫీడే శాఖలున్నాయి.
మైండ్ ట్రీ
[మార్చు]సిద్ధార్థ ఆతిథ్య రంగంలోని ప్రముఖ ఐటీ సంస్థ మైండ్ ట్రీలో 1999లో రూ.340 కోట్లతో వాటాలు కొనుగోలు చేసి 2019లో మైండ్‌ట్రీలో వాటాలను రూ.3 వేల కోట్లకు అమ్మేశాడు.
వివాహం
[మార్చు]సిద్ధార్థ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ కుమార్తె మాళవిక కృష్ణను 1996లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు అమర్త్య హెగ్డే, ఇషాన్ హెగ్డే ఉన్నారు.[2]
ఐటీ దాడులు
[మార్చు]సిద్ధార్థ కంపెనీల్లో 2017లో ఆదాయపన్ను శాఖ సోదాలు చేపట్టింది. ముంబయి, బెంగళూరు, చిక్మగళూరులోని కాఫీ డే దుకాణాలు, ఎస్టేట్లపై అధికారులు దాడులు నిర్వహించి రూ.650 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేత రూపంలో వివాదాల్లో చిక్కుకున్నాడు.[3]
మరణం
[మార్చు]సిద్ధార్థ 29 జులై 2019న బెంగళూరు నుంచి సకలేశ్పుర్ బయలుదేరి మధ్యలో మంగళూరు వైపు వెళ్లాలని వాహన డ్రైవర్‌కు సూచించడంతో దక్షిణ కన్నడ జిల్లా కోటెపుర ప్రాంతంలో నేత్రావది నది వంతెనపై ప్రయాణిస్తున్న సమయంలో కారు నిలిపివేయాలని డ్రైవర్‌ను ఆదేశించాడు. ఆయన కారు దిగి ఒంటరిగా వంతెనపై నడుస్తూ ఫోన్ మాట్లాడుతూ కనిపించకుండాపోవడంతో డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.[4] 36గంటల గాలింపు చర్యల తర్వాత నదిలో జులై 31న మృతదేహం లభ్యమైంది. సిద్దార్థ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్దారించారు.[5]
మూలాలు
[మార్చు]- ↑ News18 Telugu. "వీజీ సిద్దార్థ ప్రస్థానం.. కాఫీ కింగ్‌గా ఎలా ఎదిగాడు." Retrieved 17 May 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) - ↑ The Economic Times (2020). "Malavika Hegde | Coffee Day New CEO: A year after VG Siddhartha's death, wife Malavika Hegde takes charge of Coffee Day as new CEO". Retrieved 17 May 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ ETV Bharat News (30 July 2019). "'కాఫీ డే' సిద్ధార్థకు అన్ని వేల కోట్లు అప్పులా..?". Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
- ↑ Vaartha (30 July 2019). "'కేఫ్ కాఫీ డే' వ్యవస్థాపకుడు వి.జి సిద్ధార్థ అదృశ్యం". Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
- ↑ The Economic Times (31 July 2019). "CCD founder death | VG Siddhartha: Cafe Coffee Day owner VG Siddhartha dead, body found". Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.